- రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం అపూర్వం
- దేశంలోనే నిధుల కేటాయింపులో మూడో స్థానం
- గత ప్రభుత్వంలో 24వ స్థానం..నేడు మొదటి స్థానం
- 125 రోజులకు పని దినాలు పెంపుతో ఉపాధి భరోసా
- వీబీ జీ రామ్‌జీ ప్రారంభోత్సవంలో పవన్‌కళ్యాణ్
రైల్వేకోడూరు(చైతన్యరథం): భవిష్యత్తు భారతదేశం కేవలం నగరాల అభివృద్ధిలోనే లేదు.. సంపన్నమైన, సమ్మిళిత అభివృద్ధి కలిగిన గ్రామాల్లో ఉంది.. గ్రామీణ భారతానికి కొత్త శక్తినిచ్చేలా “వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ” (వీబీజీరామ్‌జీ) పథకం నూతనంగా సేవలు అందించ నుందని ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్ర దేశ్ ప్రగతికి, భవిష్యత్తుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకా రం ఎనలేనిది. దేశంలో వీబీ జీ రామ్ జీ నిధుల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం తృతీయ స్థానం కల్పించడం కేంద్రం అందిస్తున్న సహకారానికి మచ్చుతునక అని కొనియాడా రు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలో మొదలు పెట్టబోతున్న వీబీ జీ రామ్ జీ పథకాన్ని గురువారం రైల్వే కోడూ రు నియోజకవర్గం ముక్కావారిపల్లెలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్, సీఎం చంద్రబాబు, పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్‌తో కలిసి లాంఛనంగా ప్రారం భించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పవన్‌కళ్యాణ్ మాట్లా డుతూ “జాతీయస్థాయి కార్యక్రమానికి రైల్వేకోడూరు నియోజక వర్గం వేదిక కావడం ఆనందంగా ఉంది.
ఇటీవల ఢిల్లీ పర్యటన లో శివరాజ్ సింగ్ చౌహన్‌ని కలిసి పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించాలని కోరిన వెంటనే ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రామికుల పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం ద్వారా అదనంగా 25 రోజులు ఉపాధి భరోసా లభిస్తుంది. దీని ద్వారా పల్లెల్లో ఆర్థిక వృద్ధి పెరుగుతుం ది. పథకంలో 2026- 27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రూ.7,700 కోట్లను కేటాయిం చింది. రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కలుపుకుంటే రూ.12,845 కోట్లను పథకానికి ఖర్చు చేయనున్నాం. ఇది భారతదేశంలోనే మూడవ అతిపెద్ద కేటాయిం పు అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో 24వ స్థానంలో అట్టడుగున ఉన్న రాష్ట్రాన్ని 1వ స్థానానికి తీసుకువచ్చేలా పనిచేశాం. 2025లో జాతీయ పురస్కారాలను సాధించడంలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది. అభివృద్ధి అంటే కేవలం పనులు చేయడమే కాదు ఆ పనులు చేసే శ్రామికుల జీవనానికి కూడా భరోసా అందించే కార్యక్రమం కావాలి అని తెలిపారు.















