- ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి
- విపత్తులకు భయపడాల్సిన అవసరం లేదు
- మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు
- రియల్ టైమ్లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలి
- పునరావాస చర్యలకు అధికారులకు ఆదేశం
అమరావతి(చైతన్యరథం): అక్వాన్ తుఫాన్ గమనంపై మంగళవారం సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గంటకు 3 కి.మీ వేగంతో తుఫాన్ కదులుతోందని, మంగళవారం సాయంత్రానికి తుఫాన్ తీవ్రతపై మరింత స్పష్టత వస్తుందని ఆర్టీజీఎస్ అధికా రులు వివరించారు. తీవ్ర తుఫానుగా మారే ప్రమాదముందని చెప్పారు. చెన్నైకి 610 కి.మీ,మచిలీపట్నానికి 660 కి.మీ, విశాఖపట్నానికి 670 కి.మీ, ఒడిశాలోని గోపాలపూరు 790 కి.మీ దూరంలో ప్రస్తుతం తుఫాన్ కేంద్రీకృతమైందన్న వివరించారు. అక్వాన్ తుఫాన్ కారణంగా
19, 20వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. తుఫాన్ తీరం దాటే సమయంలో ఈదురుగాలులకు అవకాశముందని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి
చంద్రబాబు మాట్లాడు తూ ఇటీవల కాలంలో రాష్ట్రాన్ని మూడో తుఫాన్ తాకుతోంది.
విపత్తులు వచ్చాయని భయపడాల్సిన అవసరం లేదు… వాటి ప్రభావం ప్రజలపై పడకుండా చర్యలు
తీసుకోవాలని సూచిం చారు. ప్రజలకు, తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపుతూనే ఉండాలని స్పష్టం చేశారు. స్వర్ణ గ్రామ, స్వర్ణవార్డు సిబ్బంది ద్వారా
తుఫాన్ ప్రభావిత ప్రాం తాల్లోని ప్రజలకు నేరుగా సమాచారం అందించాలని సూచిం చారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంతటి పెద్ద విపత్తు సంభవించినా తమను ఆదుకోవడానికి ప్రభుత్వం, అధికారులు ఉన్నారనే భరో సా కల్పించాలి. చెట్లు కూలినా… విద్యుత్ స్థంభాలు నేలకొరిగినా వెంటనే క్లియర్ చేసేలా పునరుద్ధరణ పనులు చేపట్టాలని తెలి పారు. రియల్ టైమ్లో అంచనాలు వేస్తూ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని, ప్రభావిత
ప్రాంతాల్లో పునరావాసం కల్పించాలని చెప్పారు. తుఫాన్ కారణంగా చెరువులు, కాల్వలకు గండ్లు పడ కుండా జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు.




















