- వివిధ రంగాల్లో కలిసి పనిచేసేందుకు టాస్క్‌ఫోర్స్
- ఆసియా-పసిఫిక్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో
- ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశంలో నిర్ణయం
- ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీలలో
- యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రతిపాదనలు
- సంజీవని ప్రాజెక్టులో భాగస్వామి కావాలని విజ్ఞప్తి
- ఏపీలో లాజిస్టిక్స్ పార్కులు, సప్లై చైన్ సిటీకి అవకాశాలు
- యూఎన్ హాబిటాట్ సెంటరాఫ్ ఎక్స్‌లెన్స్‌కు ఆహ్వానం
- సింగపూర్‌లో వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు
సింగపూర్: వివిధ రంగాల్లో సంయుక్తంగా కలిసి పనిచేసేందు కు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం, గూగుల్ నిర్ణయించాయి. సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం గూగుల్ ఆసియా-పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో సమావేశమయ్యారు. ఈ మేరకు జరిగిన చర్చల్లో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో గూగుల్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేం దుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలనే అభిప్రాయానికి ఇరు వురు వచ్చారు. అలాగే డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామి కావాలని కరణ్ బజ్వాను కోరారు. రెండురోజుల సింగపూర్ పర్య టనకు వెళ్లిన ముఖ్యమంత్రి వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా గూగుల్ ఆసి యా – పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడితో జరిగిన సమావేశంలో వివి ధ కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద ఏఐ, డేటా సెంటర్, డిజిటల్ మౌలిక సదు పాయాల కేంద్రంగా తీర్చిదిద్దే అంశాలపై చర్చించారు.
మరోవైపు ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగంపై గూగుల్ క్లౌడ్ సహకారాన్ని కోరారు. ఆధునిక క్లౌడ్ సాంకేతికతలను వినియోగించుకుని రియ ల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థను మరింత శక్తివంతం చేయాలనేది తమ లక్ష్యమని సీఎం వివరించారు. అలాగే ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీలలో యువతకు భారీస్థాయిలో నైపుణ్యాభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టాలని ప్రతిపాదించారు. గూగుల్ క్లౌడ్‌తో కలిసి ఏఐ స్కిల్లింగ్, క్లౌడ్ సర్టిఫికేషన్ కార్యక్రమాలను విస్తరించాలని భావి స్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. విశ్వవిద్యాలయాలు, ఇంజినీ రింగ్ కళాశాలల్లో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ కేంద్రాల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని..దీనికి గూగుల్ నుంచి సహకారం కావాలని కోరారు. అంతేకాకుండా వైద్యసేవలు అందించే విషయంలో సాంకేతికను పూర్తిస్థాయిలో వినియోగిం చుకుంటూ సంజీవని ప్రాజెక్టు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులో గూగుల్ సంస్థ భాగస్వామి కావాలని కోరారు. ఇక డేటా సెంటర్లకు, వివిధ పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ కోసం తాము గ్రీన్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్టు సీఎం వివరించారు. ఈ మేరకు గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వ విజయాలను గూగుల్ ప్రతినిధి కరణ్ బజ్వాకు వివరించారు.
లాజిస్టిక్స్ రంగంలో అపార అవకాశాలు
వైసీహెచ్ ప్రతినిధులతో భేటీలో చంద్రబాబు
సింగపూర్ వేదికగా సీఎం చంద్రబాబు జరిపిన వరుస సమా వేశాల్లో భాగంగా వైసీహెచ్ లాజిస్టిక్స్ గ్రూప్ హెడ్ ఆఫ్ ఆపరే షన్స్ సునీల్ నంబియార్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సప్లై చైన్, లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుపై వైసీహెచ్ గ్రూప్‌తో సీఎం చర్చించారు. ఆటోమేటెడ్, అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారీ సప్లై చైన్ సిటీని ఏపీలో నిర్మించే అంశంపై ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఏపీలో 1,053 కి.మీ సుదీర్ఘ సముద్రతీరం ఉందని, లాజిస్టిక్స్ పరంగా పెట్టుబడులు పెట్టేందుకు అనేక అనుకూలతలు ఉన్నాయని వివరించారు. హైవేలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్వే కనెక్టవిటీ ఉందని తెలిపారు. లాజిస్టిక్స్ వ్యయం తగ్గించేందుకు ప్రణాళికతో పనిచేస్తున్నామంటూ ఏపీలోని లాజిస్టిక్స్ వసతులు, వనరులను వైసీహెచ్ గ్రూప్ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు రాష్ట్రంలో ఉద్యానరంగంలో రూ.లక్ష కోట్లు పెట్టుబడులు వస్తు న్నాయని వెల్లడించారు. ఆక్వాకల్చర్‌లో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందని పేర్కొంటూ ఆహార ఉత్పత్తులకు మరింత విలువ జోడించడం ద్వారా ఎగుమతులు పెరిగాయని వివరించారు. ఏపీని సందర్శించి రాష్ట్రం అమలు చేస్తున్న పాలసీలు, అనుకూ లతలు చూసి పెట్టుబడులు పెట్టాలని వైసీహెచ్ గ్రూప్‌ను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.
యూఎన్ హాబిటాట్ ఈడీతో సమావేశం
యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రోస్‌బాక్‌తోనూ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూఎన్ హాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని, దీనికి భూమి కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. యూఎన్ హాబిటాట్‌తో సంపూర్ణ భాగస్వామ్యం కోరుకుంటున్నామని అనాక్లాడియాకు తెలిపారు. దీనిపై యూఎన్ హాబిటాట్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. యూనివర్శిటీల మధ్య భాగస్వామ్యం, ప్రణాళిక దశలో ఎస్డీజీలను చేర్చడం, ప్రొఫెషనల్స్ నెట్‌వర్క్ సహకారం పైనా యూఎన్ హాబిటాట్ ప్రతినిధులతో సీఎం చర్చించారు. ఆంధ్రప్రదేశ్ పట్టణాల సుస్థిర అభివృద్ధికి యూఎన్ హాబిటాట్ సహకారాన్ని కోరారు. పట్టణాల్లో మురికివాడల అభివృద్ధికి పార్టిసిపేటరీ స్లమ్ అప్‌గ్రేడింగ్ ప్రోగ్రాం(PSUP) అమలుపై చర్చించారు. ఏపీలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మధ్యస్థాయి నగరాల్లో అర్బన్ రాస్తా ఫ్రేమ్ వర్క్‌ను సంయుక్తంగా అమలు చేయాలని సీఎం ప్రతిపాదించారు. మున్సిపల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం- స్థానిక ఆదాయ వనరులను పెంచేందుకు వాల్యూ కాప్చర్ ఫైనాన్సింగ్ వంటి పద్ధతులను ప్రవేశపెట్టడం – అంతర్జాతీయ వాతావరణ నిధుల సమీకరణ తదితర అంశాల పైనా చర్చించారు. ఈ సమావేశాల్లో మంత్రి నారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













