చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

శాసనసభలో విద్యాశాఖ మంత్రి ప్రకటన

by చైతన్యరధం
Aug 18, 2026 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • గొడ్డలి పార్టీ అధినేతకు లోకేష్ సవాల్
  • డీఎస్సీ అంటే తెలియని దౌర్భాగ్య ప్రతిపక్షం
  • వైసీపీ హయాంలో ఒక్క డీఎస్సీ వేయలేదు..
  • ఒక్క టీచర్ పోస్టూ భర్తీ చేయలేదు
  •  2019-24లో 12 లక్షల మంది
  • ప్రభుత్వ విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లారు
  •  చంద్రబాబు మొదటి సంతకం
  • అమలును అడ్డుకోవాలన్నదే వారి కుట్ర
  • మరో మÖడు డీఎస్సీలు నిర్వహిస్తాం…
  • విద్యావ్యవస్థను బలోపేతం చేస్తాం
  • ఆరోపణలపై జవాబు చెప్పడం నా బాధ్యత
  • మెగా డీఎస్సీపై ఆరోపణలపై
  • రాష్ట్ర ప్రజలకు నిజాలు చెప్పాలన్నదే నా ఉద్దేశం
  • శాసనసభలో విద్యాశాఖ మంత్రి ప్రకటన

 

అమరావతి(చైతన్యరథం): అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సభా వేదికగా ప్రజలకు వాస్తవాలు వివరించి గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎండగట్టారు. గొడ్డలి పార్టీ అధ్యక్షు డికి చాలెంజ్ చేస్తున్నా.. ప్రెస్‌మీట్ ఎందుకు హౌస్‌కు రమ్మనండి. టైమ్, డేట్ మీరు ఫిక్స్ చేయండి చర్చకు సిద్ధం. సభ లోపల లేదా బయట అయినా తాను సిద్ధమని సవాల్ విసిరారు. మీలాగా పారిపోవడం లేదు..మీలాగా నాపై సీబీఐ, ఈడీ కేసులు లేవు. నేను బెయిల్‌పై లేను..సభకు రండి చర్చిద్దాం అంటూ చాలెంజ్ విసిరారు. మెగా డీఎస్సీ 2025పై వస్తున్న ఆరోపణలకు ఆయన అసెంబ్లీలో సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. అంబేద్కర్ రాజ్యాం గం ప్రకారం పారదర్శకంగా వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేస్తున్నాం. దీనిని తప్పు అని తప్పుడు ఆరోపణలు చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తే ఊరుకోం.. మరో మÖడు డీఎస్సీలు పారదర్శకంగా నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు.
ఈ స్టేట్‌మెంట్ ప్రజల కోసం మాత్రమే…
ఈ స్టేట్‌మెంట్ ప్రతిపక్ష పార్టీకి సమాధానం కాదు, ఒక మంత్రిగా ఆంధ్రరాష్ట్ర ప్రజలకు డీఎస్సీ ఎలా నిర్వహించామో తెలి యజేయాల్సిన బాధ్యత నాపై ఉన్నందున ఈ ప్రకటన చేస్తున్నా. డీఎస్సీని పారదర్శకంగా ఎలా నిర్వహించామో, రాబోయే రోజుల్లో ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నామో పుస్తక రూపంలో సభ్యుల ముందు ఉంచాం. దాంతోపాటు మెగా డీఎస్సీపై ఉన్న అపోహలు – వాస్తవాలను పొందుపరిచాం. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటా గురించి డీటైల్డ్‌గా సమాధానం ఇవ్వడం జరిగింది. డీఎస్సీ నిర్వ హణను ఒక బాధ్యతగా ప్రజాప్రభుత్వం తీసుకుంది. 2024 ఎన్ని కలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీలు కలసికట్టుగా ప్రతిఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రజలకు హామీ ఇచ్చాం. మొదటిది మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఆనాడు హామీ ఇచ్చాం. అందులో భాగంగా డీఎస్సీ-2025 ద్వారా 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటించాం. దీని కోసం 3,36,300 మంది అభ్యర్థులు దరఖా స్తు చేశారు. మొత్తం ప్రక్రియను 148 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది.
ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు వరకు..
ఎన్టీఆర్ నాయకత్వంలో 1983లోనే మధ్యాహ్న భోజన పథకం తీసుకువచ్చారు. బీసీలు, ఎస్సీల కోసం వేర్వేరుగా ప్రత్యేక రెసిడెన్షి యల్ స్కూళ్లు ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్. మహిళల కోసం తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశా రు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ విద్యా వ్యవస్థ ను బలోపేతం చేయాలంటే టీచర్ రిక్రూట్‌మెంట్ చేయాలని నిర్ణయించారు. టీచర్ నియమాకం, బదిలీ గతంలో జెడ్పీ చైర్మన్ చేతిలో ఉండేది. పంచాయితీరాజ్ వ్యవస్థలో ఉన్న వారందరినీ గవర్నమెంట్ సిస్టమ్‌లోకి తీసుకొచ్చి ఎప్పుడూ లేని విధంగా పకడ్బందీగా నియామకాల ప్రక్రియ చేపట్టడం జరిగింది. అంతేకాకుండా మహిళలకు డీఎస్సీలో 33 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత టీడీపీది. కౌన్సిలింగ్ విధానం ద్వారా టీచర్ ట్రాన్స్‌ఫర్స్‌ను పారదర్శకంగా ఆనాడు చేపట్టడం జరిగింది.
టీడీపీ హయాంలోనే 1.80 లక్షల టీచర్ పోస్టులు
1994లో డీఎస్సీ విధానం తీసుకువచ్చాం. అప్పటినుంచి ఒక్క టీడీపీ హయాంలోనే 1.80 లక్షల మంది టీచర్లను నియమిం చాం. అదీ ప్రభుత్వ పాఠశాలలపై మాకున్న చిత్తశుద్ధి. 2019-24 వరకు ఒక్క టీచర్ రిక్రూట్‌మెంట్ జరగలేదు. 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారు. ఉపాధ్యాయులను మనందరం గౌరవించాలి. ఉపాధ్యాయులను ఈరోజు కూటమి ప్రభుత్వం సింగపూర్, ఫిన్లాం డ్‌కు శిక్షణ కోసం పంపితే, గత ప్రభుత్వం టీచర్లను ఏకంగా వైన్ షాపుల ముందు నిలబెట్టింది. గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117 వల్ల ప్రభుత్వ పాఠశాలలు చాలా తీవ్రంగా నష్టపోయాయి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి వన్ క్లాస్`వన్ టీచర్ కేవలం 3 నుంచి 4 శాతం పాఠశాలల్లోనే ఉండేది.
యువగళం పాదయాత్రలో వచ్చిన ఆలోచనే మెగా డీఎస్సీ
యువగళం పాదయాత్ర సమయంలో ఆలూరు, ఆదోని, మంత్రా లయం ప్రాంతాల్లో వందల మంది వ్యవసాయ కూలీలు తమ పిల్లలతో పాటు వాహనాల్లో పనుల కోసం గుంటూరు వలస వచ్చే వారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు లేరు, పిల్లలను స్కూలుకు పంపించినా చదువుకోలేని పరిస్థితి. మెగా డిఎస్సీ ఏర్పాటుచేసి, కర్నూలు జిల్లాకు అవసరమైనంత టీచర్లను నియమించాలని ఆనాడు నిర్ణయించుకున్నా. అందులో భాగంగానే మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్లలో 10 శాతం మందిని కర్నూలు జిల్లాకే కేటా యించాం. రాబోయే డీఎస్సీలో కూడా మరింతమంది టీచర్లను కర్నూలు జిల్లాలో నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
మెగా డీఎస్సీ ఇలా నిర్వహించాం
మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులు రిక్రూట్ చేశాం. ఇందుకోసం 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖా స్తులు చేశారు. 154 ఎగ్జామినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఇందులో 19 సెంటర్లను రాష్ట్రేతర ప్రాంతాల్లో ఏర్పాటుచేశాం. 13 సబ్జెక్టులపై 42 వేల ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంక్ తయారు చేశాం. 148 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి 15,941 టీచర్లకు పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆర్డర్లు ఇచ్చి న ఘనత కూటమి ప్రభుత్వానిది. 24 రోజుల్లో 89 టెస్ట్ సెషన్లు నిర్వహించాం. అభ్యర్థుల అనుమానాల నివృత్తికి రిడ్రసెల్ మెకా నిజం ఏర్పాటు చేశాం. టెట్, డీఎస్సీపై అభ్యర్థుల అనుమానాల నివృత్తికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం. ఇందులో తమ దృష్టికి తెచ్చిన 33,830 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాం. అవిగాక 11,130 గ్రీవెన్స్‌ను పరిష్కరించాం.
వందల కేసులు వేసినా..148 రోజుల్లో ప్రక్రియ పూర్తిచేశాం
మెగా డీఎస్సీపై భిన్నాభిప్రాయాలు ఉన్న వ్యక్తులు 336 కేసులు కోర్టులో ఫైల్ చేశారు. అన్నింటినీ న్యాయబద్ధంగా పరిష్కరించి 148 రోజుల్లో 12 దశల్లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియను పూర్తిచేశాం. మొదటిది టెట్ నోటిఫికేషన్, నిర్వహణ. తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ మేనేజ్‌మెంట్ వైజ్. తర్వాత వెబ్ బేస్డ్ ఆన్‌లైన్ అప్లికేషన్ స్వీకరణ, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్, టీసీఎస్ అయాన్, ఇది ఒక సెక్యూర్డ్ టెస్టింగ్ ప్లాట్‌ఫాం. ఎగ్జామినేషన్ నిర్వహణ, ట్రాన్సఫరెంట్ మెకానిజం ద్వారా అభ్యర్థులకు స్కోర్ తెలియ జేయడం, జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ఉన్న వారిని పిలిచి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పకడ్బందీగా నిర్వహణ, వర్టికల్ హారిజాంటల్ రిజర్వే షన్. ఈ విధానం అమలు చేయాలని ప్రత్యేకంగా జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. భారతదేశ చరిత్రలో వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేసింది ఎన్డీయే ప్రభుత్వం. గ్రీవెన్స్ రిడ్రసల్ మెకానిజం, ఫైనల్ సెలక్షన్, అపాయింట్‌మెంట్, కోర్టు కేసుల పరిష్కారం చేశాం. టెట్ నోటిఫికేషన్‌కు వచ్చేసరికి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ గైడ్‌లైన్స్‌లో కంపల్సరీగా టెట్ క్వాలిఫై కావాలని ఉంది. ఇందుకోసం టెట్ మ్యాండేట్ చేసి 20 శాతం వెయిటేజ్ ఇచ్చాం. టెట్‌కు 3,68,661 మంది దరఖాస్తు చేస్తే 1,87,256 మంది క్వాలిఫై అయ్యారు. దీనిని కూడా పార దర్శకంగా నిర్వహించాం. ఈ సంవత్సరం కూడా టీసీఎస్ అయా న్ ద్వారా ఎక్కడా ఎలాంటి టెక్నికల్ సమస్య రాకుండా పకడ్బందీ గా టెట్ పారదర్శకంగా పూర్తిచేశాం. టెట్ అయిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం. ఎస్సీ సోదరుల వర్గీకరణ వచ్చినపుడు ఆ ప్రక్రియ పూర్తిచేసి జీఏడీ ద్వారా ఆర్డర్ వచ్చిన తర్వాత ప్రక్రియ చేపట్టాం.
క్రీడలను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ నిర్ణయం
స్పోర్ట్స్‌ను పెద్దఎత్తున ప్రోత్సహించాలన్నది ప్రజాప్రభుత్వ నిర్ణయం. గౌరవ ప్రధాని మోదీ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ రావా లి, యువకులు స్పోర్ట్స్‌ను ప్రొఫెషన్‌గా తీసుకోవాలి, రిటైరైనపుడు వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని స్పష్టంగా చెప్పారు. ఈ మేరకు కేంద్రంలో అద్భుతమైన పాలసీ తెచ్చారు. ఆ పాలసీనే మనం అడాప్ట్ చేసుకున్నాం. గతంలో 29 కేటగిరిలు ఉంటే కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం 65 స్పోర్ట్స్ కేటగిరిలు మనం ఎడాప్ట్ చేసుకున్నాం. తర్వాత టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీì) కూడా పారదర్శకంగా నిర్వహించి స్కీమ్ ఆఫ్ సెలక్షన్ పారదర్శకంగా నిర్వహించాం. దాని తర్వాత మెగా డీఎస్సీ నోటిఫి కేషన్ విడుదల చేశాం. మెగా డీఎస్సీ ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని వైసీపీ నాయకులు 148 రోజుల్లో 141 కేసులు వేశారు. సీఎం తొలి సంతకం ముందుకు వెళ్లకూడదన్న లక్ష్యంతో వైకాపా నాయకులు కేసులు వేశారు.
లీగల్ స్క్రూట్నీలో ఫెయిలైతే సీరియస్‌గా తీసుకుంటానని చెప్పా
నోటిఫికేషన్ లీగల్ స్క్రూట్నీలో ఫెయిలైతే సీరియస్‌గా తీసుకుంటానని అధికారులకు చెప్పా. ఇప్పుడు సీఆర్‌డీఏ కమిష నర్‌గా ఉన్న విజయరామరాజు ఆనాటి పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా ఉన్నారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ ఏ కారణం గా ఫెయిలయ్యాయో ఏఐ ద్వారా విశ్లేషించి ఒక మోడల్ నోటిఫికే షన్ తెచ్చాం. అందుకే ప్రతి లీగల్ స్క్రూట్నీ మేం తట్టుకోగలిగాం. 141 కేసులు వేసినా డీఎస్సీ పూర్తి చేసి ఆఫర్ లెటర్లు ఇచ్చి టీచర్లకు శిక్షణ ఇచ్చి స్కూళ్లలో పెట్టిన ఘనత ప్రజాప్రభుత్వానిది. వైకాపా 2019 నుంచి 2024 వరకు ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. డీఎస్సీ నిర్వహించాలంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టిం గ్ జరగాలి. అది చేయాలంటే సరిపడా కంప్యూటర్ సెంటర్లు ఉండాలి. మనకు ప్రధానమైన సమస్య రాష్ట్రంలో సరిపడా సెంటర్లు లేవు. అభ్యర్థులందరికీ తమ జిల్లాలో పరీక్ష రాయాలనే కోరిక ఉంటుంది. శ్రీకాకుళం, ఇచ్చాపురం వాళ్లు కుప్పం వరకు వెళ్లలేరు. గోదావరి జిల్లాల వాళ్లు రాయలసీమ వెళ్లి రాయలేరు. ఇందుకోసం ఒక సాఫ్ట్‌వేర్ రూపొందించి 87.8 శాతం మందికి వారి ఫస్ట్ చాయిస్ మేరకు డీఎస్సీ సీబీటీ ఎగ్జామ్‌కు టీసీఎస్ అయాన్ సెంటర్ కేటాయించాం. టీసీఎస్ అయాన్ సెంటర్లను కూడా ఫిజికల్ గా వెళ్లి తనిఖీచేయాలని ఆదేశించాం. సీసీటీవీ పనిచేస్తుందా, ఫుటేజి రికార్డు అవుతుందా అని పరిశీలించాం. మన పిల్లలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నందున 19 సెంటర్లను ఇతర రాష్ట్రాల్లో కూడా ఏర్పాటుచేశాం.
నార్మలైజేషన్ కోసం సైంటిఫిక్ మెకానిజం
నార్మలైజేషన్ కోసం ఒక సైంటిఫిక్ మెకానిజంను ఉపయో గించాం. దీనిపై కూడా వైసీపీ వాళ్లు చాలెంజ్ చేస్తే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. కోర్టు ఎగ్జామినేషన్‌కే నార్మలైజేషన్ ఉన్నపుడు డీఎస్సీకి ఎందుకు ఉండకూడదని ప్రశ్నించి ఆ కేసును డిస్మిస్ చేసింది. పారదర్శకంగా నార్మలైజేషన్ పాటించాం. గ్రీవెన్స్ రిడ్రస ల్ కూడా పకడ్బందీగా నిర్వహించాం. ఆన్‌లైన్ అప్లికేషన్ కూడా బెస్ట్ సాఫ్ట్‌వేర్ తీసుకొచ్చాం. ఆధార్ బేస్డ్ ఓటీపీ మెకానిజం ఏర్పాటు చేసి సెక్యూర్డ్ మెకానిజం పెట్టాం. క్వాలిఫికేషన్ బట్టి ఎగ్జామ్ రాయవచ్చు. కొంతమంది రెండు ఎగ్జామ్స్ రాశారు. ఫీజు కూడా ఆన్‌లైన్‌లో పారదర్శకంగా చెల్లించారు. అది నేరుగా డిపార్ట్ మెంట్‌కు చేరగా, టీసీఎస్ అయాన్‌కు పేమెంట్ చేశాం. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ నోటిఫికేషన్ సమయంలో డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలని చెప్పాం. అభ్య ర్థుల విన్నపం మరకు ఫైనల్ సెలక్షన్ సమయంలో సర్టిఫికెట్లు చూపించే వెసలుబాటు కల్పించాం. ఏడెనిమిది సంవత్సరాలు డీఎస్సీ జరగనందున అభ్యర్థుల మనోభావాలకు అనుగుణంగా ప్రక్రియ నిర్వహించాం. క్వశ్చన్ పేపర్ ఎలా తయారుచేశామో సభ్యులు తెలుసుకోవాలి. 42 వేల ప్రశ్నలను S్పుజు=T నుంచి సబ్జెక్టు నిపుణులను తెచ్చి తయారు చేయించాం. ఏ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ ఏ క్వశ్చన్లు తయారుచేశారు చేశారో ఆ డేటా మా వద్ద ఉంది. ప్రోటోకాల్ మెయింటైన్ చేశాం..కాన్ఫిడెన్షియల్ రూం పెట్టాం. వాళ్లే టీసీఎస్ అయాన్‌కు అప్‌లోడ్ చేసే మెకానిజం ఏర్పాటు చేశాం. 89 టెస్ట్ సెషన్లు, 13 సబ్జెక్టులు, 67 రకాల పోస్టులు 24 రోజుల్లో పూర్తిచేశాం.
టీసీఎస్ అయాన్ ద్వారా పారదర్శకంగా పరీక్షలు
టీసీఎస్ అయాన్ ఇప్పటికి 15 కోట్ల మంది పిల్లలకు టెస్ట్ సెషన్లు నిర్వహించింది. ఐఐటీì, ఐఐఎం, ఎయిమ్స్, ఏపీపీఎస్సీ, ఏపీ హైకోర్టు పరీక్షలు దీని ద్వారానే నిర్వహిస్తున్నారు. మొత్తం ఆన్‌లైన్ మెకానిజంలో పారదర్శకంగా నిర్వహించాం. మొత్తం ఎండ్ టు ఎండ్ 256 ఎన్‌స్కిప్షన్‌లో దీనిని చేపట్టాం. దానిని బ్రేక్ చేయడం కొత్తగా ఏపీకి వచ్చే క్వాంటమ్ వల్ల అయితే సాధ్యమవుతుందేమో కానీ అంతటి టెక్నాలజీ కూడా ఇప్పుడు లేదు. స్కేలబుల్, సెక్యూర్డ్ ప్లాట్‌ఫాంను ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది. సైబర్ సెక్యూరిటీ, ఫిజికల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశాం.154 సెంటర్లు ఏపీలో, 19 సెంటర్లు రాష్ట్రేతర ప్రాంతంలో ఏర్పాటు చేసి సీబీటీ టెస్ట్ 24 రోజుల్లో పారదర్శకంగా నిర్వహించాం. మొత్తం ప్రక్రియ పూర్తయిన సంవత్సరం తర్వాత వైసీపీ నాయకులు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని గొడవ చేస్తున్నారు. డీఎస్సీ అంటే అవగాహన లేని దౌర్భాగ్యపు ప్రతిపక్షం రాష్ట్రంలో ఉంది. వారి అధికార ప్రతినిధి ఒక డిబేట్‌లో డీఎస్సీ అంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ అంటున్నారు. డీఎస్సీ అంటే అర్థం తెలియనివాళ్లు దాని గురించి మాట్లాడుతున్నారు. పారదర్శకంగా టీసీఎస్ అయాన్ ద్వారా నిర్వహించిన సెలక్షన్ విధానాన్ని వారు తప్పుబడుతున్నారు. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్‌లో భాగంగా ఎగ్జామ్ పూర్తయిన తర్వాత కీ రిలీజ్ చేశాం.. ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. తర్వాత సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌లతో విశ్లేషించి ఫైనల్ కీ పబ్లిక్ డొమైన్ లో పెట్టాం. నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్ చేసి డిస్ట్రిక్ట్ మెరిట్ లిస్ట్ పెట్టాం, పరీక్ష రాసిన ప్రతి వాళ్లకు ఎసఎంఎస్ పంపించాం.
వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ అమలుచేశాం
సర్టిఫికేషన్ వెరిఫికేషన్ తర్వాత 16,291 మందికి కాల్ లెటర్స్ పంపాం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ కారణంగా 722 మంది ఇవ్వలేకపోయాం. ఎలిజిబిలిటీ కండీషన్స్‌లో కొంతమందికి అవకాశం రాలేదు. చాలా పకడ్బందీగా ప్రక్రియ నిర్వహించాం. వర్టికల్, హారిజాంటల్ వర్టికల్ బీసీ, ఎస్సీ వర్గాల వారీగాను, హారిజాంటల్ డిజెబిలిటీ, స్పోర్ట్స్ కోటా తదితరాలు ఉంటాయి. గతంలో రోస్టర్ పాయింట్ వారీగా రిజర్వేషన్ ఉండేది. దాని ఆధారంగా తీసుకుని నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే నోటిఫికేషన్‌ను కోర్టు కొట్టి వేసేది. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ చేయాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు క్లియర్‌గా ఉన్నాయి. ఈ విధానంలో రిజర్వేషన్ అమలు చేసిన ఏకైక ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వం. గ్రీవెన్స్ రిడ్రసల్ మెకానిజం ఏర్పాటు చేశాం. హైకోర్టు సూచన మేరకు కేవలం మÖడుగంటల్లో రిడ్రసెల్ సెల్ ఏర్పాటు చేశాం. 33,840 గ్రీవెన్స్ వచ్చాయి. త్రీ స్టెప్ ప్రాసెస్‌లో పరిష్కరించాం. కేవలం 36 మాత్రమే ఫైనల్ అప్పిలేట్ అథారిటీకి వచ్చాయి. ప్రతి గ్రీవెన్స్ రివ్యూ చేశాం. ఫైనల్ సెలక్షన్ లిస్టు అఫిషియల్ వెబ్‌సైట్‌లో పెట్టాం. దాని తర్వాత అపాయింట్ మెంట్ ఆర్డర్ ఇచ్చి ట్రైనింగ్‌కు తీసుకెళ్లాం.
స్పోర్ట్స్ కోటా పోస్టులను పారదర్శకంగా భర్తీ చేశాం
ఎగ్జామినేషన్ నిర్వహణ దగ్గర నుంచి ఫైనల్ ట్రైనింగ్ వరకు పారదర్శకంగా ప్రజాప్రభుత్వం డీఎస్సీ నిర్వహించింది. ఎక్కడ కానీ షార్ట్ కట్‌లో చేయలేదు. 148 రోజుల్లో పకడ్బందీగా నిర్వహించాం. భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు. మన ప్రభుత్వం చేయ గలిగాం. స్పోర్ట్స్ కోటా గురించి టీమ్ 11 అనేక ఆరోపణలు చేస్తోంది. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ రావాలని ప్రధాన మంత్రి చెప్పారు. రాష్ట్రాలు సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఏపీలో స్పోర్ట్ పర్సన్లకు భూమి కేటాయించడం కొత్త కాదు. పీవీ సింధుకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వానిది. మరి కొన్నేళ్లలో ఆమె ఐఎఎస్ అధికారి కాబోతోంది. యర్రా జ్యోతి ఉత్తరాంధ్ర బిడ్డ.. ముఖ్యమంత్రికి చెబితే వెంటనే ఉద్యోగం ఇవ్వమని చెప్పారు. క్రికెటర్ శ్రీచరణికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని సీఎం డైరెక్షన్. డిగ్రీ పూర్తయిన వెంటనే గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని చెప్పారు. స్పోర్ట్స్ పర్సన్‌కు టెస్ట్ పెట్టాలని లేదు. అది క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా తీసుకున్న నిర్ణయం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు 65 డిసిప్లిన్స్ తీసుకొచ్చాం. దాంట్లో కూడా ప్రయారిటీలు పెట్టి ప్రయారిటీ వన్ పూర్తిచేశాకే ప్రయారిటీ -2కి వెళ్లాం. స్పోర్ట్స్ కోటా కూడా పారదర్శకంగా నిర్వహించాం. సర్టిఫికేషన్ వెరిఫికేషన్‌లో కూడా శాప్ ఆధ్వర్యంలో వివిధ దశల్లో నెలరోజుల పాటు పరిశీలన పూర్తిచేశాకే స్పోర్ట్స్ డీఎస్సీ కోటా అభ్యర్థులను పకడ్బందీగా ఎంపిక చేశాం.
ఆషామాషీగా కాదు..అంతా పారదర్శకంగానే…
ఇది ఆషామాషీగా చేసింది కాదు.. అంతా పారదర్శకంగానే మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేశాం. కావాలని ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కూన రవి, ఎంపీ భరత్, మరో ఎంపి అసోసియేషన్ల బాధ్యతల్లో ఉన్నందున వారికి అనుకూలమైన వారికి ఉద్యోగాలు ఇచ్చారనడం తప్పు. ఆధారాలు ఉంటే తీసుకురండి..నిరూపించండి. చాలా పారదర్శకంగా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేశాం. ఆధారాలు లేకుండా మొత్తం ప్రక్రియ పూర్తయి సంవత్సరం తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరం.
ఆరోపణలపై సమాధానం చెప్పడం నా బాధ్యత
మొదటి ఆరోపణ`సమాధానం: S్పుజు=T డైరక్టర్‌కు డీఎస్సీ నిర్వహణ బాధ్యత అప్పగించారనడం. ఇది ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగింది. 148 రోజుల్లో త్వరగా నిర్వహించాలని ఒక వ్యక్తిని నియమించాం. అది చట్ట ఉల్లంఘన కాదు. ఈ ప్రక్రియలో ఆయన కింద 50 మంది పనిచేశారు. వారు అహర్నిశలు కష్టపడి ప్రక్రియ పూర్తిచేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-09-2026

క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం

‘సంజీవని’ దేశానికే గేమ్ ఛేంజర్

2వ ఆరోపణ`సమాధానం: అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్‌లో ఉన్నాడు..అతనికి మొదటి ర్యాంకు వచ్చింది అని. అతని లాగిన్ బ్లాక్ చేశారని చెప్పారు. క్వశ్చన్ పేపర్ సెట్టింగ్‌లో ఆ వ్యక్తికి ఎలాంటి ప్రమేయం లేదు. డైరక్టర్ ఎస్‌సీఈఆర్‌టీì ఎంప్లాయిస్ క్వశ్చన్ పేపర్ సెట్ చేశారు. ఆరోపణలు చేస్తున్న వ్యక్తికి కాల్ లెటర్ వెళ్లింది.. సర్టిఫికేషన్ వెరిఫికేషన్‌కు రాలేదు. దీంతో ఆటోమేటిక్‌గా డిస్ క్లాలిఫై అయ్యారు. అతను డిపార్ట్‌మెంట్ నుంచి ఎనఓసీ తీసుకోలేదు. అందువల్ల అతని లాగిన్స్ తొలగించాం. 42 వేల ప్రశ్నలు ర్యాండమైజ్ విధానంలో పిల్లలకు వెళతాయి. ఏదో జరిగిపోయింది అనడం సబబు కాదు. ఒక్కొక్కరికి డిఫరెంట్ పేపర్..డిఫరెంట్ ఆర్డర్‌లో వెళుతుంది. పేపర్ లీకైంది అనడం అవాస్తవం.
3వ ఆరోపణ`సమాధానం: ట్రాన్స్‌పరెన్సీ లేదు..కలెక్టర్ ఆఫీసులో లిస్టు పెట్టలేదు అంటున్నారు. అభ్యర్థులందరికీ ఎసఎంఎస్ పంపించాం. ఆన్ లైన్ లాగిన్ మెకానిజం ఇచ్చాం. డీఈవో వద్ద మెరిట్ లిస్టు పారదర్శకంగా పెట్టాం. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఫోన్ వాడకపోతే ఎవరూ వాడరు అనుకోవడం పొరపాటు. ప్రజాప్రభుత్వం ఫోన్‌కే డైరక్ట్‌గా సమాచారం ఇస్తుంటే ట్రాన్స్ పరెన్సీ లేదని ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్. చాలా స్పష్టంగా పారదర్శకంగా రిజల్ట్స్ ప్రకటించాం.
4వ ఆరోపణ`సమాధానం: స్పోర్ట్ కోటాలో డబ్బు వసూలు చేస్తున్నారని ఆడియో లీక్ వచ్చింది. సర్టిఫికెట్ డబ్బులకు అమ్ముతున్నారు అని. అటువంటి వారిని శాప్ ప్రొటెక్ట్ చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఆడియో లీక్ వచ్చిన వెంటనే ఆ వ్యక్తిపై శాప్ విజయవాడ కమిషనర్ కు కంప్లయింట్ ఇచ్చి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించాం. తప్పు చేస్తే ఎవరినీ వదిలేది లేదు. సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఈ కేసును లాజికల్ కంక్లూజన్‌కు తీసుకెళతాం. గొడ్డలి పార్టీ ప్రెస్‌మీట్ లో వ్యక్తుల వారీగా మార్కులు చెబుతున్నారు. అవి ఆన్‌లైన్‌లో మన వెబ్‌సైట్‌లోవే. మనం అంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాం.
కులం, మతం, ప్రాంతం పేరుతో చిచ్చు
ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో కులం, మతం, ప్రాంతం పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోంది. గొడ్డలి పార్టీ అండతో ఒక రిటైర్డ్ ఐఎఎస్ అధికారి స్పోర్ట్స్ కోటాలో వచ్చిన 372 మంది ఒకే సామాజికవర్గం నుంచి ఎంపికయ్యారని ఆరోపణ చేశారు. ఆ మహానుభావుడికి ఐఎఎస్ ఎలా వచ్చిందో దేవుడికి తెలియాలి. 372 మందిలో 46 మంది ఓసీ, 185 మంది బీసీ, 112 మంది ఎస్సీ, 29 మంది ఎస్టీ సోదరులు కూడా ఉన్నారు. ఉపకులాల వారీగా కూడా మా వద్ద డేటా ఉంది. చాలా పారదర్శకంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులను ఎంపిక చేశాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించిన 65 స్పోర్ట్స్ కేటగిరిలను మేం పరిగణనలోకి తీసుకున్నాం. గతంలో ఉన్న 29 తీసుకుని ఉంటే ఎవరైనా కోర్టుకు వెళితే స్టే వచ్చేది. వారి ఆలోచన స్టే వస్తే డీఎస్సీ జరగకుండా చూడటమే. కేంద్రప్రభుత్వం ఇచ్చిన ప్రతి గైడ్‌లైన్ మేం ఫాలో అవుతున్నాం. యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్‌లో కూడా యÖజీసీ గైడ్‌లైన్స్ మేం ఫాలో అవుతున్నాం.
డీఎస్సీని అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ కేసులు
డీఎస్సీపై 336 కేసులు ఫైల్ అయ్యాయి. గొడ్డలి పార్టీ నాయకులు ఒక పిల్ వేశారు. ఎట్టి పరిస్థితుల్లో డీఎస్సీ రద్దుచేయాలన్నారు. 16 వేలమంది టీచర్లను ఉద్యోగాలనుంచి తీసేయాలన్నారు. కోర్టును ఆశ్రయించడానికి అభ్యర్థులు భయపడుతున్నారని అందులో చెప్పారు. భయపడితే 336 కేసులు ఎలా వేశారని కోర్టు ప్రశ్నించింది. 148 రోజుల్లో 141 కేసులు వేశారు. ఎట్టి పరిస్థితుల్లో డీఎస్సీని అడ్డుకోవాలని విశ్వప్రయత్నాలు చేశారు. అవన్నీ తట్టుకొని 16 వేల మందిని టీచరు పోస్టులను ప్రజాప్రభుత్వం భర్తీ చేసింది. ఎలాంటి పేపర్ లీక్ జరగలేదు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ పేపర్ సెట్టింగ్ బాధ్యత ఇవ్వలేదు. మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టు ఆన్ లైన్ మెకానిజంలో ఉంది. పారదర్శకంగా ప్రజలముందు పెట్టాం. గ్రీవెన్స్ రిడ్రసెల్‌కు మెకానిజం ఏర్పాటుచేశాం. హైకోర్టు తరహాలో నార్మ లైజేషన్ నిర్వహించాం. హారిజాంటల్ రిజర్వేషన్ అమలుచేశాం. ఆంధ్రరాష్ట్ర యువతకు నేను హామీ ఇస్తున్నా. చాలా పారదర్శకంగా డిఎస్సీ నిర్వహించాం. ముఖ్యమంత్రిగారి తొలి సంతకం కనుక ఎంతో బాధ్యతగా చేశాం. ఎక్కడా తప్పు జరగకుండా నిర్వహించి 16వేల టీచర్లను నియమించాం. కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపికైన టీచర్ల కుటుంబాలకు వెళ్లి మాట్లాడారు. వారి కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకున్నారు. కష్టపడి చదువుకొని వారు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. టీచర్ కావాలన్నది వారి ఆశ.
ఐదేళ్లలో ఎందుకు డీఎస్సీ నిర్వహించలేదు
ఐదేళ్లూ ఒక్క నోటిఫికేషన్ లేదు. ఎందుకు డీఎస్సీ నిర్వహించలేదో టీమ్ -11 కెప్తెన్ వస్తే అడుగుదామని అనుకున్నాను. వన్‌క్లాస్ `వన్ టీచర్ మా తపన. టీచర్ రిక్రూట్‌మెంట్ వల్లే 33 శాతం అంటే సుమారు 10 వేల పాఠశాలల్లో మన ప్రభుత్వం వన్‌క్లాస్`వన్ టీచర్ విధానం తేగలిగింది. ప్రతిభ, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. అందుకే అన్ని అంశాలు ప్రజలముందు ఉంచుతున్నాం. యువతకు నేను భరోసా ఇస్తున్నా. ప్రతి సంవత్సరం ప్రజాప్రభుత్వం డీఎస్సీ నిర్వహిస్తుంది. ఇందులో రెండో ఆలోచనే లేదు. ఈ ఏడాది కూడా 3 వేల టీచర్ పోస్టులతో డీఎస్సీ ప్రకటించబోతున్నాం. మెగా జాబ్ క్యాలండర్ ద్వారా 10,060 పోస్టుల భర్తీకి చర్యలు చేపడు తున్నాం. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2, డీఎస్సీ కలిసి ఉన్నాయి. టెట్ ఎగ్జామ్ 2,3 రోజుల క్రితమే పూర్తయింది. ఉగాది లోపల వచ్చే అకడమిక్ ఇయర్‌కు కొత్త టీచర్లను స్కూళ్లకు పంపించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది.
యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి
యువత అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు మన బిడ్డలే ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలా వ్యవహరిస్తాం అని నేను ఆలోచిస్తాను. అదే డిపార్ట్‌మెంట్ ప్రతి మీటింగ్‌లో చెప్పాను. కోట్లాదిమంది మనవైపు చూస్తున్నారు. ఒక మోడ ల్‌గా చేయాలి. భారతదేశంలో నెం.1 మోడల్ మన విద్యావ్యవస్థను చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మొన్న జరిగిన ఎగ్జామ్స్‌లో కొంతమందికి అవకాశాలు రాలేదు. మళ్లీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. ప్రిపేర్ అవ్వండి.. మెరుగైన అవకాశం మీకు వస్తుంది. మీకు ఎలాం టి సందేహం అవసరం లేదు. చాలా పారదర్శకంగా చేస్తున్నాం. మంత్రిగా ఓపెన్ మైండ్‌తో ఉన్నాను. పర్‌ఫెక్ట్ మెకానిజంపై సలహాలు, సూచనలు అందించండి. ఉపాధ్యాయులు మనతో ఉన్నారు. స్వచ్ఛందంగా కర్నూలు, విజయవాడలో ర్యాలీ చేశారు. సభ తరపున, ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ సంఘీభావం మాకు కొండంత బలం. దీంతో ఇంకా చేయాలనే తపన నాలో పెరిగింది.
బెస్ట్ టీచర్లను విదేశాలకు పంపుతున్నాం
సంవత్సరం తర్వాత మాట్లాడటం కాదు. హౌస్‌కు రండి.. ఇంకా గొడ్డలి పార్టీ అధ్యక్షుడు బెంగుళూరులోనే ఉన్నారు. 2019-24 వరకు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటుకు వెళ్లారు. ఉపాధ్యాయుల సూచనలకు పెద్దపీట వేస్తున్నాం. వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం. వారితో పాటు క్లస్టర్ మీటింగ్‌లో పాల్గొంటున్నాం. బెస్ట్ టీచర్లను సింగపూర్, ఫిన్లాండ్ పంపించాం. కుంభకోణాలు జగన్ అనే వ్యక్తికి, ఆ కుటుంబానికి పేటెంట్. రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు డీఎస్సీ పేపర్ లీక్ అయింది. రవీంద్రనాథ్‌రెడ్డి ఓఎంఆర్ షీట్లు హైదరాబాద్ తీసుకెళ్లారు.

Previous Post

వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు

Next Post

భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-09-2026

కార్యకర్త
@ September 14, 2026
క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం
ఆంధ్రప్రదేశ్

క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం

చైతన్యరధం
@ September 14, 2026
‘సంజీవని’ దేశానికే గేమ్ ఛేంజర్
ఆంధ్రప్రదేశ్

‘సంజీవని’ దేశానికే గేమ్ ఛేంజర్

చైతన్యరధం
@ September 14, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-09-2026

కార్యకర్త
@ September 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-09-2026

కార్యకర్త
@ September 12, 2026
ఆంధ్రప్రదేశ్

శతాబ్దం కాలం నాటి భూ సమస్యలనూ పరిష్కరిస్తున్నాం

చైతన్యరధం
@ September 12, 2026
పెన్షన్లు-సంక్షేమం కోసం చిన్న కుటుంబాలుగా విడిపోవద్దు 
ఆంధ్రప్రదేశ్

దస్త్రాల పరిష్కారంలో జాప్యం వద్దు.. వేగం పెంచాలి

చైతన్యరధం
@ September 12, 2026
పెన్షన్లు-సంక్షేమం కోసం చిన్న కుటుంబాలుగా విడిపోవద్దు 
ఆంధ్రప్రదేశ్

పెన్షన్లు-సంక్షేమం కోసం చిన్న కుటుంబాలుగా విడిపోవద్దు 

చైతన్యరధం
@ September 12, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం

క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం

చైతన్యరధం
@ September 14, 2026
‘సంజీవని’ దేశానికే గేమ్ ఛేంజర్

‘సంజీవని’ దేశానికే గేమ్ ఛేంజర్

చైతన్యరధం
@ September 14, 2026

శతాబ్దం కాలం నాటి భూ సమస్యలనూ పరిష్కరిస్తున్నాం

చైతన్యరధం
@ September 12, 2026
పెన్షన్లు-సంక్షేమం కోసం చిన్న కుటుంబాలుగా విడిపోవద్దు 

దస్త్రాల పరిష్కారంలో జాప్యం వద్దు.. వేగం పెంచాలి

చైతన్యరధం
@ September 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం

క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం

చైతన్యరధం
@ September 14, 2026
‘సంజీవని’ దేశానికే గేమ్ ఛేంజర్

‘సంజీవని’ దేశానికే గేమ్ ఛేంజర్

చైతన్యరధం
@ September 14, 2026

శతాబ్దం కాలం నాటి భూ సమస్యలనూ పరిష్కరిస్తున్నాం

చైతన్యరధం
@ September 12, 2026
పెన్షన్లు-సంక్షేమం కోసం చిన్న కుటుంబాలుగా విడిపోవద్దు 

దస్త్రాల పరిష్కారంలో జాప్యం వద్దు.. వేగం పెంచాలి

చైతన్యరధం
@ September 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist