- కేంద్రంతో సమన్వయం చేసుకుని ఔటర్ రింగ్ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని ఆదేశం
అమరావతి(చైతన్యరథం): రాజధాని అమరావతిలో నెలకు రూ. 2వేల కోట్ల విలువైన పను లు జరిగేలా ప్రణాళికతో పనిచేయాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. అమరావతి పనులపై మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో అధికారులు, కాంట్రాక్టసంస్థల ప్రతినిధులతో నెలవారీసమీక్ష నిర్వహించారు. రాజధాని పరిధిలో చేపట్టిన 152 ప్రాజెక్టుల్లో 41వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని పురపాలకశాఖ మంత్రి నారా యణ తెలిపారు. పనుల పరోగతిని, ఆయా ప్రాజెక్టుల స్థితిగతులను అధికారులు వివరిం చారు. గడిచిననెలలో రాజధానిలో రూ.1,345 కోట్ల విలువైన పనులు చేసినట్టు చెప్పారు. వీటిని రూ.2వేలకోట్లకు తీసుకువెళ్లాలని సీఎం కోరారు. రాజధాని నిర్మాణంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును పట్టాలెక్కించాలన్నారు. దీనికోసం కేంద్రంతో సమన్వయం చేసుకోవా లని సూచించారు. రాజధాని పనుల్లో ఎక్కడా అశ్రద్ధ, నిర్లక్ష్యం లేకుండా వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని చెప్పారు. ఐకానిక్ భవనాల నిర్మాణాల విషయంలో ఎక్కడా పనులు ఆలస్యం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. సచివాలయ టవర్లు, అసెంబ్లీ భవనం ఐకానిక్ ఉండాలన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తరహాలోనే నిర్మాణ రంగంలోని వారికి ఆధునిక నైపుణ్యాలు అందించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు.















