- ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు
- ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
- అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
- ఎప్పటికప్పుడు ప్రజలకు హెచ్చరిక సందేశాలు
- జీరో ఇన్సిడెంట్స్ లక్ష్యంగా అప్రమత్తంగా ఉండాలి
- జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలి
- ముందస్తు సన్నద్ధతపై సమీక్షలో సీఎం చంద్రబాబు
అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో ముందస్తు సన్నద్ధతపై సీఎం చంద్రబాబు ఆదివారం అధికారులతో సమీక్షించారు. అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పా టు చేయాలని సూచించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకూడదు… ఆస్తినష్టం సాధ్యమైనంత తగ్గించాలని ఆదేశించారు. ప్రజల ఫోన్లకు నిరంతరం సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని, తీర ప్రాంతాల్లో గ్రామాల ప్రజలను సన్నద్ధం చేయాలని సూచించారు. విద్యుత్ శాఖ పూర్తి సన్నద్ధతతో ఉండి విద్యుత్ పునరుద్ధరణ వేగంగా జరిగేలా చూడాలి.. సముద్రంపై వేటకు వెళ్లిన అన్ని బోట్లు తీరానికి వచ్చేలా చూడాలి.. జీరో ఇన్సిడెంట్స్ లక్ష్యంగా అన్ని స్థాయిలలో ప్రభుత్వ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గర్భిణులను ముందే ఆసుపత్రులకు తరలించాలి
తుఫాన్ వల్ల గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోం ది. విద్యుత్ శాఖ పూర్తి సన్నద్ధతతో ఉండి విద్యుత్ పునరుద్ధరణ వేగంగా జరిగేలా చూడాలి. సముద్రంపై వేటకు వెళ్లిన అన్ని బోట్లు తీరానికి వచ్చేలా చూడాలి. భారీ వర్షాలతో వచ్చే వరదతో నీటి వనరులను నింపేందుకు అవసరమైన అన్ని చర్యలు ఇరిగేషన్ శాఖ తీసుకోవాలి. జీరో ఇన్సిడెంట్స్ లక్ష్యంగా అన్నిస్థాయిలలో ప్రభుత్వ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలి. ఒకసారి తుఫాన్ ప్రభావం మొదలై రాకపోకలకు ఆటంకం కలిగితే గర్భిణీలు ఇబ్బందులు పడతారు. ఈ వారంలో కాన్పులు అయ్యే గర్భిణీలను ముందుగానే ఆసుపత్రికి తరలించాలి. తాగునీరు, ఆహారం పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలి. వీటికి నిధుల కొరత లేకుండా కలెక్టర్లు చూసుకోవాలి. పునరావాస కేంద్రాల్లో వసతులు, సౌకర్యా లు ఉండాలి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజల నుంచి చిన్న ఫిర్యాదు కూడా రాకూడదు. సెల్ఫోన్ నెట్వర్క్ దెబ్బతింటే వెంటనే పునరుద్ధరించేలా ఏజెన్సీలను సిద్ధం చేయాలి. ఈ విషయంలో జాప్యం చేయరాదని ఆదేశించారు. సివిల్ సప్లై, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యుత్, హోం, ఫైర్, వ్యవసాయ శాఖ అధికా రులు తుఫాను సన్నద్ధత చర్యలను సీఎంకు వివరించారు.
విశాఖ-బాపట్ల మధ్య 28వ తేదీన తీరం దాటే అవకాశం
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫాన్ బలపడే అవకాశం ఉందని అధికారులు వివరించా రు. అక్టోబరు 28 మధ్యాహ్నానికి బాపట్ల – విశాఖపట్నం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనాల్లో కోనసీమ-యానాం-కాకినాడ తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా సుమారు 850 కిలోమీటర్లు, కాకినాడకు సుమారు 930 కిలోమీటర్ల దూరంలో వాయుగుండంగా ఉంది. అక్టోబరు 26 సోమవారం ఉదయానికి తుఫాన్గా, అదేరోజు రాత్రికి తీవ్ర తుఫాన్గా, 27న అతి తీవ్ర తుఫాన్గా బలపడుతుంది. తీరం దాటే సమయంలో గంటకు 115 125 కిలోమీటర్ల వేగంతో గాలులు… కొన్ని సందర్భాల్లో 140 కిలోమీటర్ల వేగంతో ఈదు రుగాలులు వీచే అవకాశం ఉంది అని అధికారులు వివరిం చారు. ప్రతి నాలుగు గంటలకు తుఫాన్పై బులిటెన్ -విడుదల చేయాలని సీఎం సూచించారు.
భారీ, అతి భారీ వర్షాలు
తుఫాన్ ప్రభావంతో అక్టోబరు 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రపైనా గాలులు, వర్ష ప్రభావం ఉంటుంది, అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా సగటున 292.55 మి.మీ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 281.17 మి.మీ, విశాఖపట్నంలో 253.87 మి.మీ, శ్రీకాకుళంలో 249.18 మి.మీ వర్షపాతం పడవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజుల సగటు మొత్తం వర్షపాతం 95 మి.మీ.గా ఉంటుందని అంచనా వేయగా… ప్రభావిత జిల్లాల్లో సగటున 22-29 సెం.మీ వర్షపాతానికి అవకాశం ఉందని అధికారులు వివరిం చారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, డీజీపీ హరీష్ గుప్తా, జిల్లా కలెక్టర్లు, రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులు, వ్యవసాయం, విద్యుత్, ఇరిగేషన్, హోం, వైద్య ఆరోగ్య, పౌర సరఫరాలు, మున్సిపల్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
