చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

లక్ష్యాల మేరకు రాజధాని పనులు

అమరావతి రాజధాని పనులపై సమీక్షలో సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
Apr 5, 2026 at 6:30am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
లక్ష్యాల మేరకు రాజధాని పనులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వేగంపెంచి.. యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి
  • ప్రతి నిర్మాణంలో ఐకానిక్ ముద్ర కనిపించాలి
  • నిర్మాణ సంస్థలు కడుతోంది భవనాలు కాదు… రాజధాని
  • రాజధాని పనులకు గ్రీన్ ఛానెల్ ద్వారా ఇసుక, గ్రావెల్
  • జాప్యం లేకుండా ప్రభుత్వ శాఖలు, అధికారుల సమన్వయం
  • అమరావతి రాజధాని పనులపై సమీక్షలో సీఎం చంద్రబాబు
  • అగ్ని ప్రమాదాలపై సీఎం అసంతృప్తి… నిర్మాణ సంస్థలదే బాధ్యతని స్పష్టం

అమరావతి (చైతన్య రథం): అమరావతి రాజధాని నిర్మాణ పనులను సకాలంలో పూర్తిచేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న సమయానికి పనులు పూర్తిచేసి ప్రధానితో ప్రారంభోత్సవం చేస్తామని.. ఈ మేరకు పనులు వేగంగా చేపట్టి పూర్తి చేసేలా కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు అధికారులు కూడా పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణ పనులను ఓ కాంట్రాక్ట్ వర్క్ అన్నట్టగా భావించవద్దని… చరిత్రలో భాగస్వాములవుతున్నట్టుగా భావించాలన్నారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో రాజధానిలో నిర్మాణ పనులు చేపట్టిన వివిధ కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రస్తుతం రాజధానిలో వివిధ దశల్లో రూ.57,821 కోట్ల విలవైన పనులు ఉండగా… వాటిల్లో రూ. 50,943 కోట్ల పనులు గ్రౌండ్ అయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ మౌలిక సదుపాయలతోపాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయంవంటి ఐకానిక్ భవనాల నిర్మాణ పనుల పురోగతిని సీఎం సమీక్షించారు.

ప్రస్తుతం రాజధాని నిర్మాణ పనుల్లో మొత్తంగా 20 వేలమంది కార్మికులు, నిపుణులు పని చేస్తున్నారని అధికారులు తెలిపారు. అలాగే ఏ నిర్మాణ సంస్థ ఎంత మేర పనులు చేసింది… లక్ష్యాన్ని ఎంతమేరకు చేరుకున్నారనే విషయంలో పనుల వారీగా సీఎం చర్చించారు. పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థల తీరుపట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిర్మాణ పనులకు అవసరమైన మ్యాన్‌పవర్ విషయంలో కొన్ని ఇబ్బందులున్నాయని కాంట్రాక్టర్లు సీఎం దృష్టికి తెచ్చారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా చాలామంది కార్మికులు వెళ్లారని నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెప్పారు. స్థానికంగా నైపుణ్యమున్న మ్యాన్ పవర్ ఎంతవరకు అందుబాటులో ఉంటుందో చూసి వినియోగించుకోవాలని సీఎం సూచించారు. రాజధాని పనుల్లో ఎంత మెషినరీని వినియోగిస్తున్నారనే అంశంపైనా సీఎం ఆరా తీశారు. రాజధాని పనుల్లో 5,580 మెషినరీ అవసరముండగా… ప్రస్తుతం 3767 మెషనరీ ఉందని అధికారులు వివరించారు. ఇవికాకుండా హాట్ మిక్స్ 16, వెట్ మిక్స్ మెషిన్లు 36, ఆరఎంసీ మిషన్లు 34 ఉన్నాయని తెలిపారు. వారం, నెలవారీగా టార్గెట్‌లు పెట్టుకుని రాజధాని పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను… నిర్దేశించుకున్న టార్గెట్లను విశ్లేషిస్తే… వారానికి రూ.941 కోట్ల విలువైన పనులు పూర్తి కావాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-04-2026

సంస్కరణవాది జగ్జీవన్‌రామ్

మూడు ముక్కలాట పోయింది..మావిగన్ మొదలైంది

వచ్చే వర్షాకాలంలో పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉంది కాబట్టి… ఆలోగానే చేపట్టాల్సిన పనులను జాప్యం లేకుండా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కువ ప్రాజెక్టులను చేపడుతున్న నిర్మాణ సంస్థలు మరింతగా దృష్టిని కేంద్రీకరించి పనులు చేయాలన్నారు. రాజధాని నిర్మాణానికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “రాజధాని నిర్మాణమనేది కేవలం ఒక కాంట్రాక్ట్ వర్క్‌గా చూడొద్దు… ఇప్పుడు పనులు చేపట్టే వారంతా చరిత్రలో భాగస్వాములువుతున్నట్టే. నిర్మాణ సంస్థలుగా ఎన్నో ప్రాజెక్టులు చేసి ఉంటారు. కానీ రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం అందరికీ దక్కదు. రాజధానిని అద్భుతంగా, వినూత్నంగా నిర్మించేందుకు అపార అవకాశాలున్నాయి. అమరావతిని ఫ్యూచర్ సిటీగా నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచనను క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపాలి. నాణ్యతతో నిర్మాణాలు ఉండాలి… కాస్ట్ ఎఫెక్టివ్ చర్యలు తీసుకోవాలి. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ వంటి వాటిని వినియోగించుకోవాలి. రాజధాని ప్రతిష్టను పెంచేలా ఎవరికైనా ఆలోచనలు వస్తే వాటిని ప్రభుత్వంతో పంచుకోవచ్చు. ప్రభుత్వం నిర్ధేశించిన సమయానికి నిర్మాణం పూర్తి చేసి తీరాల్సిందే.. ఈ విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదు. మ్యాన్ పవర్ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది… ప్రతీ నిర్మాణం సకాలంలో పూర్తి చేసి ప్రారంభించుకోవాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు.

నిర్మాణ సామాగ్రికి రక్షణలో నిర్లక్ష్యమెందుకు…?
సమీక్ష సందర్భంగా ఇటీవల రాజధాని ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదాల ఘటన ప్రస్తావనకు వచ్చింది. నిర్మాణ సామాగ్రికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కాంట్రాక్టు సంస్థలకు లేదా అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ సంస్థల నిర్లక్ష్యంవల్ల ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయన్నారు. ఘటన జరిగిన తర్వాత కాంట్రాక్టు సంస్థలు కానీ… అధికారులు కానీ తగిన రీతిలో స్పందించలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతీ అంశాన్ని వక్రీకరించేలా కొందరు రాజకీయం చేస్తున్నారని… ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. జరగరాని ఘటనలు జరిగితే వెంటనే అలెర్ట్ చేయాలని ఆదేశించారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా… ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు.. బురద జల్లేందుకు, కుట్రలు పన్నేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఆయా నిర్మాణ సంస్థలు కూడా ప్రాజెక్టు మేనేజర్లుగా సమర్థులను నియమించుకోవాలని సూచించారు. సరైన వాళ్లని నియమించుకోకుంటే… ఆ ప్రభావం ప్రభుత్వంపై పడుతుందని.. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తాను అనుమతించనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా కలెక్టర్లకు ఆదేశాలు
రాజధాని పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్ సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇసుక, గ్రావెల్ కొరత కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగే పరిస్థితి రాకూడదని సీఎం స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో ఫారెస్ట్ అధికారుల కారణంగా గ్రావెల్ సరఫరాలో కొంత ఇబ్బంది ఉందని.. జిల్లా కలెక్టర్ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నా… ఫారెస్ట్ అధికారులతోనే అసలు సమస్య వస్తోందనే విషయం సమావేశంలో సీఎం దృష్టికి వచ్చింది. దీనిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్‌వంటివి గ్రీన్ ఛానెల్ ద్వారా వెళ్లాలని.. ఎవరి ఒత్తిళ్లకూ గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈమేరకు కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. సమీక్షా సమావేశంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Previous Post

కన్నడ సంస్కతీ సంప్రదాయం గొప్పది

Next Post

భవిష్యత్ ఏఐ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-04-2026

కార్యకర్త
@ April 6, 2026
సంస్కరణవాది జగ్జీవన్‌రామ్
ఆంధ్రప్రదేశ్

సంస్కరణవాది జగ్జీవన్‌రామ్

చైతన్యరధం
@ April 6, 2026
మూడు ముక్కలాట పోయింది..మావిగన్ మొదలైంది
ఆంధ్రప్రదేశ్

మూడు ముక్కలాట పోయింది..మావిగన్ మొదలైంది

చైతన్యరధం
@ April 6, 2026
ఏడు వాగులు దాటి..ప్రాణాలు కాపాడి..
ఆంధ్రప్రదేశ్

ఏడు వాగులు దాటి..ప్రాణాలు కాపాడి..

చైతన్యరధం
@ April 6, 2026
త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు
ఆంధ్రప్రదేశ్

త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు

చైతన్యరధం
@ April 6, 2026
తుగ్లక్ పేరు చదివాం..ఇప్పుడు చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్

తుగ్లక్ పేరు చదివాం..ఇప్పుడు చూస్తున్నాం

చైతన్యరధం
@ April 6, 2026
మిషన్ ‘సేవ్ వాటర్’
ఆంధ్రప్రదేశ్

మిషన్ ‘సేవ్ వాటర్’

చైతన్యరధం
@ April 6, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

నేడు సీఎం అనంత పర్యటన

చైతన్యరధం
@ April 6, 2026
Load More

ముఖ్య వార్తలు

జగన్‌ది విధ్వంసం…చంద్రబాబుది విజయం!

జగన్‌ది విధ్వంసం…చంద్రబాబుది విజయం!

చైతన్యరధం
@ April 5, 2026
లక్ష్యాల మేరకు రాజధాని పనులు

లక్ష్యాల మేరకు రాజధాని పనులు

చైతన్యరధం
@ April 5, 2026
కన్నడ సంస్కతీ సంప్రదాయం గొప్పది

కన్నడ సంస్కతీ సంప్రదాయం గొప్పది

చైతన్యరధం
@ April 5, 2026
దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

చైతన్యరధం
@ April 4, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సంస్కరణవాది జగ్జీవన్‌రామ్

సంస్కరణవాది జగ్జీవన్‌రామ్

చైతన్యరధం
@ April 6, 2026
మూడు ముక్కలాట పోయింది..మావిగన్ మొదలైంది

మూడు ముక్కలాట పోయింది..మావిగన్ మొదలైంది

చైతన్యరధం
@ April 6, 2026
ఏడు వాగులు దాటి..ప్రాణాలు కాపాడి..

ఏడు వాగులు దాటి..ప్రాణాలు కాపాడి..

చైతన్యరధం
@ April 6, 2026
త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు

త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు

చైతన్యరధం
@ April 6, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist