- మూడువారాల ఫిజియోథెరపీ రెఫర్ చేశారు
- విశ్రాంతి అవసరమని సూచించాను
- పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజాసేవలోకి వస్తారు
- పరామర్శ అనంతరం సీఎం చంద్రబాబు
ముంబయి(చైతన్యరథం): ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ముంబయిలోని కోకిలాబెన్ ధీరుబాయ్ అంబానీ ఆస్పత్రిలో శస్త్రచికిత్స విజయవం తంగా పూర్తిఅయింది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను పరా మర్శించారు. ఆయనతోపాటు మంత్రులు నారాయణ,అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. సీఎం వచ్చే సమయానికి ఆస్పత్రిలోనే ఉన్న మంత్రి,జనసేనపార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ తదితరులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న పవన్ కళ్యాణ్ వద్దకు చంద్రబాబును తీసుకుని వెళ్లారు. పవన్ కళ్యాణ్ తో ప్రత్యే కంగా మాట్లాడి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని పరామర్శించారు. ఆయన సతీ మణి అన్నా కొణిదలతోనూ మాట్లాడారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యుల తోనూ మాట్లాడి వివరాలు అడిగి తెలుసు కున్నారు. అనంతరం ఆస్పత్రి వద్దనే మీడి యా ప్రతినిధులతో మాట్లాడారు. ‘ప్రజా క్షేత్రంలోకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నూతనోత్సాహంతో, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారు..ఆయనకు చాలా కీలకమైన శస్త్రచికిత్స జరిగిందని తెలిపారు.
మూడు న్నర గంటలపాటు అత్యున్నత వైద్యుల బృందం విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ఏళ్ల తరబడి ఉన్న తీవ్రమైన గాయాన్ని ఆయన ప్రజాసేవలో నిమగ్నమై నిర్లక్ష్యంచేశారు. ఇప్పుడు శస్త్రచికిత్స విజ యవంతం కావడంతో ఆయన పూర్తిగా కోలుకుంటున్నారని చెప్పారు. కుడి భుజా నికి ఆపరేషన్ విజయవంతం అయింది. దాని తర్వాత వైద్యుల పర్యవేక్షణ, ఫిజియో థెరపీ వంటివి ఉంటాయి. మూడు వారాల పాటు వైద్యుల పర్యవేక్షణల ఫిజి యోథెరపీ చేయడం వల్ల భుజానికి ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది. రెండో భుజానికి కూడా సమస్య ఉందని వైద్యులు తెలిపారు. కుడి భుజానికి ఉన్న సమస్య తీరిన తర్వాత ఆరు నెలలు వేచి చూసి మళ్లీ వైద్యులు పరీక్షలు చేస్తారు. అప్పుడు ఎడమ భుజా నికి ఆపరేషన్ అవసరం అవుతుందా? లేక ఫిజియోథెరపీతో పరిష్కారం అవుతుందా అన్నది తేలుతుంది. పవన్ కళ్యాణ్ మును పటి ఉత్సాహంతో పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజాసేవలోకి తిరిగివస్తారు. ఆయన ఆరో గ్యం ప్రస్తుతం చాలా నిలకడగా ఉంది. వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోందని చెప్పారు.

















