- ఆధునిక ఉక్కు మనిషి ప్రధాని మోదీ వజ్ర సంకల్పం నెరవేరాలి
- వెంకటపాలెం వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంత్రి నారా లోకేష్ పూజలు
అమరావతి (చైతన్యరథం): దేశ శ్రేయస్సు-ప్రజా సంక్షేమమే లక్ష్యంగా 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానం పూర్తిచేసుకున్న ఆధునిక ఉక్కు మనిషి ప్రధాని నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆయన వికసిత్ భారత్ వజ్ర సంకల్పం నెరవేరాలని ప్రార్థిస్తూ అమరావతిలో ని వెంకటపాలెం వేంకటేశ్వరస్వామి ఆలయం లో మంత్రి నారా లోకేష్ పూజలు నిర్వహించా రు. స్వామివారిని దర్శించుకున్నారు. 2001 అక్టోబరు 7వ తేదీన గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలైన మోదీ ప్రస్థానం నేటితో 25 ఏళ్లు (రజతోత్సవం) పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీద వెంకట పాలెం ఆలయంలో లోకేష్ పూజలు చేశారు.ప్రపంచంలోనే మన దేశం అన్ని రంగాల్లో నెం.1గా ఉండాలనే లక్ష్యంతో నిస్వార్థంగా పని చేస్తున్న ఆధునిక ఉక్కు మనిషి నరేంద్ర మోదీకి ఆ శక్తియుక్తులన్నీ దేవుడు ప్రసాదించాలని లోకేష్ ప్రార్థించారు. మోదీ ప్రజా సేవా ప్రస్థా నాన్ని దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ యాత్రగా నిర్వహించడం దేశాభివృద్ధి కోసం ప్రధాని చేస్తున్న కృషికి నిదర్శనమని లోకేష్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
















