చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఫాస్ట్‌ ట్రాక్‌లో పారిశ్రామిక ప్రాజెక్టులు

సీఎం అధ్యక్షతన 10వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం

by చైతన్యరధం
Aug 29, 2025 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఫాస్ట్‌ ట్రాక్‌లో పారిశ్రామిక ప్రాజెక్టులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • గ్రౌండిరగ్‌ వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి
  • ఏరో స్పేస్‌, ఐటీ, ఇంధనం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎంఎస్‌ఎంఈ రంగాల్లో పెట్టుబడులు
  • రూ.53,922 కోట్లమేర పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం
  • ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు
  • నవంబర్‌ 15లోగా ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు
  • బిజినెస్‌ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఎకో సిస్టం
  • అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం
  • సీఎం అధ్యక్షతన 10వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం

అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామిక ప్రాజెక్టులు ఫాస్ట్‌ ట్రాక్‌లో పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానంలో త్వరగా అనుమతులిస్తున్నామని… అదే వేగంతో ప్రాజెక్టుల గ్రౌండిరగ్‌ జరిగేలా చూడాలని ఆదేశించారు. సచివాలయంలో గురువారం సీఎం అధ్యక్షతన 10వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశమైంది. రూ.53922 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే 30 ప్రాజెక్టులకు సీఎం ఆధ్వర్యంలోని ఎస్‌ఐపీబీ ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 83,437మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ఇకనుంచి ప్రతీ నెలా సమీక్షస్తానని సీఎం స్పష్టం చేశారు. ప్రాజెక్టుల స్థితిగతులపై క్షేత్రస్థాయిలో మంత్రులూ పరిశీలించాలన్నారు. ఇప్పటివరకూ అనుమతులిచ్చిన ప్రాజెక్టుల వివరాలను, ఉత్పత్తి ప్రారంభించేందుకు ఎంత సమయం పట్టిందన్న అంశాలను విశ్లేషించాలని సీఎం సూచించారు. ఏ ప్రాజెక్టు అయినా ఆలస్యమవుతుంటే సంబంధిత సంస్థల ప్రతినిధులతో మాట్లాడి పనులు వేగంగా పూర్తి చేసేలా చూడాలన్నారు. రాష్ట్రంలో స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని.. అధికారులు కూడా అదే వేగంతో పనిచేయాలని సూచించారు. మహింద్రా ఈవీ వాహనాల ఉత్పత్తి ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేసేలా తానే స్వయంగా సంప్రదిస్తున్నానని.. దీనికి అనుగుణంగా అధికారులూ స్పందించాలని సీఎం స్పష్టం చేశారు.

ఏపీలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలదే ప్రధాన భూమిక
వ్యవసాయాధారిత రాష్ట్రమైన ఏపీలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలే కీలకమని.. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడిరపుతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇవి ప్రధాన భూమిక పోషిస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హార్టీకల్చర్‌ హబ్‌గా రాయలసీమతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు పుష్కలంగా అవకాశాలున్నాయన్నారు. పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు అధికారులు ప్రముఖ కంపెనీలతో సంప్రదింపులు చేయాలని సీఎం సూచించారు. చిత్తూరు, అన్నమయ్య తదితర జిల్లాల్లో స్థానికంగా ఉన్న మ్యాంగో ప్రాసెసింగ్‌ పరిశ్రమల వల్లే రైతులకు ఎక్కువ ఇబ్బంది లేకుండా చూడగలిగామన్నారు. పొరుగున తమిళనాడు, కర్ణాటకలలో ఈ తరహా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు లేవని సీఎం చంద్రబాబు అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-06-2026

చైతన్యరధం ఈ పేపర్ 25-06-2026

మత్స్యకారులకు అండగా ఉంటాం

బిజినెస్‌ సెంటర్ల తరహాలో ఎంఎస్‌ఎంఈ పార్కులతో ఎకో సిస్టం
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభించిన ప్రాంతాల్లో వినా మిగతా నియోజకవర్గాల్లో 3 నెలల్లో ఈ పార్కులు అందుబాటులోకి రావాలన్నారు. ఈ పారిశ్రామిక పార్కులన్నీ బిజినెస్‌ సెంటర్లలా చేసి.. ఒక ఎకో సిస్టంను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతులు, భూ యజమానుల్ని కూడా ఈ పారిశ్రామిక పార్కుల్లో భాగస్వాములను చేయాలని సీఎం స్పష్టం చేశారు. తద్వారా వారికి ఆదాయం వచ్చేలా చేయాలన్నారు. అలాగే రాష్ట్రంలో మెగా, మీడియం స్థాయిలో పారిశ్రామిక పార్కులను నియోజకవర్గాల వారీగా మ్యాపింగ్‌ చేయాలని ఆదేశించారు. ఈ పారిశ్రామిక పార్కులకు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌లను అనుసంధానించటంతోపాటు వాటికి ప్రామాణిక మార్గదర్శకాలను నిర్దేశించాలన్నారు.

పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో ఆర్టీఐహెచ్‌ ద్వారా జరిగే కార్యకలాపాలను సమీక్షించాలని సీఎం సూచించారు. మరోవైపు రాష్ట్రంలోని ఆటోనగర్‌లలో రెడ్‌, ఆరెంజ్‌ కేటగిరీ పరిశ్రమలకు తదుపరి అనుమతులు రాకపోవటంపై సమీక్షించిన సీఎం.. దీనికి తగిన కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఏపీకి పరిశ్రమలు రావటం ముఖ్యమన్న సీఎం.. ఇంధన ఉత్పత్తి, ఐటీ, టూరిజం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, మైనింగ్‌ ఆధారిత వాల్యూ చైన్‌ పరిశ్రమల్లో పెట్టుబడులు రావాల్సి ఉందన్నారు. అలాగే ఐటీ రంగంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, కో-వర్కింగ్‌ స్పేస్‌లను ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు గత పాలకులు తిరుపతి వేంకటేశ్వరస్వామి ఏడుకొండల పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించారని.. కొండను ఆనుకుని హోటల్‌ నిర్మాణానికి స్థలం కేటాయించిందన్నారు. కూటమి అధికారంలోకి రాగానే భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయంగా స్థలం చూపామన్నారు. దీనిపై కొందరు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్‌, గొట్టిపాటి రవికుమార్‌, టీజీ భరత్‌, అనగాని సత్యప్రసాద్‌, వాసంశెట్టి సుభాష్‌, సీఎస్‌ కె విజయానంద్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

10వ ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదించిన ప్రాజెక్టులు
1. చిత్తూరు జిల్లాలో మదర్‌ డెయిరీ లిమిటెడ్‌. రూ.427 కోట్లు పెట్టుబడులు. 180మందికి ఉద్యోగావకాశాలు
2. చిత్తూరు జిల్లాలో ఏసీఈ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌. రూ.786 కోట్ల పెట్టుబడులు. 1000 మందికి ఉద్యోగావకాశాలు
3. చిత్తూరు జిల్లాలో అపోలో టైర్స్‌. రూ.1110 కోట్ల పెట్టుబుడులు. 500మందికి ఉద్యోగావకాశాలు.
4. తిరుపతిలో స్కై రూట్‌ ఎరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. రూ.400 కోట్ల పెట్టుబుడలు. 300మందికి ఉద్యోగావకాశాలు
5. మడకశిరలో హెచ్‌ఎఫ్‌సీఎల్‌. రూ.1197 కోట్ల పెట్టుబడులు. 870 మందికి ఉద్యోగావకాశాలు
6. అనకాపల్లిలో వరాహా ఆక్వా ఫార్మ్స్‌. రూ.32 కోట్ల పెట్టుబడులు. 3,500 మందికి ఉద్యోగావకాశాలు.
7. విశాఖపట్నంలో జె కుమార్‌ ఇన్‌ ఫ్రా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌. రూ.237 కోట్ల పెట్టుబడులు. 5000 మందికి ఉద్యోగావకాశాలు.
8. చిత్తూరులో అలీప్‌ సంస్థ. రూ.45 కోట్ల పెట్టుబడులు. 2,500 మందికి ఉద్యోగావకాశాలు.
9. నెల్లూరులో ఇఫ్కో కిసాన్‌ సెజ్‌. రూ.870 కోట్ల పెట్టుబడులు. 25,000 మందికి ఉద్యోగావకాశాలు.
10. కృష్ణపట్నం ధీరూభాయ్‌ అంబానీ గ్రీన్‌ టెక్‌ పార్క్‌. రూ.1843 కోట్ల పెట్టుబడులు. 19వేల ఉద్యోగావకాశాలు.
11. భోగాపురం ఎన్‌ కామ్‌ వైజాగ్‌ హోటల్‌. రూ.178 కోట్ల పెట్టుబడులు. 250 మందికి ఉద్యోగావకాశాలు.
12. అమరావతిలో మంజీరా హాస్పిటాలిటీ. రూ.276 కోట్ల పెట్టుబడులు. 225 మందికి ఉద్యోగావకాశాలు.
13. మంత్రాలయంలో శ్రీ వెంకటేశ్వర లాడ్జి. రూ.96 కోట్ల పెట్టుబడులు. 300 మందికి ఉద్యోగావకాశాలు.
14. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో సోలార్‌ ఎనర్జీ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ). రూ.1500 కోట్ల పెట్టుబడులు. 950 మందికి ఉద్యోగావకాశాలు.
15. సత్యసాయి జిల్లా రామగిరి, ముత్తవకుంట్లలో సోలార్‌ ఎనర్జీ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా. రూ.800 కోట్ల పెట్టుబడుల. 200 మందికి ఉద్యోగావకాశాలు.
16. అనంతపురంలో సెరెంటికా రెన్యూవబుల్స్‌ ఆఫ్‌ ఇండియా. రూ.2000 కోట్లు పెట్టుబడులు. 320మందికి ఉద్యోగావకాశాలు.
17. కర్నూలులో సెరెంటికా రెన్యూవబుల్స్‌ ఆఫ్‌ ఇండియా. రూ.2,400 కోట్ల పెట్టుబడులు. 380మందికి ఉద్యోగావకాశాలు.
18. కడపలో హెక్సా ఎనర్జీ బీహెచ్‌ ఫైవ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. రూ.1,200 కోట్ల పెట్టుబడులు. 400 మందికి ఉద్యోగావకాశాలు.
19. శ్రీ సత్యసాయి జిల్లాలో రెఫెక్స్‌ సోలార్‌ ఎస్పీవీ ఫైవ్‌ లిమిటెడ్‌. రూ.480 కోట్ల పెట్టుబడులు. 345 మందికి ఉద్యోగావకాశాలు.
20. అనంతపురంలో బ్రైట్‌ ఫ్యూచర్‌ పవర్‌ లిమిటెడ్‌. రూ.3,286 కోట్ల పెట్టుబడులు. 440మందికి ఉద్యోగావకాశాలు.
21. పాడేరులో నవయుగ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌. రూ.15,455 కోట్ల పెట్టుబడులు. 8,400 మందికి ఉద్యోగావకాశాలు.
22. కడపలో చింతా గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌. రూ.15,050 కోట్ల పెట్టుబడులు. 8,400మందికి ఉద్యోగావకాశాలు.
23. నాయుడుపేటలో సిర్మా ఎస్జీఎస్‌ టెక్నాలజీ. రూ.1595 కోట్ల పెట్టుబడులు. 2,170మందికి ఉద్యోగావకాశాలు.
24. కుప్పంలో హిందాల్‌ కో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌. రూ.586 కోట్ల పెట్టుబడులు. 613మందికి ఉద్యోగావకాశాలు.
25. అనకాపల్లిలో బాలాజీ యాక్షన్‌ బిల్డ్‌ వెల్‌. రూ.485 కోట్ల పెట్టుబడులు. 500 మందికి ఉద్యోగావకాశాలు.
26 నెల్లూరు జిల్లా అదాని విల్మర్‌ లిమిటెడ్‌. రూ.578 కోట్ల పెట్టుబడి. 285మందికి ఉద్యోగావకాశాలు.
27. చిత్తూరులో టైరోమెర్‌ టెక్నాలజీ లిమిటెడ్‌. రూ.85 కోట్లు పెట్టుబడులు. 120మందికి ఉద్యోగావకాశాలు.
28. కడప జిల్లాలో ర్యామ్‌ శీ బయో ప్రైవేట్‌ లిమిటెడ్‌. రూ.356 కోట్ల పెట్టుబడులు. 600 మందికి ఉద్యోగావకాశాలు.
29. కోనసీమ శ్రీ సర్వారాయా షుగర్స్‌ లిమిటెడ్‌. రూ.161 కోట్ల పెట్టుబడులు. 189మందికి ఉద్యోగావకాశాలు.
30. కాకినాడ పట్టాభి ఆగ్రోఫుడ్స్‌. రూ.408 కోట్ల పెట్టుబడులు. 500 మందికి ఉద్యోగావకాశాలు.

Previous Post

ఉల్లి రైతుకు మేలు!

Next Post

దివ్యాంగులకు ఒక్క రూపాయి కూడా పింఛన్‌ పెంచని జగన్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-06-2026

కార్యకర్త
@ June 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-06-2026

కార్యకర్త
@ June 25, 2026
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారులకు అండగా ఉంటాం

చైతన్యరధం
@ June 25, 2026
జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!
ఆంధ్రప్రదేశ్

జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

చైతన్యరధం
@ June 25, 2026
కార్తకర్తే.. అధినేత!
ఆంధ్రప్రదేశ్

కార్తకర్తే.. అధినేత!

చైతన్యరధం
@ June 25, 2026
ఇక విద్యా విప్లవం!
ఆంధ్రప్రదేశ్

ఇక విద్యా విప్లవం!

చైతన్యరధం
@ June 25, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-06-2026

కార్యకర్త
@ June 24, 2026
రాయలసీమలో ‘పసిడి’ పంట స్వర్ణగిరిగా… ఇక జొన్నగిరి
ఆంధ్రప్రదేశ్

రాయలసీమలో ‘పసిడి’ పంట స్వర్ణగిరిగా… ఇక జొన్నగిరి

చైతన్యరధం
@ June 24, 2026
Load More

ముఖ్య వార్తలు

జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

చైతన్యరధం
@ June 25, 2026
ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!

ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!

చైతన్యరధం
@ June 22, 2026
అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

చైతన్యరధం
@ June 21, 2026

రైతుకు ప్రజాప్రభుత్వం అభయం 

చైతన్యరధం
@ June 21, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మత్స్యకారులకు అండగా ఉంటాం

చైతన్యరధం
@ June 25, 2026
జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

చైతన్యరధం
@ June 25, 2026
కార్తకర్తే.. అధినేత!

కార్తకర్తే.. అధినేత!

చైతన్యరధం
@ June 25, 2026
ఇక విద్యా విప్లవం!

ఇక విద్యా విప్లవం!

చైతన్యరధం
@ June 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist