చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అభివృద్ధికి ఆకాశ బాట

భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణంపై రివ్యూ

by చైతన్యరధం
Jan 4, 2025 at 6:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అభివృద్ధికి ఆకాశ బాట
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పోర్టులు, ఎయిర్‌ పోర్టులే ప్రగతికి మార్గాలు
  • కొత్త ఎయిర్‌ పోర్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • గన్నవరం ఎయిర్‌ పోర్టు విస్తరణకు నమూనాల పరిశీలన
  • భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణంపై రివ్యూ

అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో కొత్తగా 7 ఎయిర్‌ పోర్టులు రానున్నాయి. వీటిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ఆ ప్రాజెక్టులను గ్రౌండ్‌ చేసే పనులు మొదలు పెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 7 ఎయిర్‌ పోర్టులు ఉన్నాయి. విశాఖ, తిరుపతి, కడప, రాజమండ్రి, గన్నవరం ఎయిర్‌ పోర్టులను ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్వహిస్తోంది. కర్నూల్‌ ఎయిర్‌ పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుండగా…. పుట్టపర్తి ప్రైవేటు ఎయిర్‌ స్ట్రిప్‌గా ఉంది. వీటికితోడు భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ సిద్ధమవుతోంది. అయితే పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో కొత్తగా మరో 7 ఎయిర్‌ పోర్టులను తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కొన్ని ప్రాజెక్టులకు అడుగులు వేయగా… తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని పక్కనపెట్టింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ వాటిని పట్టాలెక్కించేందుకు, భవిష్యత్‌ అవసరాలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎయిర్‌ పోర్టుల విస్తరణ, నిర్మాణంతోపాటు, కొత్త ఎయిర్‌ పోర్టుల నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం సమీక్షించారు. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు సహా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు.

ప్రభుత్వం కొత్తగా కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్‌, తుని- అన్నవరం, ఒంగోలులో కొత్తగా ఎయిర్‌ పోర్టులు ఏర్పాటు చేయనుంది. కుప్పం ఎయిర్‌ పోర్ట్‌ కోసం ఫీజిబులిటీ రిపోర్ట్‌ సిద్ధం చేశారు. రెండుదశల్లో ఈ ఎయిర్‌ పోర్టు నిర్మాణం జరగనుంది. మొదటి దశలో 683 ఎకరాలు, 2వ దశలో 567 ఎకరాలు కలిపి మొత్తం 1,250 ఎకరాలు ఇప్పటికే గుర్తించారు. అయితే దీనికి సమీపంలో ఐఏఎఫ్‌, హెచ్‌ఏఎల్‌, బెంగుళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టులున్న కారణంగా… ఎయిర్‌ స్పేస్‌ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించారు. ఈ కారణంగా దీనికి సంబంధిత వర్గాలనుంచి ఎన్‌వోసి తీసుకోవాల్సి ఉంది.
శ్రీకాకుళం ఎయిర్‌పోర్టు విషయానికి వస్తే ఫీజిబులిటీ సర్వే పూర్తైంది. రెండు ఫేజుల్లో 1,383 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే భూసేకరణ ప్రారంభమైంది. ఫేజ్‌ 1లో 680, ఫేజ్‌ 2లో 536 ఎకరాల్లో దీన్ని చేపట్టనున్నారు.
దగదర్తి ఎయిర్‌ పోర్టు నిర్మాణం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే నిర్ణయించారు. 1379 ఎకరాల్లో నిర్మించాలని నాడు నిర్ణయించగా… అందులో 635 ఎకరాల భూసేకరణ టీడీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. మరో 745 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ ఎయిర్‌పోర్టుకు అన్ని అనుమతులున్నాయి. ఈ ప్రాంతంలో బీపీసీఎల్‌ రిఫైనరీ వస్తోంది. వీటికితోడు ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది కార్గోకు, ఇండస్ట్రీకి ఉపయోగపడేలా మంచి ఎయిర్‌పోర్టు అవుతుంది. అదే విధంగా శ్రీ సిటీ సెజ్‌లో ఎయిర్‌ స్ట్రిప్ట్‌ తెచ్చే అంశాన్నీ పరిశీలించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఒంగోలు ఎయిర్‌ పోర్ట్‌ కోసం 657 ఎకరాలు గుర్తించారు. దీనిపై ఫీజిబులిటీ స్టడీ చేయాల్సి ఉంది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

రూ.119 కోట్లతో టీసీసీ!

పల్నాడు జిల్లా పరిధిలో నాగార్జునసాగర్‌ వద్ద 1670 ఎకరాల్లో ఎయిర్‌ పోర్టు ఏర్పాటు చేయనున్నారు. దీనిలో 500 ఎకరాలు సేకరించాల్సి ఉంది. దీనికి ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ కావాలి. తాడేపల్లిగూడెం ఎయిర్‌ పోర్టు 1123 ఎకరాల్లో చేపట్టాలని నిర్ణయించారు. అయితే దీని సమీపంలో అటు రాజమండ్రి, ఇటు గన్నవరం ఎయిర్‌ పోర్టులున్నాయి. దీంతో ఇక్కడ ఎయిర్‌ పోర్టు ఫీజిబులిటీని పరిశీస్తున్నారు. ఇకపోతే తుని- అన్నవరం మధ్య 757 ఎకరాల్లో ఎయిర్‌ పోర్టు తేలవాలని ప్రతిపాదించారు. అయితే ఈ ప్రాంతంలో రైల్వే లైన్‌, హైవే, వాటర్‌ బాడీ ఉందని అధికారులు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో కొత్త పరిశ్రమలు వస్తున్నాయని, నక్కపల్లిలో స్టీల్‌ ప్లాంట్‌, సిటీలు వస్తున్నాయని… ఆ ప్రాంతంలో ఎయిర్‌ పోర్టు అవసరం ఉందని సీఎం అన్నారు. అనకాపల్లి, కాకినాడ, విశాఖలకు దగ్గరలో ఈ ఎయిర్‌ పోర్టు వచ్చేలా చూడాలని సీఎం సూచించారు. అదే విధంగా… తాడిపత్రి ప్రాంతంలో ఒక ఎయిర్‌ పోర్టుకు అవకాశం ఉందని… దాన్నీ పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ పనులపై అధికారులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. టెర్మినల్‌ పనుల్లో నూతన డిజైన్లను అధికారులు సీఎం వద్ద ప్రదర్శించారు. కూచిపూడి నృత్యం, అమరావతి స్థూపాలు థీమ్‌గా ఎయిర్‌ పోర్టు డిజైన్లు సిద్ధం చేశారు. ఈ పనులను 6 నెలల్లో పూర్తిచేసి జూన్‌నాటికి అందుబాటులోకి తేవాలని సీఎం సూచించారు. అదేవిధంగా భోగాపురం ఎయిర్‌ పోర్టు పనుల పురోగతిని కూడా అధికారులు వివరించారు. రాష్ట్రంలో ఎయిర్‌ పోర్టులతోపాటు ఏవియేషన్‌ యూనివర్సిటీ, ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో ఎయిర్‌ పోర్టుల్లో ప్రైవేటు ఫ్లైట్స్‌ పార్కింగ్‌ అవసరాలు పెరుగుతాయని… వాటనీ దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని సీఎం సూచించారు.

Previous Post

ఎక్కడున్నా.. తెలుగుజాతి ఒక్కటే

Next Post

నదుల అనుసంధానంతో నవశకానికి నాంది!

మరిన్ని వార్తలు

చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-03-2026

కార్యకర్త
@ March 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

కార్యకర్త
@ March 14, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం
ఆంధ్రప్రదేశ్

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌రంగ వెలుగులకు ఇదే సాక్ష్యం

చైతన్యరధం
@ March 14, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

హెచ్‌సీలకు ప్రత్యేక పదోన్నతులు

చైతన్యరధం
@ March 14, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist