- దానికి ప్రజాస్వామ్యంలో చోటు లేదు
- రోజుకొక చిచ్చుపెట్టేందుకు నాటకం
- ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
- పూతలపట్టులో ముఖ్యమంత్రి చంద్రబాబు
పూతలపట్టు/చిత్తూరు(చైతన్యరథం): రాష్ట్రంలో సూపర్సిక్స్ పథకాలు సూపర్హీట్ కావటంతో పాటు కూటమి చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులను చూసి గొడ్డలి పార్టీ ఫ్రస్టేషన్లో ఉందని ముఖ్య మంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరిలో నిర్వహించిన సంజీవని కార్యక్ర మానికి చంద్రబాబు హాజరయ్యారు. అభివృద్ధిని ఓర్వలేక గొడ్డలి పార్టీ గంగవెర్రులెత్తుతోంది.. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు కాపాడే రాజకీయాలు ఒకవైపు ప్రజలను భయపెట్టే, మోసం చేసే రాజకీ యాలు ఇంకోవైపు ఉన్నాయి.. ప్రజలు జాగ్రత్తగా గమనించాలి. నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్న వ్యక్తులు మీడియా ముందు కొచ్చి మంచోడినంటూ మాటలు చెబుతున్నారు.. ఇది గొడ్డలి పార్టీ నైజమని తెలిపారు. గొడ్డలి పార్టీ చేసిన 11 నిర్వాకాలు, అరాచక ఘటనలను ప్రజలకు వివరించారు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీలకుచోటులేదు.. సమాజానికి ఆ పార్టీ హానికరం.. తోక జాడిస్తే కట్ చేస్తాం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అంటూ వ్యాఖ్యా నించారు.
వైసీపీ చేసిన 11 నిర్వాకాలు, అరాచకాలు
1. వివేకా హత్యలో నాటకాలు ఆడారు. నంగనాచి ప్రతిఒక్కరికీ తెలుసు. 2. కోడికత్తి డ్రామా.. గులకరాయి
కబుర్లు చెప్పారు. అంతిమ లబ్ధిదారు ఎవరనేది డ్రామా ప్రజలందరికీ జ్ఞాపకం ఉంది. ప్రజలను మోసం చేసే ఎత్తుగడ, దుర్మార్గానికి పరాకాష్ట, 3.దళిత డ్రైవర్ సుబ్రమణ్యం హత్య, డోర్ డెలివరీ చేసిన నిందితు డికి అండదండలు ఇచ్చారు. 4. మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్పై దాడి చేసి వేధించి ప్రాణాలు తీశారు. 5. కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు వేశారు. ఆస్తి ఇవ్వకుండా తల్లికి, చెల్లికి అన్యాయం చేశారు. ఇంట్లో న్యాయం చేయకుండా బయట ఎలా న్యాయం చేస్తాడు. 6. హిందూ దేవుళ్లపై దాడులు చేశారు. అపవిత్ర కార్యక్రమాలు, కుట్రలు. తప్పుడు ప్రచారాలు చేశారు. 7. పోలవ రం, అమరావతి, పెట్టుబడులు, అభివృద్దిపై గొడ్డలి పార్టీ వేటు వేసింది. 8. నందం సుబ్బయ్య, చంద్రయ్య, జల్లయ్యల పీకలు కోసి నడిరోడ్డుపై చంపేసి రక్తదాహం తీర్చుకున్నారు.
9.గంజాయి బ్యాచ్లకు ప్రోత్సాహం ఇచ్చారు. వాళ్ల కార్యకర్తలు రప్పా రప్పా రంకెలు వేశారు. జంతు రక్తంతో కటౌటు అభిషేకాలు చేశారు. 10. కారు కింద వారి పార్టీ కార్యకర్త సింగయ్యను తొక్కించారు… కడపలో పెద్ద దస్తగిరిని చంపేశారు. 11. కులాలు, మతాలు, ప్రాం తాల మధ్య చిచ్చుకు రోజుకో నాటకం. పాస్టర్లతో దాడి డ్రామాలు చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ నిద్ర లేకుండా చేశారు. ప్రజలకు నరకం చూపిం చారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తనను అరెస్టు చేసి జైల్లో పెట్టారని ఆరోపించారు. ప్రజలందరిలోనూ భయాందోళన లు కల్పించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే స్వేచ్ఛ కల్పించామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.













