- వ్యవసాయ, కిసాన్ డ్రోన్లకు చెందిన పెండింగ్ నిధులు విడుదల చేయండి
- కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు లేఖలు ఖరీఫ్ పంటల 100% సేకరణకు
- ముందస్తు ఆమోదం కోసం విజ్ఞప్తి మరో 6 లక్షల ఇళ్ల మంజూరుకు వినతి
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో రైతులకు మేలు చేకూర్చేలా, అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేసి లబ్ధి కలిగించేలా కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను రాసిన లేఖలో సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇళ్లు కల్పించేలా అదనపు ఇళ్లను మంజూరు చేయాలనే అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఖరీఫ్-2026కి సంబంధించి పీఎం-ఆశా పథకం కింద కందులు, పెసలు, మినుములు, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి, కొర్ర, వేరుశనగ వంటి 9 రకాల పంటల అంచనా దిగుబడిని 100 శాతం ఏపీ మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయడానికి ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించి, తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి తప్పుతుందని పేర్కొన్నారు. కృష్ణా, కాకినాడ జిల్లాల్లో నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్ ఆధారంగా చేసిన మార్పులను ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌లో చేర్చాలని, 2 2026-27 6໖ సీజన్ నాటికి ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేయవచ్చని వివరించారు. ఆర్కేవీవై కిసాన్ డ్రోన్ కార్యక్రమానికి ఆమో దించిన రూ.52.164 కోట్ల పెండింగ్ నిధులను త్వరగా విడుదల చేయాలని కోరారు. ఈ నిధులు అందితే రాష్ట్రంలోని 1,130 గ్రామాల్లో యంత్ర పరికరాల బ్యాంకుల ఏర్పాటు ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తవుతుందని లేఖలో తెలిపారు. అలాగే 5.69 లక్షల మట్టి నమూనాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న రూ.10.24 కోట్ల కమిటెడ్ లయబిలిటీ నిధులను, 2026-27 సంవత్సరానికి రావలసిన రూ.61.97 లక్షల మిగులు కేటాయింపులను వెంటనే విడుదల చేయాలని కోరారు.
హౌసింగ్ ఫర్ ఆలు సహకరించండి
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న హౌసింగ్ ఫర్ ఆల్ లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలుపుతూ మరో లేఖ రాశారు. 3 లక్షల కొత్త ఇళ్లను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీంతోపాటు.. మరిన్ని ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత గృహ అవసరాలు తీరాలంటే మరో 6 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు. రాష్ట్రంలో మిగిలి ఉన్న గ్రామీణ గృహ అవసరాలను పూర్తిగా తీర్చి, 2029 నాటికి ప్రతి పేద కుటుంబానికి శాశ్వత ఇల్లు అందించా లన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. 6 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే ఆ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి శివరాజ్సంగ్ చౌహాన్ ఈ అంశాలపై వ్యక్తిగత చొరవ తీసుకుని నిధుల విడుదల, అవసరమైన అనుమతుల ప్రక్రియ వేగవంతం అయ్యేలా సంబంధిత అధికారులను ఆదేశిం చాలని విజ్ఞప్తి చేశారు.














