అమరావతి(చైతన్యరథం): వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో జర్నలిస్ట్‌గా మారారు. ఫొటో జర్నలిస్టులు అందరిని కలిపి ఆయన సరదాగా కెమెరా తీసుకుని గ్రూప్ ఫొటో తీశారు. వరల్డ్ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో సీఎంను ఫొటో జర్నలిస్ట్‌లు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఈ సన్నివేశం చోటుచేసుకుంది. ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా స్పందిస్తూ చరిత్రను నమోదు చేస్తూ.. జ్ఞాపకాలను పదిలపరుస్తున్న ఫొటోగ్రాఫర్లకు అభినందన లు తెలిపారు. మీడియా, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లను కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఫొటోగ్రాఫర్ల అంకితభావం, కళాత్మకత, నిరంతర కృషి అభినందనీయమని ప్రశంసించారు. ఎన్నో చెప్పని కథలకు ఫొటోగ్రాఫర్లు తమ చిత్రాల ద్వారా గొంతుకనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రతి ఫొటో భవిష్యత్తు తరాల కోసం కాలంలోని ఓ మధురమైన ఘట్టాన్ని పదిలపరు స్తుందని వివరించారు. ప్రజలకు సమాచారం, స్ఫూర్తి అందించేలా చిరస్థాయిగా నిలిచే క్షణాలను మరింతగా బంధించా లని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు.












