చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్

డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్

by చైతన్యరధం
Oct 5, 2025 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • డ్రైవర్ల సంక్షేమం బోర్డు ఏర్పాటు చేస్తాం
  • ఆటోలపై జరిమానాల భారం తగ్గిస్తాం
  • ప్రభుత్వం చేసే మంచి పనులను డ్రైవర్లే ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  • పరదాలు కట్టుకుని రాలేదు… దర్జాగా ఆటోలో వచ్చాం
  • చెడుపై మంచి సాధించిన విజయమే పండుగల స్ఫూర్తి
  • దుష్టులు మళ్లీ రాకూడదు… అభివృద్ధి వైకుంఠపాళి కాకూడదు
  • ‘ఆటో డ్రైవర్ సేవలో…’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
  • 2.90 లక్షల డ్రైవర్ల ఖాతాల్లో రూ.436 కోట్ల జమ
  • క్యాంప్ ఆఫీసు నుంచి సభా ప్రాంగణం వరకు 14 కిలోమీటర్ల దూరం ఆటోలో ప్రయాణించిన సీఎం
  • వేర్వేరు ఆటోల్లో సభా ప్రాంగణానికి వచ్చిన
  • డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్

విజయవాడ (చైతన్యరథం): ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్ తెస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని విజయవాడ సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో సీఎం చంద్ర బాబు శనివారం ప్రారంభించి లబ్ధిదారులకు చెక్కులు అందించారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15వేలు వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేశారు. రాష్ట్రంలోని 2,90,669 మంది డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.436 కోట్లు జమ చేశారు. సభా ప్రాంగణంలో డ్రైవర్లు అందించిన ఖాకీచొక్కాలను ధరించి సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ… కూటమి పాలనలో ప్రజల కష్టాలు తీరాయి.. సంక్షేమం దరిచేరిందన్నారు. ఉబర్, ర్యాపిడో వంటి యాప్లు ఉన్నాయి. వీటి ద్వారా ఆటో డ్రైవర్లు కొంత మేర ఇబ్బంది పడుతున్నారు. వాటిని ప్రభుత్వం కంట్రోల్ చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఆటో డ్రైవర్ల కోసం ఓ యాప్ తెస్తాం. ఆ యాప్ ద్వారా ఆటో డ్రైవర్లకు బుకింగ్లు వచ్చేలా చూస్తాం. కిరాయి కోసం ఆటో స్టాండుకు వెళ్లి పడిగాపులు పడే అవసరం లేకుండా టెక్నాలజీ ద్వారా సహకారం అందిస్తాం. ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి యాప్ ద్వారా మీకు అవకాశాలు దొరికేలా చేస్తాం. యాప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసమే ఖర్చుపెడతాం. అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమబోర్డు ఏర్పాటుచేసి… ఆటో డ్రైవర్ల భవిష్యత్తును మరింత మంచిగా తీర్చిదిద్దేలా పని చేస్తాం. ఆటో, మాక్సి క్యాబ్, క్యాబ్ డ్రైవర్లందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసమే ఆటోడ్రైవర్ సేవలో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఎవరికి లంచాలు ఇవ్వకుండా, కార్యాలయాలకు తిరగకుండా అర్హుల అందరి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేశాం. అర్హుల్లో ఏ ఒక్కరికి డబ్బులు జమ కాకపోయినా ప్రభుత్వానికి చెప్పండి… ఆర్హతను బట్టి ఖాతాలో వేస్తామని సీఎం భరోసా ఇచ్చారు.

గుంతలు పూడ్చాం… ఆటో రిపేర్ల ఖర్చు తగ్గించాం
గత పాలకులు రోడ్లను అస్సలు ఏ మాత్రం పట్టించుకోలేదు… ధ్వంసం చేశారు. మేం వచ్చేసరికి రోడ్లన్నీ గుంతలు పడ్డాయి. గత పాలకుల హయాంలో వాహనాల్లో ప్రయాణిస్తే ఒళ్లు హూనం అయ్యేది. ఆటోల రిపేర్లకే ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్ల రిపేర్లపై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాం. రాష్ట్రంలో 23 వేల కిలోమీటర్ల మేర మరమ్మతులు చేసి గుంతలు లేని రోడ్లను తయారు చేశాం. దీంతో వాహనాలు సాఫీగా సాగుతున్నాయి. రిపేర్ల ఖర్చు తగ్గింది. గతంలో ఆటోలపై పెద్ద ఎత్తున జరిమానాలు విధించేవారు. అనవసరంగా ఉన్న జరిమానాల జీవోలను రద్దుచేస్తాం. చలానా విధానాన్ని సరళీకృతం చేయటంతో పాటు ఆటోలను ఈవీలుగా మారుస్తాం.. దీనికి ప్రభుత్వం సహకరిస్తుంది. ఆటో, మాక్సి, క్యాబ్ డ్రైవర్లు క్రమశిక్షణగా ఉండాలి. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించవద్దు… ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. ప్రజలను ఇబ్బంది పెట్టకండి. మీరు సహకరిస్తే పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు చెప్పండి
ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఆర్థిక సాయం డబ్బులు డ్రైవర్ల ఖాతాల్లో పడ్డాయి. డ్రైవర్లకు ఇది పండుగ. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం. 15 నెలల్లో ప్రతీ పేదవాడి జీవితంలో మార్పు తెచ్చే దిశగా మెరుగైన పాలన అందిస్తూ వచ్చాం. కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేస్తుంటే… ప్రధాని మోదీ సూపర్ జీఎస్టీ తెచ్చి ఆర్థిక భారం తగ్గించారు.
చెప్పిన పని చెప్పినట్లుగా చేసే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. దేశ చరిత్రలో మరే రాష్ట్రంలో లేని సంక్షేమం సూపర్ 6 ద్వారా ఏపీలోనే అమలు చేస్తున్నాం. స్త్రీశక్తి పథకం ద్వారా కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించింది. ఆటో డ్రైవర్ కుటుంబంతో కలిసి ఇవాళ వేదిక వరకూ వచ్చాను… వారి
కుటుంబం కష్ట సుఖాలను తెలుసుకున్నాను. అన్న క్యాంటీన్లలో రూ.5కే ఆహారం పెడుతున్నాం. పాఠశాలల్లో మధ్యాహ్నం పిల్లలకు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. దసరా జరుపుకున్నాం… ఓజీ సినిమా చూశాం.. ఇప్పుడు ఆటో డ్రైవర్ల సేవలో ఉన్నాం. ఇలా నిత్యం ఏదోక సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమం చేపడుతూనే ఉన్నాం. ఆటోడ్రైవర్ల ఇంట్లో ఆడబిడ్డలు కూడా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఉచిత బస్సు ప్రయాణం వాడుకోవచ్చు. స్త్రీ శక్తి పథకం బంపర్ హిట్ అయ్యింది. యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలో అందరికీ ఉచిత ఆరోగ్య బీమా కల్పించాం. 25 లక్షల వరకూ పేదలకు ఉచిత వైద్య సేవలు అందుతాయి. డ్రైవర్ల కోసమే కాదు… ప్రజలందరికీ మంచి జరిగేలా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. మంచి చేస్తోన్న కూటమి ప్రభుత్వం గురించి డ్రైవర్లంతా ప్రజలకు
వాస్తవాలు వివరించాలి. మంచి చేస్తున్న ప్రభుత్వం  గురించి పది మందికి చెప్పండి. ప్రజలంతా ఆనందంగా ఉండటమే కూటమికి కావాల్సిందని సీఎం వివరించారు.
దసరా, దీపావళి పండుగలే స్పూర్తి
దుష్టశక్తులను అంతం చేసినందుకు దసరా, దీపావళి పండుగలు జరుపుకుంటాం. ఈ పండుగలను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. మన సంస్కృతిలో భాగమైన పండుగల్ని ఉత్సాహంతో చేసుకోవాలి. ఆ పండుగల సారాంశాన్ని గ్రహించాలి. రాష్ట్రానికి మళ్లీ దుష్ట శక్తులు రాకుండా జాగ్రత్త పడాలి. ఈ పండుగలు నేర్పించే పాఠాలను అర్థం చేసుకోవాలి. 16 నెలల క్రితం వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి. పాలన ఎక్కడికక్కడ ఆగిపోయింది. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను కూడా గత పాలకులు నడవనీయలేదు. 16 నెలల క్రితం వరకూ పరదాలు కట్టుకుని తిరుగుతూ ఎక్కడికక్కడ గోతులు తవ్వారు. ప్రజల్ని భయాందోళనలో ఉంచారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. పేదల సంక్షేమంలోనూ డబ్బులు బొక్కేసిన
వాళ్లు రాజకీయానికి పనికిరారు. ఇలాంటి దుష్టశక్తులు తిరిగి రాకుండా, ప్రజలకు చెడు జరగకుండా కాపాడుకోవాలి. మనకు ఇక ఈ వైకుంఠపాళి వద్దు. గుజరాత్లో 25ఏళ్లుగా ఉన్న సుస్థిర పాలనను స్ఫూర్తిగా తీసుకోవాలి. కేంద్రంలో
15ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నందునే ప్రజల కష్టాలు తీరాయి. వైకుంఠపాళీ వల్ల రాష్ట్రానికి ఇబ్బందులే. అందుకే అలాంటి వారి పాలన మనకు వద్దు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అభివృద్ధి సాధ్యం. 16 నెలల కాలంలో వ్యవస్థలను గాడిలో పెట్టాం. సంపద సృష్టించి పేదలకు పంచుతూ సుపరిపాలన దిశగా కూటమి
ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గతంలో మాదిరిగా పరదాలు కట్టుకుని రాలేదు… ఆటోలో దర్జాగా వచ్చాం. 2024లో జరిగిన ఎన్నికలు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. 94 శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది. ప్రభుత్వం అమలు చేస్తున్న
కార్యక్రమాలతో ఈ స్ట్రైక్ రేట్ ఇంకా పెరగాలని ముఖ్యమంత్రి అన్నారు.

కష్ట, సుఖాలు తెలుసుకుంటూ ఆటోలో ప్రయాణం…
సీఎం చంద్రబాబు తన నివాసం నుంచి సభా ప్రాంగణం వరకు ఆటోలో ప్రయాణించారు. సుమారు 14 కిలోమీటర్ల దూరం సీఎం ఆటోలో ప్రయాణించారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ వేర్వేరుగా ఆటోల్లో ప్రయాణించి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆటో డ్రైవర్ సేవలో పథకం లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, మాధవ్ ఆటోల్లో ప్రయాణించారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా 14 కిలోమీటర్లు ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు వారి కుటుంబ స్థితిగతులను నేతలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నామని సీఎం అడిగిన ఓ ప్రశ్నకు ఆటో డ్రైవర్ అఫ్సర్ ఖాన్ సమాధానమిచ్చారు. ఆటో ద్వారా ప్రజలను, ప్రయాణికుల్ని గమ్య స్థానాలకు చేరుస్తూ చేస్తున్న సేవ అభినందనీయమని సీఎం బదులిచ్చారు. ఆటోల్లో వెళ్తున్న చంద్రబాబును, ఇతర నేతలను చూసి ప్రజలు సంతోషంతో కేరింతలు కొట్టారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ నేతలు ముందుకు కదిలారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కాళేశ్వరరావు మార్కెట్, ఏలూరు లాకులు, ముత్యాలంపాడు గవర్నమెంటు ప్రెస్ మీదుగా సీఎం సహా ఇతర నేతలు ఆటోల్లో ప్రయాణించారు. ఆటోల్లో సభా ప్రాంగణానికి చేరుకోగానే ప్రయాణానికి సంబంధించిన డబ్బులను ఆటో డ్రైవర్లకు చంద్రబాబు, ఇతర నేతలు అందచేశారు.

ఆటోడ్రైవర్లు ఇచ్చిన ఖాకీ చొక్కాలను ధరించి సీఎం, డిప్యూటీసీఎం, మంత్రి లోకేష్, మాధవ్ సభలో పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమానికి సంకేతంగా వేదిక మీద నేతల వెనుక మూడు ఆటోలను నిర్వాహకులు ప్రదర్శించారు. లబ్ధిదారులైన ఆటో డ్రైవర్లతో కలిసి నేతలు వేదిక మీద కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, రవాణా శాఖ ఉన్నతాధికారులు సహా స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 04-10-2025

Next Post

14 కిలోమీటర్లు ఆటోలో..సీఎం చంద్రబాబు ప్రయాణం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026

కార్యకర్త
@ May 8, 2026
చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

కార్యకర్త
@ May 7, 2026
ఆంధ్రప్రదేశ్

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా
ఆంధ్రప్రదేశ్

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్
ఆంధ్రప్రదేశ్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే
ఆంధ్రప్రదేశ్

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

చైతన్యరధం
@ May 7, 2026
అతుకులు లేని జాతీయజెండా
ఆంధ్రప్రదేశ్

అతుకులు లేని జాతీయజెండా

చైతన్యరధం
@ May 7, 2026
డేటా సెంటర్ పరికరాల తయారీలో దేశం అగ్రగామిగా నిలవాలి
ఆంధ్రప్రదేశ్

డేటా సెంటర్ పరికరాల తయారీలో దేశం అగ్రగామిగా నిలవాలి

చైతన్యరధం
@ May 7, 2026
Load More

ముఖ్య వార్తలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

చైతన్యరధం
@ May 6, 2026
కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

చైతన్యరధం
@ May 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist