- మరో పదిహేనేళ్లు కూటమి పాలన సాగాలన్న సీఎం చంద్రబాబు
- గుజరాత్ తరహాలో సుదీర్ఘ పాలనతోనే రాష్ట్రాభివృద్ధి
- ఎన్నికలకంటే.. సంక్షేమం, అభివృద్ధికి పెరిగిన మద్దతు
- ప్రభుత్వ విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి…
- ఎమ్మెల్యేలు, మంత్రులు ఓనర్షిప్ తీసుకోవాలి
- కేంద్రసాయం లేకుటే.. ఇన్ని కార్యక్రమాలు అసాధ్యం
- ఎన్నికలనాటి స్ఫూర్తి నిరంతరం కొనసాగాలి
- సభను పకడ్బందీగా నడుపుదాం… అర్థవంతమైన చర్చలు సాగిద్దాం
- ఎన్డీఏ శాసనసభా పక్షసమావేశంలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
- ప్రతి ఒక్కరూ కూటమి ధర్మానికి కట్టుబడాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- 20 నెలల్లో ప్రగతిని నేతలకు వివరించిన సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో మరో 15 ఏళ్లపాటు కూటమి ఐక్యత ఇలాగే కొనసాగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఈ 20 నెలల్లో కూటమి నాయకత్వంలో ఎక్కడా విభేదాలు ఏర్పడలేదని, ఇది శుభ పరిణామమని చెప్పిన సీఎం.. ఇదే ఐక్యత ఇకపైనా కొనసాగాలని, అప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇందుకు తగ్గట్టుగా మంచి పనులు చేసి ఎమ్మెల్యేలు పేరు తెచ్చుకోవాలన్నారు. మొన్నటి ఎన్నికలకంటే నేడు కూటమి బలం, ప్రజల మద్దతు మరింత పెరిగిందని… ఎన్నికల ముందు ఏ స్ఫూర్తితో పనిచేశామో, అదే స్ఫూర్తితో మున్ముందు పని చేయాలన్నారు. మూడు పార్టీలు ఐక్యంగా ప్రజల వద్దకువెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి ఉండాలన్నారు. అసెంబ్లీ కమిటీ హాలులో ఎన్డీఏ శాసనసభా పక్ష ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
గుజరాత్లో వరుసగా ఐదుసార్లు బీజేపీ గెలిచి అధికారంలో ఉందని, ఇదే స్ఫూర్తితో ఇక్కడా విజయాలు సొంతం చేసుకోవాలన్నారు. శాశ్వతంగా రాజకీయాల్లో నిలబడేలా అందరూ మంచి పేరు తెచ్చుకోవాలని సీఎం సూచించారు. ఈ 20 నెలల్లో చాలా కష్టపడి, ఐక్యంగా పని చేశామని సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ ఐదేళ్ల విధ్వంసాన్ని అధిగమించి… ప్రగతివైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధికి 15 ఏళ్లు కూటమి కలిసి ఉంటుందని, ఐక్యంగా ముందుకు వెళ్తుందని డిప్యూటీ సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఏ స్ఫూర్తితో పనిచేశామో… భవిష్యత్లో అలాగే పని చేయాల్సి ఉంటుందన్నారు. పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటే అంతర్గతంగా కూర్చుని వాటిని పరిష్కరించుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. కూటమి ధర్మానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని సూచించారు.
అర్థవంతమైన చర్చలు జరగాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… ‘జిల్లాలవారీగా ఎమ్మెల్యే, ఎంపీలు, ఎస్పీ, కలెక్టర్లతో ఉమ్మడి సమావేశం నిర్వహిస్తాం. పొలిటికల్ గవర్నెన్స్లో భాగంగా ఎమ్మెల్యేల గౌరవాన్ని పెంచుతాం. నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు గుర్తిస్తే ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేద్దాం. మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఫలితాలను ఇస్తున్నాయి. మనం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కానీ వ్యవస్థలను గాడినపెట్టాం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా నియోజకవర్గాల్లో చేసిన పనులను ఎమ్మెల్యేలు ఓన్ చేసుకోవాలి. అసెంబ్లీ సమావేశాలను సభ్యులు సీరియస్ గా తీసుకోవాలి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ సభ్యులు అంతా సభలో ఉండాల్సిందే. నేను కూడా సభను పూర్తిగా ఫాలో అవుతా. సభ్యుల ప్రసంగాలు, మంత్రులు సమాధానాలు వింటాను. సభలో సబ్జెక్టులపై అర్థవంతమైన చర్చలు జరగాలి. మా సమస్యలపై మా ఎమ్మెల్యేలు మాట్లాడారు, మంత్రులు సమాధానం చెప్పారు అని ప్రజలు అనుకోవాలి. విప్లు సంతృప్తికరంగా పని చేయాలి. ఎదుటివారు తిట్టారని మనం కూడా బూతులు తిట్టకూడదు. ప్రజామోదయోగ్యంగా సభ జరగాలి’ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
కేంద్ర సాయంతోనే ఇంతటి పురోగతి
‘నాడు ఎన్నికల్లో చెప్పిన అన్ని పథకాలు ఇస్తున్నామంటే కేంద్రం ఎంతో సహకారం అందిస్తోంది. అందుకే వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టాం. కేంద్రం అమరావతి, పోలవరానికి డబ్బులు ఇవ్వకపోయి ఉంటే నేడు ఈ ప్రాజెక్టులు ప్రారంభమయ్యేవి కాదు. 2027 జూన్నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకిత చేస్తున్నామంటే కేంద్రం సాయం అందించడమే కారణం. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర సాయంతో నిలబెట్టాం. మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం, మన విశాఖ కోసం కేంద్రం తన పాలసీనే మార్చుకుని సాయం చేసింది. ఇది చిన్న విషయం కాదు. కేంద్ర సాయంతో మొదటిసారిగా ఒక్క నెలలో రూ.54 కోట్ల లాభాలను విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించింది. ఇదేస్థాయిలో పని చేస్తే అత్యుత్తమ ప్రాజెక్టుగా నిలుస్తుంది. సూపర్ సిక్స్త్ సహా అన్ని సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. కేంద్ర సహకారం వల్లనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలపై ఎమ్మెల్యేలు ఓనర్ షిప్ తీసుకోవాలి’ అని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
నాడు అధికారంలో వైసీపీ అరాచకాలు
ఎన్డీఏ-ఎల్పీ సమావేశంలో పాల్గొన్న వారిలో 90శాతం నాటి వైసీపీ ప్రభుత్వ బాధితులేనని సభ్యుల్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నారు. నేడు నీతులు చెబుతున్న వైసీపీ నేతలు… నాడు అధికారంలో చేసిన అరాచకాలను మరిచిపోయారని విమర్శించారు. వాళ్ల హయాంలో పవన్ కల్యాణ్ విశాఖ వెళితే కనీసం కారు కూడా దిగనివ్వలేదన్నారు. హోటల్ గదినుంచి బయటకు రానివ్వకుండా అడ్డుపడ్డారని సీఎం గుర్తు చేశారు. తన అరెస్టు సమయంలో మద్దతుగా పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి వస్తుంటే… ఆయనకు అనేక అడ్డంకులు సృష్టించారని అన్నారు. విమానంలో వచ్చే అవకాశం లేకుండా చేశారని, రోడ్డుమార్గాన కూడా రానివ్వలేదన్నారు. ఇలా అనేక సవాళ్లను, ఇబ్బందులను ఎదిరించి కూటమి ఐక్యంగా నిలబడి ఎన్నికల్లో గెలిచిందని సీఎం వివరించారు.
నాడు అధికారంలో వైసీపీ అరాచకాలు
ఎన్డీఏ-ఎల్పీ సమావేశంలో పాల్గొన్న వారిలో 90శాతం నాటి వైసీపీ ప్రభుత్వ బాధితులేనని సభ్యుల్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నారు. నేడు నీతులు చెబుతున్న వైసీపీ నేతలు… నాడు అధికారంలో చేసిన అరాచకాలను మరిచిపోయారని విమర్శించారు. వాళ్ల హయాంలో పవన్ కల్యాణ్ విశాఖ వెళితే కనీసం కారు కూడా దిగనివ్వలేదన్నారు. హోటల్ గదినుంచి బయటకు రానివ్వకుండా అడ్డుపడ్డారని సీఎం గుర్తు చేశారు. తన అరెస్టు సమయంలో మద్దతుగా పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి వస్తుంటే… ఆయనకు అనేక అడ్డంకులు సృష్టించారని అన్నారు. విమానంలో వచ్చే అవకాశం లేకుండా చేశారని, రోడ్డుమార్గాన కూడా రానివ్వలేదన్నారు. ఇలా అనేక సవాళ్లను, ఇబ్బందులను ఎదిరించి కూటమి ఐక్యంగా నిలబడి ఎన్నికల్లో గెలిచిందని సీఎం వివరించారు.
1. తల్లికి వందనం: రూ.10,090 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ. 67.27 లక్షల మంది విద్యార్థులకు సాయం
2. స్త్రీ శక్తి: 43.51కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు. రూ.1,532 కోట్లు ఖర్చు.
3. దీపం-2 పథకం: ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పంపిణీ. ఇప్పటికి 3.64 కోట్ల సిలిండర్లు అందజేత. ఇందుకు రూ.2,891 కోట్లు వ్యయం
4. అన్నదాత సుఖీభవ: 46 లక్షల మంది రైతులకు… రెండు విడతల్లో రూ.6,310 కోట్లు జమ.
5. మెగా డీఎస్సీ: ముఖ్యమంత్రి తొలి సంతకం. 15,941 టీచర్ పోస్టులు – 5,757 కానిస్టేబుళ్ల నియామకం – రూ.21 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ – 25 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన
6. పీ-4 10 లక్షల మంది మహిళలకు రూ. 50వేల నుంచి రూ. 2లక్షల వరకు లబ్ది చేకూర్చడమైనది.
7. ఎన్టీఆర్ భరోసా: ప్రతినెలా 63 లక్షల మందికి పింఛన్లు. ఇప్పటికి రూ.58,654 కోట్లు వ్యయం. దేశంలో అత్యధిక మొత్తంలో అధిక మందికి పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా రికార్డు.
8. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. వీరు ఎక్కడైనా పింఛను తీసుకునే అవకాశం.
9. మత్స్యకార సేవ: ఏడాదికి 20వేలు చొప్పున 1.25 లక్షల మందికి రూ.250 కోట్లు.
10. నాయీ బ్రాహ్మణులకు నెలకు రూ.25వేలు, జూనియర్ లాయర్లకు రూ.10వేలు గౌరవ వేతనం చెల్లింపు.
11. నేతన్నలకు ఉచిత విద్యుత్: మర మగ్గాలకు నెలకు 500, మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్
12. గీత కార్మికులకు 10శాతం మద్యం షాపులు కేటాయింపు-స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు.
13. ఆటో డ్రైవర్ల సేవలో: ఏడాదికి రూ.15వేలు, రూ.436 కోట్లు జమ, 2.90 లక్షల మందికి లబ్ధి
14. అన్న క్యాంటీన్: రాష్ట్రవ్యాప్తంగా 205 అన్న క్యాంటీన్లు ద్వారా 7.50 కోట్ల మందికి భోజనాలు.
15. ఎస్సీ వర్గీకరణ: వివాదాలకు తావివ్వకుండా అన్ని వర్గాలకు సమన్యాయం
16. 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5వేలు చొప్పున గౌరవ వేతనం
17. ఇమామ్లకు నెలకు రూ.10వేలు, మౌజన్లకు రూ.5వేలు చొప్పున గౌరవ వేతనం
18. అర్చకులకు వేతనం నెలకు రూ.15వేలకు పెంపు
19. రాష్ట్రవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లతో రోడ్ల మరమ్మతులు, మరో రూ.3వేల కోట్లతో నూతన రహదారుల నిర్మాణం-పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో నాలుగు వేల కి.మీ. రోడ్ల నిర్మాణం
20. రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ – రెవెన్యూ సదస్సులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు.
21. పంచాయతీరాజ్: రాష్ట్రమంతటా ఒకేరోజు
13,326 గ్రామసభల నిర్వహణ, దాదాపు 3వేల పనులకు శ్రీకారం… పంచాయతీరాజ్ వ్యవస్థలో పదోన్నతులు, 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల. ప్రతి ఇంటికీ ‘అమరజీవి జలధార పేరుతో మంచినీటి కుళాయి కనెక్షన్లు. రూ.3,050 కోట్లతో ప్రాజెక్టుకు రూపకల్పన,1.21 కోట్ల మంది దాహార్తి తీర్చాలని లక్ష్యం. అడవితల్లి బాటతో గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణం, శివారు గ్రామాలకు 4జీ నెట్వర్క్-శరవేగంగా గ్రామీణ రహదార్ల నిర్మాణం.
22. విద్యా రంగం: విద్యా వ్యవస్థలో పెనుమార్పులు.
మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గిన్నిస్ రికార్డ్. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్, పారదర్శకంగా టీచర్ల బదిలీలు. విద్యార్థుల్లో పరిశుభ్రత పెంచేలా ‘ముస్తాబు’ – రూ.2,600 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లింపు-వన్ క్లాస్-వన్ టీచర్ అమలు.
23. గేట్స్ ఫౌండేషన్, టాటాలతో సంజీవని ప్రాజెక్టు. యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరునికీ రూ.2.5 లక్షల సమగ్ర ఆరోగ్య బీమా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 1.43 కోట్ల కుటుంబాలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్య భద్రత – ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం – మెరుగైన సేవలందిస్తున్న 108, 104.
24. గాడిన పడిన విద్యుత్
రంగం-తొలిసారి ట్రూ డౌన్ ద్వారా 13 పైసలు విద్యుత్ చార్జీ తగ్గింపు-రూ.4,494 కోట్ల విద్యుత్ బకాయిలను భరించే బాధ్యత తీసుకున్న ప్రభుత్వం.
25. సివిల్ సప్లయిస్ బలోపేతం నాణ్యమైన సరుకులు పంపిణీ-ప్రజలకు అందుబాటులో రేషన్ దుకాణాలు-జొన్నలు, రాగులు, గోధుమలు, కందిపప్పు… వంటి పౌష్టికాహారం పంపిణీ -స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.
26. ప్రతినెలా 3వ శనివారం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’. పట్టణ ప్రాంతాల్లో 100 శాతం డోర్ టు డోర్ కలెక్షన్… ఇప్పటికి 105 లక్షల టన్నుల చెత్త తొలగింపు. చెత్తపై పన్ను రద్దు.
27. కొత్తగా 25 పాలసీలు-పరిశ్రమగా పర్యాటక రంగం గుర్తింపు-పరిశ్రమలకు రాయితీల కోసం దేశంలో తొలిసారి ఎస్క్రో ఖాతాలు-175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకుశ్రీకారం
28. ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ప్రైన్యూర్’లో భాగంగా తొలి దశలో లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలు.
29. విశాఖలో 15 బిలియన్ డాలర్లతో(రూ.1.25 లక్షల కోట్లు) గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు.
30. అమరావతిలో క్వాంటం వ్యాలీ భవనాలకు శంకుస్థాపన, విశాఖ ఐటీ హబ్, రిలయన్స్ డేటా సెంటర్కు అడుగులు, టీసీఎస్ ప్రారంభం, కాగ్నిజెంట్కు శంకుస్థాపన.
31. కాకినాడలో ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన. రెండేళ్లలో ఎగుమతులు.
32. తిరుమల సహా దేవాలయాల సేవల్లో పెను మార్పులు, 20కి పైగా ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు.
33. విశాఖలో యోగాంధ్ర నిర్వహణ.. కర్నూలులో సూపర్ జీఎస్టీ సభసక్సెస్.
34. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం- పేద విద్యార్థులకు అదనంగా 220 వైద్య విద్య సీట్లు.
35. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28 … 2 మూలధన వ్యయం.
36. పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఉచితంగా సలం కోసం దరఖాసులస్వీకరణ పూర్తి. 3లక్షల ఇళ్లకు ఇప్పటికే గృహప్రవేశాలు. త్వరలో మరో 5లక్షల ఇళ్ల ప్రారంభం.
37. ఉచిత ఇసుక పథకం అమలు. నాలా యాక్ట్ రద్దుతో పాటు నిర్మాణరంగ అనుకూల నిర్ణయాలు.
38. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్. బీసీలకు రూ.20వేల అదనపు సాయం.
39. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు- బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు.
40. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ డెసిషన్స్, వాట్సప్ గవర్నెన్స్- ‘మన మిత్ర’ ద్వారా 921 సేవలు-తగ్గిన క్రైమ్ రేట్, గంజాయి-డ్రగ్స్ అరికట్టాం, ఈగల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు.
41. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్ల అభివృద్ధికి కార్యాచరణ-ఒకే రాజధాని. అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి లక్ష్యం.
42. పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి దక్కిన చోటు-రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరింత ఆస్కారం- రాయలసీమకు సెమీ కండక్టర్-ఓర్వకల్, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్-కడప స్టీల్ ప్లాంట్ సోలార్ హబ్, దుగరాజపట్నం ఓడరేవు, రామాయపట్నం ఓడరేవు… లక్ష కోట్లతో బీపీసీఎల్- దగదర్తి ఎయిర్పోర్టు భూసేకరణకు నిధులు కేటాయింపు
43. ప్రారంభమైన విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం పనులు ప్రారంభంకానున్న భోగాపురం విమానాశ్రయం.
44. విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ.11,440 కోట్ల కేంద్ర సాయం – నష్టాల నుంచి లాభాల బాట.
45. దాదాపు 90 కేంద్ర పథకాల పునరుద్ధరణ, కేంద్ర నిధుల సద్వినియోగం… పేద వర్గాలకు మేలు.
46. రాష్ట్రానికి రూ. లక్ష కోట్లు విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు
47. కొత్తగా రెండు జిల్లాల ఏర్పాటు. 26 నుంచి 28కి పెరిగిన జిల్లాల సంఖ్య. రెవెన్యూ డివిజన్లు 81కి చేరాయి. మొత్తం మండలాల సంఖ్య 680.
48. మహిళలకు లక్ష కుట్టుమిషన్ల పంపిణీ, కుప్పంలో 5,555 ఈ-సైకిళ్లు (రూ.11వేలు సబ్సిడీ).
49. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ, 24 గంటల్లో జమ.2024-25లో 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ- రూ.13వేల కోట్లు రైతులకు జమ…. 2025-26 ఖరీఫ్లో 44 లక్షల టన్నుల ధాన్యం సేకరణ.
50. మార్కెట్ ఇంటర్వెన్షన్-పొగాకు, మామిడి, కోకో, ఉల్లి, టమోటా సహా పంటలకు రూ.1,100 కోట్లకు పైగా సాయం.
51. సమర్ధ నీటి నిర్వహణతో 6.08 మీటర్లకు పెరిగిన భూగర్భజలాలు (ఫిబ్రవరి, 2026)
52. సాగునీటి ప్రాజెక్టులకు ఈ 20 30 5. 23,793 5 ఖర్చు
53. రూ.3,500 కోట్లు ఖర్చుతో హంద్రీ-నీవా పనులు పూర్తి చేసి సీమకు 43 టీఎంసీల తరలింపు ఒక 2.రికార్డు.
54. వెలిగొండ ప్రాజెక్టుకు రూ.571 కోట్లు వ్యయం-వేగంగా లైనింగ్, రిటైనింగ్వాల్ పనులు.
55. శరవేగంగా 88% పోలవరం నిర్మాణం – 2027 280-202 పుష్కరాలకు పోలవరం ప్రారంభం-2019లో చంద్రబాబు ప్రభుత్వం కొనసాగి ఉంటే పోలవరం, నదుల అనుసంధానం పూర్తయి ఇప్పటికే కరవురహిత రాష్ట్రం ఏర్పడి ఉండేది.
56. తుంగభద్ర గేట్ల మరమ్మతులకు ఏపీ వాటాగా రూ.55 కోట్లు కేటాయింపు
57. ధవళేశ్వరం, శ్రీశైలం, కండలేరు, మైలవరం, గుండ్లకమ్మ, గోరకల్లు, అవుకు వంటి ప్రాజెక్టులకు రూ.610కోట్లతో మరమ్మతులు. రాష్ట్రవ్యాప్తంగా రూ.878 కోట్లతో కాలువల నిర్వహణ, పూడికతీత.
58. నీటి భద్రత-సమర్ధ నీటి నిర్వహణతో పెరిగిన భూగర్భ జలాలు – 6,047 సాగునీటి సంఘాలకు ఎన్నికలు
59. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రం మీదుగా వెళ్లే 3 హైస్పీడ్ రైల్ కారిడార్ల కేటాయింపు.
60. ఆర్థిక కష్టాలు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులకు, బకాయిలు, టీఏ, డీఏ, సరెండర్ లీవ్ లు, బెనిఫిట్స్ చెల్లింపు-ఆరోగ్యశ్రీ, పెండింగ్ బిల్లులు వంటి రూ.40వేల కోట్ల బకాయిలు చెల్లింపు.













