- వారికి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం
- గత ప్రభుత్వంలో బీసీలపై వేధింపులు
- రక్షణ చట్టానికి తుది రూపు తీసుకొస్తున్నాం
- సాధికార సమితి కన్వీనర్లతో మంత్రి సవిత
- సీఎంకు బిజినెస్ రిఫార్మర్ అవార్డుపై హర్షం
అమరావతి(చైతన్యరథం): సీఎం చంద్రబాబు గుండె చప్పుడు బీసీలు..వారి అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీ రక్షణ చట్టానికి తుది రూపు ఇస్తున్నా మని వివరించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వే షన్ల కల్పనకు డెడికేటెడ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో టీడీపీ బీసీ సాధికార సమితి కన్వీనర్లు, జోనల్ కో ఆర్డినేటర్లతో శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రాధాన్యం కల్పించడానికే బీసీ సాధికార సమితులను సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సమావేశం ద్వారా ఆదరణ 3.0 పథకం అమలుపై సాధికార సమిత కన్వీనర్ల అభిప్రాయాలు, సల హాలు, సూచనలు తెలుసుకోనున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వంలో బీసీలను అణగదొక్కారు
గత రాక్షస ప్రభుత్వంపై బీసీ సాధికార సమితులు అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. బీసీ నేత తోట చంద్రయ్య, కాకినాడ జిల్లాలో లాలం బంగారయ్య తమ ప్రాణాలు పోయినా పసుపు జెండా వదల్లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా అడ్డుకున్న వైసీపీ రాక్షస మూకలను చూసి తొడగొ ట్టిన అంజిరెడ్డి తాత తెగువను మరిచిపోలేం. గత ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి ప్రశ్నించిన పాపానికి బీసీలపై 26 వేలకు పైగా అక్రమ కేసులు బనాయించారు. దాడులు, హత్యలు చేశారు. బీసీ సబ్‌ప్లాన్ నిధులు రూ.75,760 కోట్లకు పైగా నిధులను దారి మళ్లించారని తెలిపారు. స్థానికసంస్థల్లో 34 శాతం ఉన్న రిజర్వే షన్లను 24 శాతానికి కుదించి బీసీలను 16 వేలకు పైగా పదవు లకు దూరం చేశారు. ఆదరణ పథకాన్ని నిలిపేసి బీసీ కుల వృత్తు లను నిర్వీర్యం చేశారు. పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని, రాబో యే స్థానిక సంస్థల ఎన్నికల్లో పసుపు జెండా రెపరెపలాడాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం బీసీ సాధికార సమితి కన్వీనర్లను, జోనల్ కో ఆర్డినేటర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, మల్లె ఈశ్వరరావు, పేరేపి ఈశ్వర్, కె.సత్తిబాబు, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబుకు అభినందనలు
అంతకుముందు విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబా బుకు ఎకనమిక్ టైమ్స్ మీడియా సంస్థ బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందజేయడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా దక్షతకు ఈ అవార్డే నిదర్శనమని కొనియాడారు.















