- ప్రజాదర్బార్‌లో వినతుల స్వీకరణ
- సమస్యల పరిష్కారానికి ఆదేశాలు
మంగళగిరి(చైతన్యరథం): మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ నిరాటంకంగా కొనసాగుతోంది. కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానం టూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 87వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై పార్టీ కార్యాలయానికి తరలివచ్చిన సామాన్యు లు, పార్టీ కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించారు. వివిధ సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరించారు. సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా (సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్ (గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేగా డోర్నకల్‌కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విష యాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
దినసరి ఉద్యోగుల క్రమబద్ధీకరణకు వినతి
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న దినసరి వేతన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ దినసరి ఉద్యోగుల కమిటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. కొవిడ్ వల్ల నష్టపోయిన హైర్ బస్ యజమానుల బస్సులకు రీప్లేస్ మెంట్ కల్పించి ఆదుకోవాలని ఏపీ హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో తమకు వంశపారంపర్యంగా సంక్రమించిన 2.63 ఎకరాల భూమిని శిరిగిరి చంద్రమౌళీశ్వరరెడ్డి ఆక్రమించారని, విచారించి తగిన న్యాయం చేయాలని కర్నూలు జిల్లా గుండంపాడుకు చెందిన ఎస్.చిన్న శివమ్మ కలిసి కోరారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.













