చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రైతుకు ప్రజాప్రభుత్వం అభయం 

అన్నదాత సుఖీభవ, స్వచ్ఛాంధ్రలో సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
Jun 21, 2026 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • త్వరలో అన్నదాతల ఇంటికి ప్రజాప్రతినిధులు
  • విత్తనాల నుంచి మార్కెటింగ్ వరకూ అండ
  • ప్రకృతిసేద్యంతో భూమికి ప్రయోజనం, ఆరోగ్యం
  • క్రిమిసంహార ఉత్పత్తులు ప్రపంచదేశాలు తీసుకోవు
  • మూడు మిర్చి కంటైనర్లను చైనా తిప్పి పంపింది
  • పురుగుమందులు, ఎరువులకు విరుగుడు ప్రకృతిసేద్యం
  • మూడు కార్యక్రమాల్లో పొల్గొనడం ఆనందంగా ఉంది
  • కూటమి రెండేళ్ల పాలనపై త్వరలో ప్రోగ్రెస్ రిపోర్టులు
  • అన్నదాత సుఖీభవ, స్వచ్ఛాంధ్రలో సీఎం చంద్రబాబు
  • కడప, కర్నూలు వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల శంకుస్థాపన
  • అన్నదాత సుఖీభవ కింద రూ.3,125 కోట్లు విడుదల
  • నెట్ జీరో కింద అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్ లు

చిలకలూరిపేట (చైతన్యరథం): ప్రకృతి సేద్యంతోనే  అటు రైతులకు, ఇటు భూమికి ప్రయోజనం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మితిమీరిన ఎరువులు, పురుగుమందుల వాడకంతో రైతులు పండించిన పంటలతో పాటు, ప్రజారోగ్యానికి, భూసారానికి నష్టం కలుగుతోందని పేర్కొన్నారు. క్రిమి సంహారక  మందుల వినియోగం కారణంగా ఇటీవల మూడు మిర్చి కంటైనర్లను చైనా దేశం తిప్పి పంపిందని గుర్తుచేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్ల గ్రామంలో నిర్వహించిన పీఎం కిసాన్ -అన్నదాత సుఖీభవ, స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పీఎం కిసాన్ -అన్నదాత సుఖీభవ పథకంలో భాగం గా ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమాన్ని రైతులతో కలిసి సీఎం వర్చువల్గా వీక్షించారు. అన్నదాత సుఖీభవ పథకం తొలివిడత నిధుల విడుదలలో భాగంగా రాష్ట్రంలోని 46.86 లక్షల మంది రైతులకు రూ.3,125 కోట్ల చెక్కును రైతులకు అందించారు.

రూ.7 వేల చొప్పున రైతుల ఖాతాల్లో తొలివిడత నిధులు జమ చేశామని స్పష్టం చేశారు. గత పాలకులు రూ.12,500 ఇస్తామని కేవలం రూ.7500 మాత్రమే చేతిలో పెట్టారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా కూటమి ప్రజా ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తున్నట్టు తెలిపారు. విత్తన సరఫరా నుంచి మార్కెటింగ్ వరకూ రైతులు ఇబ్బందులు పడకుండా ప్రజా ప్రభు త్వం రైతులకు అండగా ఉందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగో లు చేసి గత పాలకులు రైతులకు బకాయిలు పెట్టిపోయారు. కూటమి అధికారంలోకి వచ్చాకే 48 గంటల్లో రైతులకు ధాన్యం చెల్లింపులు చేస్తున్నాం. రైతుల ఫోన్లకు ఎస్ఎంఎస్ ద్వారా ఎప్పటికప్పుడు వ్యవసాయ సూచనలు జారీ చేస్తున్నాం. ఈ-క్రాప్ విధానం ద్వారా రైతులకు పూర్తి సహకారం అందించేలా ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతులు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. గత పాలకులు సాగునీరు కూడా ఇవ్వకుండా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. ప్రకృతి సేద్యంలో ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్టు ప్రధాని కూడా వెల్లడించా రని.. 20 లక్షల ఎకరాల్లో రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని తెలిపారు. ఇటీవల స్విట్జర్లాండ్ కూడా మన ప్రకృతి సేద్యానికి ప్లానెట్ ఫుడ్ ప్రైజ్ ఇచ్చిందన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-06-2026

చైతన్యరధం ఈ పేపర్ 21-06-2026

లింగంగుంటలో ప్రకృతి వ్యవసాయం

క్రిమిసంహారకాలతో తీరని నష్టం
మితిమీరిన ఎరువులు, పురుగుమందులతో పంటలకు అపార మైన నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. కన్నతల్లితో సమాన మైన భూమిని వీటితో విషతుల్యం చేస్తున్నాం. క్రిమి సంహారకాల అవశేషాలు ఉన్నాయనే కారణంతో గుంటూరు నుంచి పంపిన 3 మిర్చి కంటైనర్లను చైనా తిప్పి పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు క్రిమి సంహారకాలు ఉన్న ఉత్పత్తులను తిరస్కరిస్తున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లకు మన వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు వెళ్లాలంటే మన పంటలపై జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. శాస్త్రవే త్తలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల సూచనల మేరకే వీటిని వినియోగించాలన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి వెళ్లే వాణిజ్య పంటలు, రాయలసీమ నుంచి ఉద్యాన ఉత్పత్తులు, ఉభ యగోదావరి నుంచి ఆక్వా ఉత్పత్తులు పెద్దఎత్తున విదేశీ మార్కెట్ల కు వెళు తున్నాయని చెప్పారు.

భూసారం కాపాడి మన పంటలకు అత్యధిక విలువ వచ్చేందుకు పురుగుమందులు, ఎరువులకు విరు గుడు ప్రకృతి సేద్యమేనని తెలిపారు. పలనాడు జిల్లా సహా రాష్ట్రంలో కొందరు రైతులు ప్రకృతి సేద్యం చేస్తూ భూమి తల్లిని కాపాడుతున్నారని వ్యాఖ్యానించారు. రైతులు గానుగ ద్వారా సహజ రీతిలో నూనెను ఉత్పత్తి చేయటం సంతోషదాయకమని అభినందించారు. భూసారం బాగుంటేనే పంటల దిగుబడి పెరుగుతుందని.. మన ఆరోగ్యం కూడా కాపాడుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో, రాష్ట్రంలో పంట దిగుబడులు పెరిగాయని రెండేళ్లకు సరిపడా ధాన్యం నిల్వలు ఉన్నాయన్నారు. ఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలు అందుబాటులో ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని రైతుల పంటకు ఎంత ఎరువు కావాలో ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

రైతుకు అండగా ప్రజా ప్రభుత్వం
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపడుతున్నాం. రైతులను కాపాడుకునేందు కు ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుంది. ఆక్వా రైతులకు ఫీడ్ ధరలు పెరిగి ఇబ్బందులు పడుతుంటే ఆ ధరను రూ.4 మేర తగ్గించాలని ఆదేశాలిచ్చాం. గతంలో తోతాపురి మామిడికి టన్నుకు రూ.4 వేలు ఇచ్చి ఆదుకున్నాం. గత ఏడాది బర్లీ పొగాకును రూ.279 కోట్లతో కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నాం. ఈసారి కూడా రూ.200కు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చాం.

ఈ అంశంపై బయ్యర్లతో మరోమారు మాట్లాడి కేంద్రానికి కూడా లేఖ రాసి సంప్రదింపులు జరుపుతాం. అన్నదాతల కష్టాలను తెలుసుకు నేందుకు త్వరలోనే ప్రతీ రైతు ఇంటికీ ప్రజాప్రతినిధులు వస్తారని తెలిపారు. పంట మార్పిడి, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించటంతో పాటు రైతులకు ప్రయోజనం కల్పించేలా ప్రతీ రైతు ఇంటికీ వెళ్లి వివరించాలని నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. 2027 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని.. ఏపీకి జీవనాడిగా పోలవరం మారుతుంద న్నారు. గుంటూరు ఛానల్ ద్వారా పల్నాడు ప్రాంతానికీ నీరు వస్తుంది. నీరందితే బంగారం పండించే రైతులు మన రాష్ట్రంలో ఉన్నారు. నల్లమల సాగర్కు, వంశధారకు, బనకచర్ల వరకూ గోదావరి నీటిని తీసుకెళ్లి ఏపీకి తిరుగేలేదని నిరూపిస్తాం. ప్రతీ ఎకరాకూ నీరు ఇవ్వాలన్నదే ఎన్టీఆర్ చేసిన సంకల్పం..ఆ సంక ల్పాన్ని తాము నెరవేరుస్తున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఇరిగేషన్ క్యాలెండర్ కూడా విడుదల చేశామని స్పష్టం చేశారు.

గొడ్డలి పార్టీది విద్వేష రాజకీయం
రాష్ట్రంలో గొడ్డలి పార్టీకి విద్వేషాలు, విద్రోహాలు తప్ప అభివృద్ధి తెలియదని వ్యాఖ్యానించారు. ప్రతీ అంశంలోనూ విషప్రచారమే ఆ పార్టీ అజెండా. విషం చిమ్మడం, అభివృద్ధిని ఆపటం, ప్రజలను ఇబ్బంది పెట్టటం తప్ప ఆ పార్టీకి మరేమీ తెలీదు. గతంలో తీసుకువచ్చిన ఐటీ విధానం, విజన్ రైతు బిడ్డలను ఐటీ ప్రొఫెష నల్గా మార్చింది. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్ లాంటి ఆధు నిక టెక్నాలజీని ఏపీకి తీసుకువస్తున్నామని.. క్వాంటం, డేటా సెం టర్లు, ఏఐ, సెమీ కండక్టర్ల లాంటి ఆధునిక టెక్నాలజీ యూనిట్లను కూడా ఏపీకి తెచ్చామని పేర్కొన్నారు. 5వ జనరేషన్ ఫైటర్ జెట్ తయారీ లాంటి డిఫెన్స్ పరిశ్రమలు కూడా ఏపీలో ఏర్పాటు అవు తున్నాయనిచెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి రాష్ట్ర పరిస్థితిపై 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని.. ఇప్పుడు గడచిన రెండేళ్లుగా కూటమి ప్రభుత్వ పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టును కూడా ప్రజల ముందు ఉంచుతామని ప్రకటించారు.

పచ్చదనం 50 శాతం పెంపు లక్ష్యం
రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపట్టాం. రాష్ట్రంలో ఉన్న 31 శాతం పచ్చదనాన్ని 50 శాతానికి తీసుకెళ్లాల్సి ఉంది. గత పాలకులు రాష్ట్రంలో 131 లక్షల టన్నులు వ్యర్ధాలను వదిలేసి వెళ్లారని వ్యాఖ్యానించారు. రూ.1300 కోట్లు ఖర్చు పెట్టి ఆ చెత్తను వదిలించుకోవాల్సి వచ్చిం ది. ఇప్పుడు వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా వ్యర్ధాలను సంపదగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో 8 చోట్ల వీటిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్వచ్ఛ రథాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్ధాలు సేకరించి నిత్యావసర వస్తువులు ఇస్తున్నామం. గత పాలనలో గుంతలు పడిన రోడ్లను మరమ్మతు లు చేస్తున్నామని తెలిపారు. అంతకుముందు ప్రజావేదిక సభ వద్ద వ్యవసాయ ఉద్యాన, పురపాలక, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్లు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్ర మంలో భాగంగా కడప, కర్నూలులో రూ.330 కోట్ల విలువైన 15 మెగావాట్ల సామర్థ్యం ఉన్న వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు శంకు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభిరామ్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Previous Post

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

Next Post

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-06-2026

కార్యకర్త
@ June 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-06-2026

కార్యకర్త
@ June 21, 2026
లింగంగుంటలో ప్రకృతి వ్యవసాయం
ఆంధ్రప్రదేశ్

లింగంగుంటలో ప్రకృతి వ్యవసాయం

చైతన్యరధం
@ June 21, 2026
నేరస్థులకు కులం ఉండదు
ఆంధ్రప్రదేశ్

నేరస్థులకు కులం ఉండదు

చైతన్యరధం
@ June 21, 2026
ఉద్యమ స్పూర్తితో యోగాంధ్ర
ఆంధ్రప్రదేశ్

ఉద్యమ స్పూర్తితో యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2026
అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

చైతన్యరధం
@ June 21, 2026
భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం
@ June 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-06-2026

కార్యకర్త
@ June 20, 2026
Load More

ముఖ్య వార్తలు

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

చైతన్యరధం
@ June 21, 2026

రైతుకు ప్రజాప్రభుత్వం అభయం 

చైతన్యరధం
@ June 21, 2026
అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

చైతన్యరధం
@ June 20, 2026
పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

చైతన్యరధం
@ June 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

లింగంగుంటలో ప్రకృతి వ్యవసాయం

లింగంగుంటలో ప్రకృతి వ్యవసాయం

చైతన్యరధం
@ June 21, 2026
నేరస్థులకు కులం ఉండదు

నేరస్థులకు కులం ఉండదు

చైతన్యరధం
@ June 21, 2026
ఉద్యమ స్పూర్తితో యోగాంధ్ర

ఉద్యమ స్పూర్తితో యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2026
అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

చైతన్యరధం
@ June 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist