చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయి

కోల్‌కతాలో జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్లీనరీలో మంత్రి లోకేష్

by చైతన్యరధం
Jun 20, 2026 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ఏపీ ప్రత్యేకతలు
  • దేశ మేధో, సాంస్కృతిక, ఆర్థిక కేంద్రంగా కోల్‌కతా
  • బలమైన బెంగాల్ అంటే బలమైన భారతదేశం
  • సంస్కరణల అమలులో ఏపీ ముందంజలో ఉంది
  • ఏపీ అభివృద్ధి ప్రయాణంలో పెట్టుబడిదారులు భాగస్వాములవ్వాలి
  • కోల్‌కతాలో జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్లీనరీలో మంత్రి లోకేష్

కోల్‌కతా (చైతన్య రథం): బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయని, స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ఏపీ ప్రత్యేకతలని, ఏపీ అభివృద్ధి ప్రయాణంలో పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. కోల్‌కతాలోని ఐటీసీ సోనార్ హోటల్ జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్లీనరీలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు’ అనే అంశంపై జరిగిన ప్లీనరీ సెషన్‌లో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. “ప్రముఖ పారిశ్రామికవేత్తలు, మేధావులు, సంపద సృష్టికర్తలు, దేశ నిర్మాణకర్తల సమక్షంలో ఉండడం గౌరవంగా ఉంది. నేను చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన ఒక మాట ఉంది. ఈరోజు బెంగాల్ ఏం ఆలోచిస్తుందో.. రేపు భారత్ అది ఆలోచిస్తుంది. అందుకే మళ్లీ కోల్‌కతాకు వచ్చి.. మీ అందరి మధ్య ఉండడం నాకు ఎంతో గౌరవంగా, ఆనందంగా అనిపిస్తోంది. భారతదేశ మేధో, సాంస్కృతిక, ఆర్థిక ప్రయాణానికి కోల్‌కతానే రాజధానిగా నేను భావిస్తాను. బలమైన బెంగాల్ అంటే బలమైన భారతదేశం అని నేను గట్టిగా నమ్ముతున్నాను” అన్నారు.

రాష్ట్రాలమధ్య ఆరోగ్యకరమైన పోటీతోనే అభివృద్ధి సాధ్యం
“గురువారం సాయంత్రం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిని కలిసే అవకాశం నాకు లభించింది. అభివృద్ధిపట్ల వారి అంకితభావం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే భారతదేశం గెలుస్తుందని నేను విశ్వసిస్తాను. పోటీ ఉత్తమ ఫలితాలను తీసుకొస్తుంది. అదే సమయంలో రాష్ట్రాలు కలిసి పనిచేసి.. తమ బలాలను పెంచుకోవాలి. తద్వారా మరింత శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మించగలం. ఉద్యోగాల కల్పన విషయంలో పశ్చిమబెంగాల్ సీఎం సంకల్పం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ పూలింగ్ ఎలా చేస్తున్నారని ఆయన నన్ను నేరుగా అడిగారు. మీరు అనుసరిస్తున్న విధానం ఏమిటని ప్రశ్నించారు. భూమి అనేది ప్రతి భారతీయుడికి భావోద్వేగంతో ముడిపడి ఉంటుంది. అయినప్పటికీ రైతులకు వారి భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు ఉద్యోగాల కల్పనతో ముడిపడి ఉందని, మేం వారిని ఒప్పగించగలిగామని చెప్పాను. ప్రస్తుతం భారతదేశం కీలక మలుపులో ఉంది. పశ్చిమ దేశాలు భారత్‌వైపు చూస్తున్నాయి. తూర్పు దేశాలు కూడా భారత్‌వైపు చూస్తున్నాయి. మన జనాభా ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకునే సమయమిది” అని లోకేష్ పేర్కొన్నారు.

సంబంధితవార్తలు

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం ఈ పేపర్ 20-06-2026

డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

సంస్కరణల అమలులో ఏపీ ముందంజలో ఉంది
“మనకు అద్భుతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. మన పొరుగు దేశాల్లో అనిశ్చితి, తరచూ ప్రధానమంత్రులు మారుతున్న పరిస్థితుల్లో.. మన దేశానికి స్థిరత్వాన్ని తీసుకొచ్చిన నాయకత్వం ఆయనది. జాతీయస్థాయిలో సంస్కరణలను అమలు చేస్తున్న ఆయన.. వాటిని కార్యరూపంలోకి తీసుకురావడానికి రాష్ట్రాలపై విశ్వాసం ఉంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కరణల అమలులో ముందంజలో ఉంది. భారతదేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25శాతం ఏపీకి వస్తున్నాయి” అని వివరించారు.

స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ఏపీ ప్రత్యేకత
“పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ప్రత్యేకతలు ఏంటని చాలామంది నన్ను అడుగుతారు. అందుకు మూడు ‘ఎస’లు కారణాలుగా చెబుతాను. మొదటి ‘ఎస’.. స్పీడ్. పెట్టుబడిదారులు ప్రభుత్వాలను హామీల ఆధారంగా కాదు.. నిర్ణయాలు ఎంతవేగంగా అమలవుతున్నాయనే దాని ఆధారంగా అంచనా వేస్తారు. మేం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దశను దాటి.. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను అమలుచేస్తున్నాం. ఎందుకంటే పోటీ ప్రపంచంలో వేగమే కొత్త ప్రోత్సాహకం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో నిర్ణయాలు వేగంగా తీసుకోవడం, వాటిని మరింత వేగంగా అమలు చేయడం అనే సంస్కృతిని మేం నిర్మించాం. 13 నెలల్లోనే భారతదేశ అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గూగుల్‌ను ఏపీకి తీసుకువచ్చాం. ఒక్క జూమ్ కాల్ ద్వారా ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్ట్ సాధించగలిగాం. పుట్టిపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్ట్ కోసం 600 ఎకరాలు సేకరించి 37 రోజుల్లోనే శంకుస్థాపన చేయగలిగాం” అని మంత్రి లోకేష్ వెల్లడించారు.

కస్టమర్ ఈజ్ గాడ్
“రెండో కారణం స్టెబిలిటీ. పరిశ్రమలకు అనువైన వాతావారణం కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాయని.. విధానాల్లో స్థిరత్వాన్ని కొనసాగిస్తాయని పెట్టుబడిదారులు నమ్మాలి. ఆంధ్రప్రదేశ్ అలాంటి నమ్మకాన్ని అందిస్తోంది. మూడో కారణం సర్వీస్. సాంప్రదాయంగా ప్రభుత్వాలు తమను నియంత్రణ సంస్థలుగా భావిస్తాయి. కానీ మేం మమ్మల్ని సేవలందించే సంస్థలుగా భావిస్తున్నాం. మార్వాడీ సమాజంలో నాకు ఎప్పటినుంచో ఎంతో ఇష్టమైన ఒక భావన ఉంది. అదే ‘కస్టమర్ ఈజ్ గాడ’. మీరు మా కస్టమర్లు. మీకు సేవ చేయడానికే నేను ఇక్కడ ఉన్నాను” అన్నారు.

ఏపీ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములవ్వాలి
“తరతరాలుగా మీరు అద్భుతమైన వ్యాపారాలను నిర్మించారు. ఒక బ్రాండ్‌ను నిర్మించడం ఎంత కష్టమో నాకు తెలుసు. పెద్ద ప్రాజెక్టులను విజయవంతంగా నిలబెట్టడం ఎంత సవాలుతో కూడుకున్నదో కూడా నాకు తెలుసు. అందుకే మేం మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని, కలిసి చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నాం. 2047నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడికి ఇప్పటికే మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో 30 ఏళ్లలో జరిగిన అభివృద్ధి విశాఖ ఎకనామిక్ రీజియన్ 10 ఏళ్లలో సాధిస్తుంది. ఏపీలో ఇప్పటికే 24 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాం. పెట్టుబడుల గ్రౌండింగ్‌కు కృషిచేస్తున్నాం. మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్‌ను నిర్మిస్తాం. ఆభరణాల తయారీకి సంబంధించి మొత్తం ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తాం. జులైలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించుకోబోతున్నాం” అని మంత్రి లోకేష్ వివరించారు.

బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయి
“జోన్లు, క్లస్టర్ల విధానంలో ముందుకు వెళ్తున్నాం. పరిశ్రమలకు అవసరమైన ఎకో సిస్టమ్‌ను నిర్మిస్తున్నాం. ఇప్పుడు మీరు నెలలు, సంవత్సరాలు ఎదురుచూడాల్సిన పనిలేదు. ఒక్కసారి మాతో చేతులు కలిపిన తర్వాత అది మీ ప్రాజెక్ట్ కాదు.. మా ప్రాజెక్ట్. ఏపీ శాసనసభ్యుల్లో 50శాతం మంది మొదటిసారి గెలిచిన వారు. 25మంది మంత్రుల్లో 17మంది కొత్తవారు. నేను చంద్రబాబు కేబినెట్‌లో సీనియర్ మంత్రిని. రాష్ట్ర అభివృద్ధికి మేం అంతా కసితో పనిచేస్తున్నాం. మామధ్య ఎలాంటి ఈగోలు లేవు. ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. నేను మీకు కేవలం ఒక వాట్సాప్ దూరంలోనే ఉన్నాను. మనమంతా కలిసి పనిచేసి.. ఒక గొప్ప పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలి.

బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయి. మనమంతా కలిసి పనిచేసి.. భారతదేశాన్ని మరింత గర్వపడే స్థాయికి తీసుకెళ్లాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ సీఎండీ బ్రిజ్ భూషణ్ అగర్వాల్, ఐసీసీ వైస్ ప్రెసిడెంట్, సెంచురీ ప్లైబోర్డ్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేశవ్ భజంక, సత్వ గ్రూప్ ఎండీ బిజయ్ అగర్వాల్, ఐసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, అంబుజా నియోటియా గ్రూప్ ఈడీ పార్ధీవ్ విక్రమ్ నియోటియాతోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Previous Post

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

Next Post

ఆంధ్రప్రదేశ్ క్రాప్ వాల్యూ చైన్

మరిన్ని వార్తలు

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం
@ June 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-06-2026

కార్యకర్త
@ June 20, 2026
డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

చైతన్యరధం
@ June 20, 2026
గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం
ఆంధ్రప్రదేశ్

గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం

చైతన్యరధం
@ June 20, 2026
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు

చైతన్యరధం
@ June 20, 2026
అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు

చైతన్యరధం
@ June 20, 2026
ఏపీలో సిలికాన్-కార్బన్ యానోడ్ యూనిట్ ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్

ఏపీలో సిలికాన్-కార్బన్ యానోడ్ యూనిట్ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ June 20, 2026
జీరో డిజిటల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ దిశగా చర్యలు
ఆంధ్రప్రదేశ్

జీరో డిజిటల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ దిశగా చర్యలు

చైతన్యరధం
@ June 20, 2026
Load More

ముఖ్య వార్తలు

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

చైతన్యరధం
@ June 20, 2026
పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

చైతన్యరధం
@ June 19, 2026
ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

చైతన్యరధం
@ June 18, 2026
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం
@ June 20, 2026
డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

చైతన్యరధం
@ June 20, 2026
గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం

గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం

చైతన్యరధం
@ June 20, 2026

అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు

చైతన్యరధం
@ June 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist