- ఏడాది పొడవునా నిరంతరం శిక్షణా తరగతులు
- పైరవీలతో పనిలేదు..పదవులకు పనితీరే ప్రామాణికం
- జూన్ తర్వాత అందరూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సిందే
- ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి
- మహానాడు ప్రిపరేషన్ వర్క్ ప్రారంభమైంది
- విజయవంతానికి ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలి
- నిలకడలేని జగన్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదు
- క్యాడర్‌తో మంత్రి నారా లోకేష్ కాఫీ కబుర్లు
అమరావతి(చైతన్యరథం): తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నుంచి పొలిట్‌బ్యూరో వరకు సమూల మార్పులు తెస్తున్నాం..ప్రతి టర్మ్‌లోనూ 33 శాతం (3వ వంతు) కొత్తవారు ఉండాలన్నది తమ అభిమతం..గ్రామస్థాయి నాయకుడు పొలిట్‌బ్యూరో వరకు చేరుకు నే అవకాశం లభించాలి..మారుతున్న కాలానికి అనుగుణంగా మన పంథా మారాలి.. అలాగైతేనే పదికాలాల పాటు ప్రజాక్షేత్రం లో నిలబడగలమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. తెలుగుదేశం క్యాడర్ శిక్షణా తరగతుల్లో భాగంగా కేంద్ర కార్యాలయంలో కాఫీకబుర్లు పేరుతో పార్టీ క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జిలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ 3.0 వర్షన్‌తో సరికొత్త పంథాలో దూసుకుపోతోంది. పార్టీ క్యాడర్‌కు సభ్యత్వ నెంబర్ ఆధార్ కార్డు లాంటిది. ఆ నెంబర్ ఎంటర్ చేస్తే ఎవరు ఎంత పనిచేశారో తెలిసిపోతుంది. ఎలాంటి పైరవీలతో పనిలేకుండా పనిచేసే కార్యకర్తలను గుర్తించి పదవులిస్తాం. ఇటీవల పార్టీ ఆవి ర్భావ దినోత్సవం సందర్భంగా తామంతా కింద కూర్చోగా, బాబు గారి పక్కన సామాన్య కార్యకర్తలు కూర్చున్నారు..పార్టీలో వస్తున్న అనూహ్య మార్పులకు ఇదొక సంకేతమని పేర్కొన్నారు.
తెలుగుదేశం రాజకీయ విశ్వవిద్యాలయం
పార్టీని అట్టడుగుస్థాయి నుంచి బలోపేతం చేయడం, పనిచేసే కార్యకర్తలను ప్రోత్సహించి గుర్తించడమే శిక్షణా తరగతుల ప్రధాన లక్ష్యం. ఇకపై క్లస్టర్, యూనిట్, గ్రామ, మండలస్థాయి వరకు ఏడాది పొడవునా నిరంతరం శిక్షణా తరగతులు నిర్వహిస్తాం. తెలుగుదేశం పార్టీ రాజకీయ విశ్వవిద్యాలయం లాంటిది. తెలంగా ణాలో ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రితో పాటు అక్కడి మెజారిటీ నాయకులు టీడీపీ నుంచి వచ్చినవారే. 1989-94 నడుమ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రబాబునాయుడు ట్రైనింగ్ క్లాసులు పెట్టి క్యాడర్‌ను చైతన్యవంతం చేశారు. అయితే పార్టీ ఆవిర్భావం తర్వాత అట్టడుగు స్థాయి నుంచి క్యాడర్‌కు పెద్దఎత్తున శిక్షణా తరగతులు నిర్వహించడం ఇదే ప్రథమమని తెలిపారు.
నాయకులు కాదు..పార్టీనే శాశ్వతం!
తెలుగుదేశం క్యాడర్ బేస్డ్ పార్టీ. పార్టీలో నేనే రాజు, నేనే మంత్రిని అనే అభిప్రాయాన్ని నాయకులు సరిచేసుకోవాలి. టీడీపీ లో లోకేష్ లేదా మరో నాయకుడు శాశ్వతం కాదు. పార్టీ శాశ్వ తం. సమర్థవంతమైన నాయకుడు తమ తర్వాత నాయకత్వాన్ని తయారుచేస్తాడు. గతంలో వ్యక్తులను నమ్మి పార్టీ నష్టపోయింది, ఇప్పుడు వ్యక్తులపై కాకుండా వ్యవస్థపైనే ఆధారపడ్డాం. 2014-19 నడుమ పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసి కూడా ఓటమి పాలయ్యాం. పార్టీ దీర్ఘకాలంగా అధికారంలో ఉండ టానికి బీజేపీని మనం ఆదర్శంగా తీసుకోవాలి. పార్టీ సిద్ధాంతా లను కమిట్‌మెంట్‌తో అమలు చేసే క్రమశిక్షణ గల క్యాడర్ ఉండ టమే వారి విజయరహస్యం. మన మై టీడీపీ యాప్ మాదిరిగానే వారికి సరళ్ యాప్ ఉంది. గ్రామస్థాయి కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు ఎవరికి అప్పగించిన బాధ్యతను వారు సమర్థవం తంగా నిర్వహించడమే వారి విజయ రహస్యమని వ్యాఖ్యానించా రు.
మహానాడును విజయవంతం చేద్దాం
1985 తర్వాత ఎన్నడూ గెలవని మంగళగిరిని ఎంచుకొని నేను తొలి ప్రయత్నంలో ఓడిపోయాను. ఐదేళ్ల పాటు పట్టుదలతో పనిచేసి గత ఎన్నికల్లో 91 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొం దాను. భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ.. నియోజకవర్గ పరిధి లోని 20 బూత్‌ల పరిధిలో మైనస్ వచ్చింది. దానిని కూడా అధి గమించేందుకు హోంవర్క్ చేస్తున్నా. కాన్ఫిడెన్స్ ఉంటేనే ఏదైనా సాధించగలం. పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గత వేదిక లపై చర్చించి పరిష్కరించుకోవాలి. అలిగి ఇంట్లో పడుకోవడం అంటే పార్టీకి అన్యాయం చేయడమే. పార్టీలో సంస్కరణల కోసం నేను చంద్రబాబుతో ఒక యుద్ధమే చేశాను. మన పార్టీ పెద్ద పండుగ మహానాడు ప్రిపరేషన్ వర్క్ ప్రారంభమైంది. విజయ వంతం కోసం ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపు నిచ్చారు.
చంద్రబాబు నీడే మనకు శ్రీరామరక్ష
అరాచక పాలనలో ఐదేళ్లూ ఇబ్బందులు పడ్డాం. దేవాలయా లపై దాడులు చేశారు, పార్టీ కార్యకర్తలను విచక్షణారహితంగా పొట్టనబెట్టుకున్నారు. దాదాపు 35 వేల తప్పుడు కేసులు బనాయిం చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ అధ్యయనం చేసి.. 60 శాతం అక్రమ కేసులను తొలగించాం. మంచిరోజులు వచ్చాయి కదా అని కష్టకాలంలో పడిన ఇబ్బందు లను మరువద్దు. అధికారం ఉందని అహంకారం వద్దు. ఓర్పు, సహనంతో ముందుకు సాగుదాం. నమ్ముకున్న సిద్ధాంతం కోసం అహర్నిశలు కష్టపడదాం. చంద్రబాబు అనే మహావృక్షం నీడే మనకు శ్రీరామరక్ష. ఒంటెద్దు పోకడలతో వెళ్లే నాయకులకు పద్దతి మార్చుకోవాల్సిందిగా మూడుసార్లు చెప్పి చూస్తాం. వినకపోతే 4వ సారి దండం పెట్టి కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తాం. పార్టీలో ఎవరి పోస్టులు శాశ్వతం కాదన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించుకుని మసలుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
జగన్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదు
వైసీపీ అధినేత జగన్ మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకో వాల్సిన పనిలేదు. నిన్న మావిగన్ అన్న నోటితోనే మళ్లీ ఈరోజు మూడు రాజధానులు అంటున్నాడు. అధికారంలో ఉన్నప్పుడే కాకుండా ఇప్పుడు కూడా ఆయన ప్రజలకు దగ్గరగా ఉండటం లేదు. ఇంటి వద్ద 30 అడుగుల ఇనుప కంచె ఏర్పాటు చేసుకు న్నాడు. 2019లో తెలుగుదేశం ఓటమి పాలయ్యాక చంద్రబాబు అనునిత్యం జనంలోనే ఉన్నారు..వారి కష్టసుఖాలు తెలుసుకున్నా రు. ఏడాదిలోనే ఇసుక కష్టాలపై ఉద్యమించారు. కార్యకర్తల ఆవేదనను విన్నారు. వాటన్నింటినీ గుర్తుపెట్టుకుని క్యాడర్‌కు దగ్గరగా ఉంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. క్యాడర్‌ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. పార్టీలో పనిచేయడానికి పదవులే ప్రామాణికం కాదు, వివిధ సమీకరణాల వల్ల ఇప్పుడు అవకాశం రాని వారికి మరోసారి కల్పిస్తామని తెలిపారు.
హనీమూన్ ముగిసింది..జనంలోకి వెళదాం!
ప్రస్తుతం మనకు హానీమూన్ పీరియడ్ ముగిసింది. ప్రతిఒక్కరూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పనిచేయాలి. జూన్ నుంచి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లేలా కార్యక్రమాన్ని రూపొందిస్తాం. కార్యక్రమాలను సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత క్యాడర్‌దే. ప్రతి బూత్ కూడా మనకు చాలా కీలకం. 94 శాతం స్ట్రైక్ రేటుతో గెలిచినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 4,600 బూత్‌లలో మనం వెనకబడ్డాం. వాటిపై నాయకులు దృష్టిసారించాలి. పార్టీ బలోపేతం కోసం అహర్నిశ లు కష్టపడదాం. గత మహానాడులో ఇచ్చిన ఆరు శాసనాలను అమలు చేద్దాం. కార్యకర్తే అధినేత అనే శాసనం ఇప్పటికే కార్య రూపం దాల్చింది. కూటమి మళ్లీ అధికారంలోకి వస్తేనే మనం అభివృద్ధిని కొనసాగించగలం. చంద్రబాబు బలంగా ఉంటేనే అంతా సంతోషంగా ఉంటారన్న సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లా లని యువనేత పిలుపునిచ్చారు.













