ఆచంట(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం సిద్ధాంతంలో మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన దివాకర శ్రీనివాసులు, నాగలక్ష్మి అనే రైతు కుటుంబంతో ముచ్చ టించి వారి పొలాన్ని పరిశీలించారు. గతంలో తమ భూమి ఇనాం భూమిగా నమోదైందన్న విషయం తమకు తెలియదని సీఎంకు దివాకర దంపతులు వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రీ సర్వే ప్రక్రియ ద్వారా సమస్య పరిష్కారమైందని ముఖ్యమంత్రికి తెలిపారు. అనంతరం మామిడిసెట్టి సాయి సుబ్రహ్మణ్యం అనే రైతుతో సీఎం ముఖాముఖి అయ్యారు.
తన పౌల్ట్రీ వ్యాపారం గురించి వివరించి రీ సర్వే ప్రక్రియ గురించి తన అభిప్రాయాన్ని సుబ్రహ్మణ్యం పంచుకున్నారు. ఇక రీ సర్వేలో సమస్య పరిష్కారం పొందిన రైతులతో సీఎం సమావేశమయ్యారు. 2023లో ఇనాం ఖాతాలు ఫ్రీ హోల్డ్ భూములుగా మార్చడంతో ఇబ్బందులు పడ్డా మని రైతులు సీఎంకు వివరించారు. దీంతో వ్యవసాయ రుణాలు పొందడానికి, విక్రయాలు జరుపుకోవడానికి, రిజిస్ట్రేషన్కు తీవ్ర ఇబ్బందులు పడ్డామని చెప్పారు. రైతుల అభిప్రాయాలు తెలుసు కున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి పట్టాదారు పుస్తకా లు అందించి గ్రూప్ ఫొటో దిగారు.















