చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

భావితరాల కోసమే విజన్‌

అమరావతిలో వే 2 న్యూస్‌ కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు

by చైతన్యరధం
Sep 13, 2025 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
భావితరాల కోసమే విజన్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • శరీరానికి పోషకాలలాగే సమాజానికి మంచి పాలసీలూ అవసరం
  • ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్‌ అభివృద్ధి అన్‌స్టాపబుల్‌
  • వచ్చే మూడేళ్లలో అమరావతి ఇన్‌ఫ్రా – 2027 డిసెంబర్‌కు పోలవరం పూర్తి
  • సాగునీటితో రాయలసీమలో కోస్తానుమించిన అభివృద్ధి
  • పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీలు -ఎవరికీ నష్టం జరగదు
  • టెక్నాలజీతో ఇంటెన్సివ్‌ కేర్‌ కాదు.. ఇంటిదగ్గరే హెల్త్‌ కేర్‌
  • అమరావతిలో వే 2 న్యూస్‌ కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి (చైతన్య రథం): రాష్ట్రాభివృద్ధికి విజన్‌ కల్పన చేయటంతోపాటు.. దాన్ని సుసాధ్యం చేసే దిశగా పనిచేయాల్సి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్‌ తరాల కోసమే విజన్‌ను రూపొందించి అమలు చేస్తున్నామని.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇది తన బాధ్యతని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో వికసిత్‌ భారత్‌-2047 అమలు చేస్తుంటే.. రాష్ట్రంలో స్వర్ణాంధ్ర-2047 విజన్‌ సిద్ధంచేసి అమలు చేస్తున్నామన్నారు. శరీరానికి పోషకాలు ఎంత అవసరమో సమాజానికి మంచి పాలసీల అవసరం అంతే ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. వచ్చే 22 ఏళ్లలో మన రాష్ట్రం ఎక్కడ ఉండాలన్న అంశాన్ని నిర్దేశించేందుకే విజన్‌ రూపొందించి అమలు చేస్తున్నట్టు చెప్పారు. అమరావతిలో శుక్రవారం వే 2 న్యూస్‌ కాంక్లేవ్‌కు హాజరైన ముఖ్యమంత్రి వేర్వేరు అంశాలపై అభిప్రాయాలను వ్యక్తీకరించారు. వచ్చే దశాబ్దకాలంలో ఏపీ ఎలా ఉండబోతోందన్న అంశాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ‘‘రాష్ట్రంలోని స్టేక్‌ హోల్డర్లను భాగస్వాములను చేస్తూ ఈ తరహా కాంక్లేవ్‌ నిర్వహించడం మంచి పరిణామం. 25 ఏళ్ల క్రితం భారతీయులకు సరైన గుర్తింపులేని సమయంలో తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అప్పటినుంచి భారతదేశం అభివృద్ధి అన్‌స్టాపబుల్‌గా మారింది. 2038నాటికి భారత దేశం నెంబర్‌-1 అవుతుంది. ఇందులో తెలుగువారి పాత్ర ప్రధానంగా ఉండాలని భావిస్తున్నాను. ఈ ఏడాది.. గతేడాది డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌ సాధించగలిగాం. 2028-29నాటికి రూ.29,29,402 కోట్ల మేర జీఎస్డీపీ సాధించగలం. 2029-2034నాటికి రూ. 57,21,610 కోట్ల జీఎస్డీపీ సాధించేలా ప్రణాళికలు రూపొందించాం. దీన్ని సాధించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది. 2028-29 నాటికి తలసరి ఆదాయాన్ని రూ.5,42,985 సాధిస్తాం. 2029-2034నాటికి తలసరి ఆదాయం రూ.10.55 లక్షలకు చేరుతుంది. ఇదేమీ అసాధ్యం కాదు. నిర్థిష్టమైన ఆలోచనతోనే ప్రణాళికలు వేశాం. దీనికి సంకల్పంతోపాటు మెగా డ్రీమ్స్‌ ఉండాలి. విజన్‌ 2020 సాకారం అయ్యాక కూడా విజన్‌ డాక్యుమెంట్లపై ఇంకా అనుమానాలు సరికాదు. భారత్‌లాంటి దేశాల్లో సంక్షేమం, అభివృద్ధి రెండిరటినీ సమాతరంగా అమలు చేయాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
‘‘సూపర్‌ సిక్స్‌ ద్వారా సంక్షేమం చేపట్టాం. అభివృద్ధికి అదే తరహాలో నిధులిస్తున్నాం. రాజకీయాలు అవసరమే కానీ… సమాజం గురించే ఆలోచించాలి. రాజకీయాలే ఆలోచించివుంటే హైదరాబాద్‌ అభివృద్ధి జరిగేది కాదు. విద్యుత్‌ సంస్కరణలు వచ్చేవి కావు. సీఎంగా భావితరాల కోసం ఆలోచన చేయాలి. 1994లో చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాను. ఇప్పుడు సంపద సృష్టిస్తున్నాం. పేదలకు అందిస్తున్నాం. ప్రజలందరికీ ప్రయోజనం కలిగేలా మంచి పబ్లిక్‌ పాలసీలు తీసుకువచ్చాం’’ అని ముఖ్యమంత్రి వివరించారు.

మూడేళ్లలో అమరావతి ఇన్‌ఫ్రా పనులు.. 2027 డిసెంబర్‌కు పోలవరం పూర్తి
ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశ అభివృద్ధి అన్‌స్టాపబుల్‌ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో సంక్షోభాలు వస్తున్నాయని.. నేపాల్‌, బంగ్లాదేశ్‌, ఫ్రాన్స్‌ ఇలా చాలా దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. సుస్థిరతకు, నాయకత్వానికి మారుపేరు భారతదేశమేనన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా సంస్కరణలు ప్రారంభించి అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించామన్నారు. దీనిపై మాట్లాడుతూ.. ‘‘విశాఖ, అమరావతి, విజయవాడ, తిరుపతివంటి నగరాల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నాం. సేవల రంగం ద్వారా ఎక్కువ గ్రోత్‌ సాధించేలా చర్యలు చేపడుతున్నాం. అమరావతిలో ప్రారంభించిన ప్రతి పనీ రాబోయే మూడేళ్లల్లో పూర్తవుతుంది. రూ.50 వేల కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు పూర్తవుతాయి. ప్రధాని చేతుల మీదుగా ఇవి ప్రారంభమవుతాయి. 2019లో గెలిచి ఉంటే 2021నాటికి పోలవరం పూర్తయ్యేది. గత ప్రభుత్వ నిర్వాకంవల్ల డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. అధికారంలోకి వచ్చాక పోలవరంపై దృష్టి పెట్టాం. 2027 డిసెంబరు నాటికి పోలవరం పూర్తి చేస్తాం. కియా ఫ్యాక్టరీ కోసం గొల్లపల్లి రిజర్వాయరును ఒక్క ఏడాదిలో పూర్తి చేసి నీరిచ్చాం. హంద్రీ-నీవా ప్రాజెక్టు కాల్వల విస్తరణ పనులు కేవలం 100 రోజుల్లో పూర్తి చేసి నీరు ఇచ్చాం.’’ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

వాత్సల్యమూర్తి భువనమ్మ

అమరావతి అభివృద్ధి అక్కడితో ఆగదు
‘‘అమరావతిలో మొత్తం ప్రైవేట్‌ భూములే. హైటెక్‌ సిటీ రాకముందు హైదరాబాద్‌లో ఎకరం రూ.లక్ష ఉండేది. ఇప్పుడు రూ.100 కోట్లకు చేరింది. పరిశ్రమలు, రహదారులలాంటి అభివృద్ధి జరిగితే భూమి విలువ పెరుగుతుంది. అమరావతి రైతుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు. అమరావతి అభివృద్ధి నిరంతరం. అభివృద్ధిని కొంత మేరకే పరిమితం చేస్తే… అమరావతి ఓ చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుంది. హైదరాబాద్‌ తరహాలో అమరావతి కూడా గుంటూరు-విజయవాడ-తెనాలి తదితర ప్రాంతాలు కలిసి మహానగరంగా రూపొందుతుంది. భూములిచ్చిన వారిని ఆదుకుంటాం. విస్తరణ విషయంలోనూ ఏమాత్రం ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు ఉండే భూమి ఇప్పటికే సరిపోతుంది. భవిష్యత్‌ అవసరాల మేరకు రైతులతో మాట్లాడి అమరావతిని అభివృద్ధి చేస్తాం. అమరావతిలో 2026 జనవరికి క్వాంటం వ్యాలీ అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్‌కు అవసరమైన అనుబంధ సంస్థలు పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. అలాగే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయి. మరికొన్ని రాబోతున్నాయి’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Previous Post

భూమి ఇస్తే..మెడికల్‌ కాలేజీ కట్టినట్టా?

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 13-09-2025

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

కార్యకర్త
@ March 21, 2026
నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ
ఆంధ్రప్రదేశ్

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం
ఆంధ్రప్రదేశ్

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!
ఆంధ్రప్రదేశ్

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక
ఆంధ్రప్రదేశ్

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026

కార్యకర్త
@ March 20, 2026
సం’క్షేమమే ధ్యేయంగా.. కొత్త ఏడాదిలో తొలి రోజున సీఎం తొలి సంతకం
ఆంధ్రప్రదేశ్

సం’క్షేమమే ధ్యేయంగా.. కొత్త ఏడాదిలో తొలి రోజున సీఎం తొలి సంతకం

చైతన్యరధం
@ March 20, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist