చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

అమరావతిలో గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

విద్యుత్ వెలుగులతో విరజిమ్ముతున్న భవనాలు

by చైతన్యరధం
January 26, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
అమరావతిలో గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పాల్గొననున్న గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు
  • విద్యుత్ వెలుగులతో విరజిమ్ముతున్న భవనాలు
  • ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర రాజధాని అమరావతిలో మొట్ట  మొదటిసారిగా నిర్వహిస్తున్న 77వ గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం అయింది. ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా నిర్వహిస్తుంది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. సోమవారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, ఉన్నత అధికారులు ఇందులో పాల్గొననున్నారు. రాష్ట్ర రాజధాని అమ రావతిలో మొట్ట మొదటిసారిగా నిర్వహిస్తున్న 77వ గణతంత్ర వేడుకలకు జంగారెడ్డి గూడెం ఏఎస్పీ, ఐపీఎస్ అధికారి ఆర్. సుస్మిత పరేడ్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. భారత ఆర్మీ, ఆంధ్రప్రదేశ్ 2వ పోలీస్ బెటాలియన్, సీఆర్పీఎఫ్, పోలీసు సాయుధ దళాలు, ఆంధ్రప్రదేశ్ 16వ పోలీస్ బెటాలియన్, బాలురు, బాలికల విభాగాల ఎన్సీసీ క్యాడెట్స్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థల విద్యార్థులు, రెడ్ క్రాస్ యువ దళం కంటింజెంట్స్, స్పెషల్ పోలీస్ బ్రాస్ బాండ్, స్పెషల్ పోలీస్ భారత ఆర్మీ మ్యూజిక్ బాండ్లు ఇందులో పాల్గొనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై 22 శాఖలు  శకటాలను ప్రదర్శించనున్నాయి. ఏర్పాట్ల పరిశీలనలో జేసీ ఆశుతోష్ శ్రీవాస్తవ, గుంటూరు నగరపాలక సంస్థ కమి షనర్ కె. మయూర్ అశోక్, ప్రోటోకాల్ సంచాలకులు మోహన రావు, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

శాసనమండలి, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టుల్లో జెండా ఆవిష్కరణలు
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సోమవారం ఉదయం 8 గంటలకు అసెంబ్లీ భవనం ప్రాంగ ణంలో జరిగే వేడుకల్లో శాసన మండలి అధ్యక్షుడు కె. మోషేన్ రాజు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఉదయం 8.15 గంటలకు రాష్ట్ర అసెంబ్లీ భవనం వద్ద రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఏపీ సచివాలయం మొదటి భవనం వద్ద సోమవారం ఉదయం 7.30 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. నేలపాడు ఉన్నత న్యాయస్థానం వద్ద సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.

విద్యుద్దీపాలతో విరజిమ్ముతున్న భవనాలు
గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా అసెంబ్లీ, సచివాలయ భవనాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుంద రంగా తీర్చిదిద్దారు. సచివాలయంలోని 5 భవనాలు సహా అసెంబ్లీ భవనాన్ని వివిధ రకాల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించడంతో రాత్రి సమయంలో విద్యుత్ కాంతులతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఆయా భవనాలతో పాటు అసెంబ్లీ, సచివాలయం ప్రాంగణాల్లోని రోడ్లకు ఇరు వైపులా రహదారులు, సెంట్రల్ పార్కులో వివిధ రంగులతో కూడిన ప్రత్యేక విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో సచి వాలయ ప్రాంగణమంతా విద్యుత్ వెలుగులతో ఒక పండుగ వాతావరణం నెలకొంది. సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే మొదటి భవనాన్ని త్రివర్ణ పతాక వర్ణం ఉట్టిపడేలా ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అదేవిధంగా సచివాలయ ప్రైవేశ మార్గానికి సమీపంలోని ఐదవ భవనాన్ని, అసెంబ్లీ భవనాన్ని కూడా ఇదే రీతిలో అలంకరించడంతో ఈ భవనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా విజయ వాడ లోక్ భవన్, ఉండవల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సహా ప్రకాశం బ్యారేజ్, ఇతర చారిత్రక ప్రాముఖ్యత గల భవనాలు ప్రముఖ కట్టడాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

వాహనదారులకు ట్రాఫిక్ డైవర్షన్ సూచనలు
తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపూడి గ్రామంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే వీవీఐపీలు, వీఐపీలు, ఇతర ప్రముఖులు, ప్రజల వాహనాల రాకపోకల కోసం ఈ క్రింది ట్రాఫిక్ మార్గాలను కేటాయించారు.
రూట్ – 1: VVIP,AA, A1, A2 పాసులు, రైతులు లోటస్ -కరకట్ట మీదుగా – ఎమ్మెస్సార్ ఆశ్రమం సీడ్ యాక్సెస్ రోడ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎడమవైపు నుంచి వేడుకల మైదానానికి చేరుకోవాలి. రూట్ – 2: బి1, బి2 పాస్ హోల్డర్స్, రైతులు ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందుకు వెళ్లి వెస్ట్ టైపాస్ రోడ్డు నుంచి వేడుకల మైదానములోకి చేరుకోవాలి. గుంటూరు నుంచి వచ్చు సాధారణ వాహనాలు మురుగన్ హోటల్ సెంటర్ నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లి ఈ8 రోడ్డు అండర్ పాస్ – మందడం గ్రామం వెలగపూడి గ్రామం- మోదుగు లింగాయపాలెం – ఈ 4  పాతవెలగపూడి రోడ్డు జంక్షన్ నుండి ఈ4 రోడ్ పార్కింగ్ ప్రదేశానికి వెళ్లవలెను. విజయవాడ వైపు నుంచి వచ్చు సాధారణ వాహనాలు విజయవాడ ప్రకాశం బ్యారేజ్- ఉండవల్లి ఉండవల్లి గుహలు పెనుమాక – కృష్ణయ్యపాలెం – మందడం- వెలగపూడి ఈ4 రోడ్డు జంక్షన్ – మోదు లింగాయపాలెం ఈ4 రోడ్ పార్కింగ్ వెళతారు. గొల్లపూడి నుంచి వచ్చు సాధారణ వాహనాలు విజయవాడ -వెంకటపాలెం – ఈ8 అండర్ పాస్ మందడం వెలగపూడి ఈ4 జంక్షన్ – మోదులింగాయపాలెం ఈ రోడ్ పార్కింగ్ ప్రదేశానికి వెళతారు.
తుళ్లూరు నుంచి వచ్చు సాధారణ వాహనాలు తుళ్లూరు – ఈ6 వెస్ట్ పార్క్ రోడ్ హైకోర్టు ఈ ఫోర్ జంక్షన్ నుంచి ఈ4 పార్కింగ్ ప్రదేశానికి వెళతారు. హైకోర్టు లాయర్స్ వాహనాలు ప్రకాశం బ్యారేజ్ ఉండవల్లి ఉండవల్లి కేవ్స్ – పెనుమాక కృష్ణాయపాలెం మందడం వెలగపూడి- ఈ 4 రోడ్డు పార్కింగ్ ప్రదేశానికి వెళతారు. అందరూ పోలీస్ వారి సూచనలు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

 

Previous Post

రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం

Next Post

లోకేష్ కు గ్రాండ్ వెల్కమ్

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-11-2026

November 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-11-2026

November 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-11-2026

November 17, 2026
రామోజీరావు ప్రతిఒక్కరికీ ఆదర్శం
ఆంధ్రప్రదేశ్

రామోజీరావు ప్రతిఒక్కరికీ ఆదర్శం

November 17, 2026
రామోజీ సేవలు దేశానికి స్పూర్తి
ఆంధ్రప్రదేశ్

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

November 17, 2026
తెలుగు జాతి కీర్తి రామోజీ
ఆంధ్రప్రదేశ్

తెలుగు జాతి కీర్తి రామోజీ

November 17, 2026
Next Post
లోకేష్ కు గ్రాండ్ వెల్కమ్

లోకేష్ కు గ్రాండ్ వెల్కమ్

ముఖ్య వార్తలు

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

by చైతన్యరధం
November 17, 2026

విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....

తెలుగు జాతి కీర్తి రామోజీ

తెలుగు జాతి కీర్తి రామోజీ

by చైతన్యరధం
November 17, 2026

అక్షరాలు, విశ్వసనీయత, విలువలే ఆయుధాలు ఆయన సృష్టించిన వ్యవస్థలు తెలుగుజాతి ఆస్తి ఇక నుంచి అధికారికంగా జయంతి నిర్వహిస్తాం అమిత్ షా రావడం గౌరవంగా భావిస్తున్నాం ఎక్సలెన్స్...

పంచాయతీల్లోనూ సత్తా చాటాలి

పంచాయతీల్లోనూ సత్తా చాటాలి

by చైతన్యరధం
November 15, 2026

గ్రామస్థాయి ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు కూటమి బలపరిచిన అభ్యర్థులే గెలవాలి కొందరు హింసనే నమ్ముకుంటారు... కూటమి ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది ప్రజలకు మంచి చేయడానికే అధికారం వైసీపీ తప్పుడు...

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

by చైతన్యరధం
November 13, 2026

యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

పెట్టుబడులే కాదు..ఉత్పత్తి కూడా ప్రారంభించాలి

by చైతన్యరధం
October 23, 2026

విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 19-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 19-11-2026

by కార్యకర్త
November 19, 2026

చైతన్యరధం ఈ పేపర్ 18-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 18-11-2026

by కార్యకర్త
November 18, 2026

చైతన్యరధం ఈ పేపర్ 17-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 17-11-2026

by కార్యకర్త
November 17, 2026

రామోజీరావు ప్రతిఒక్కరికీ ఆదర్శం

రామోజీరావు ప్రతిఒక్కరికీ ఆదర్శం

by చైతన్యరధం
November 17, 2026

విజయవాడ(చైతన్యరథం): మన కోసం మనం సాధించేది విజయం.. సమాజం కోసం మనం చేసేది భావితరాలకు అందిం చే స్ఫూర్తి..అలాంటి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి రామోజీరావు. ఆయన అడుగు జాడలు,...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.