- రెండు రోజులు హస్తినలోనే
- ఎన్డీఏ, నీతి ఆయోగ్ సమావేశాల్లో పాల్గొననున్న సీఎం
అమరావతి (చైతన్యరథం): సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళు తున్నారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. 11వ తేదీ గురువారం రాష్ట్రపతి భవన్లో నిర్వహించే నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు సీఎం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 9.00 గంటలకు అమరావతి చేరుకుంటారు.
















