చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home చైతన్యరధం

ఇంకానా.. జగన్నాటకాలు!?

by చైతన్యరధం
Sep 14, 2024 at 6:15am
in చైతన్యరధం, సంపాదకుని ఎంపిక
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఐదేళ్లు ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు చేసిందేమీ లేదు. ప్రతిపక్షంలోనైనా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారా? అంటే అదీ లేదు. మెడికల్‌ కాలేజీల వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం మీద అబద్ధాల సాక్షిలో విషం చిమ్మడం వినా జగన్‌రెడ్డికి మరో పనిలేకుండా పోయిందన్నది కళ్లముందు కనిపిస్తున్న వాస్తవం. గడచిన ఐదేళ్లలో వైద్యరంగాన్ని సర్వనాశనం చేసింది జగన్‌రెడ్డే. సమాజానికి అత్యంత ప్రాధాన్యమైన వైద్య విద్య ప్రమాణాలను నాశిరకానికి దిగజార్చిన చరిత్ర అతనిది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్‌ కాలేజీలు తెచ్చానంటూ అరచేతిలో వైకుంఠం చూపించి.. వాటి నిర్మాణాలను గాలికొదిలేశాడు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ మోసపూరిత మాటలు చెబుతూ ఆచరణలో వారందరికీ వైద్య విద్యను దూరం చేశాడు. కొత్త మెడికల్‌ కాలేజీలు వస్తే డాక్టర్‌ కల నెరవేరుతుందనుకున్న బడుగు, బలహీనవర్గాల ఆశలను చిదిమేశాడు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సర్కారీ కాలేజీల్లో మెడికల్‌ సీట్లను అమ్మకానికి పెట్టి ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీలకు తేడా లేకుండా చేసిన ఘనతా జగన్‌రెడ్డే దక్కించుకున్నాడు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్లను కన్వీనర్‌ కోటాలోనే ఇన్నాళ్లూ భర్తీ చేస్తూ వచ్చారు. మెరిట్‌ ఆధారంగానే విద్యార్థులు ఆయా కాలేజీల్లో సీట్లు పొందేవారు. కానీ జగన్‌రెడ్డి ధనదాహంతో పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేశాడు. వైద్య విద్యను అంగట్లో సరుకులా అమ్ముకున్నాడు. చేసిందంతా చేసి ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వంపై నెపం నెట్టడం జగన్‌ భ్రష్ట రాజకీయానికి పరాకాష్ట. జగన్‌రెడ్డి నాశనం చేసిన విద్యారంగాన్ని, మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే.. అబద్ధపు ప్రచారాలు, బూటకపు మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేయడం జగన్‌రెడ్డికి బడుగుల వైద్య విద్యపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే ఏపీకి రెండు మెడకిల్‌ కాలేజీలను కేంద్రం మంజూరు చేసిన విషయం జగన్‌రెడ్డికి కనిపించడంలేదా?
రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వ ప్రైవేటు భాస్వామ్యంలో నిర్వహించేందుకు గుజరాత్‌ మోడల్‌ను అధ్యయనం చేయమని కేబినెట్‌ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచిస్తే.. అదేదో నేరమన్నట్టు జగన్మోహన్‌రెడ్డి హడావుడి చేస్తున్నాడు. అలాగే తాను ఐదు మెడికల్‌ కాలేజీలు తెచ్చానని, చంద్రబాబు మాత్రం మరో ఐదు మెడికల్‌ కాలేజీలు ప్రారంభం కాకుండా అడ్డుపడుతున్నారని, ప్రయివేట్‌కు కట్టబెట్టేందుకు సిద్ధపడ్డారని సాక్షిలో తప్పుడు వార్తలు వండుతున్నారు. 2023-24లో అనుమతి పొందిన విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్లకు అయిష్టంగానే ఓకే చెప్పిన జాతీయ వైద్యమండలి.. ఈసారి ప్రవేశాలను తిరస్కరించింది. పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల్లో కళాశాలల నిర్మాణాలను పరిశీలించిన బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. మెడికల్‌ కాలేజీలు తెచ్చేస్తున్నామంటూ జగన్‌రెడ్డి ప్రచారార్భాటమైతే చేశారు కానీ కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. వైద్య సిబ్బంది నియామకాలపై దృష్టి పెట్టలేదు. కాంట్రాక్టర్లకు రూ.200 కోట్లకు పైగా బకాయిలు పెట్టడంతో వారు మధ్యలోనే నిర్మాణాలు వదిలి వెళ్లిపోయారు. ఈ వైఫల్యాలు బయటపడకుండా ఎన్డీయే ప్రభుత్వంపై ఎదురు నెపం నెట్టేందుకు యత్నించడం జగన్‌రెడ్డి కుటిల రాజకీయాన్ని తేటతెల్లం చేస్తోంది.
వైద్య విద్యకు పట్టంగట్టిన ఎన్టీఆర్‌, చంద్రబాబు
అన్న ఎన్టీఆర్‌ రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే ఉద్దేశంతో 1986లో విజయవాడకు హెల్త్‌ యూనివర్సిటీ తెచ్చారు. అలాగే అమెరికా నుంచి ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావును స్వదేశానికి రప్పించి హైదరాబాద్‌ నిమ్స్‌కు డైరెక్టర్‌ను చేసి ఆ ఆస్పత్రిని తీర్చిదిద్దారు. జిల్లాకో మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది చంద్రబాబు. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 22 మెడికల్‌ కాలేజీలతోపాటు కేంద్రంతో మాట్లాడి మంగళిగిరిలో ఎయిమ్స్‌, తిరుపతిలో బర్డ్‌ ఆస్పత్రి, టాటా క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ తెచ్చిన ఘనత చంద్రన్నదే. 2015లో కేంద్రంనుంచి చంద్రబాబు ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చి మంగళగిరిలో 197 ఎకరాల భూమి కేటాయించారు. చంద్రబాబు ముందుచూపుతో తీసుకొచ్చిన ఎయిమ్స్‌కు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి రోగులు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. కానీ జగన్‌రెడ్డి అదే ఎయిమ్స్‌కు గుక్కెడు నీరివ్వకపోగా, ఆస్పత్రి రహదారి నిర్మాణం పూర్తికాకుండా ఆటంకాలు సృష్టించాడు. ఇప్పుడేమో మెడికల్‌ కాలేజీలు ప్రైవేటుపరమంటూ దుష్ప్రచారం చేస్తున్నాడు. జగన్‌రెడ్డి భ్రష్టుపట్టించిన వైద్యరంగాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఓవైపు పేదలకు మెరుగైన ఉచితవైద్యాన్ని అందిస్తూ మరోవైపు బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు డాక్టర్‌ కల నిజం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండటం అభినందనీయం.
`భారతి సూరపనేని

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-05-2026

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

నాబార్డు క్రెడిట్ ప్లాన్ 

Previous Post

దళితుల్లో కుల చిచ్చుకు జగన్‌రెడ్డి భారీ కుట్ర!

Next Post

పంఎస్‌ఎంఈలకు కొత్తఊపిరి!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-05-2026

కార్యకర్త
@ May 6, 2026
రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

చైతన్యరధం
@ May 6, 2026
నాబార్డు క్రెడిట్ ప్లాన్ 
ఆంధ్రప్రదేశ్

నాబార్డు క్రెడిట్ ప్లాన్ 

చైతన్యరధం
@ May 6, 2026
ప్రజా హృదయాలు గెలవండి.. మళ్లీ మళ్లీ మనల్ని గెలిపిస్తారు!
ఆంధ్రప్రదేశ్

ప్రజా హృదయాలు గెలవండి.. మళ్లీ మళ్లీ మనల్ని గెలిపిస్తారు!

చైతన్యరధం
@ May 6, 2026
రాష్ట్రంలో పెట్టుబడుల స్వర్ణయుగం
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో పెట్టుబడుల స్వర్ణయుగం

చైతన్యరధం
@ May 6, 2026
చైతన్యరధం ఈ పేపర్ 05-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-05-2026

కార్యకర్త
@ May 5, 2026
తాగునీటికి జిల్లాకు రూ.కోటి
ఆంధ్రప్రదేశ్

తాగునీటికి జిల్లాకు రూ.కోటి

చైతన్యరధం
@ May 5, 2026
టీచర్ల.. సింగపూర్ బాట!
ఆంధ్రప్రదేశ్

టీచర్ల.. సింగపూర్ బాట!

చైతన్యరధం
@ May 5, 2026
Load More

ముఖ్య వార్తలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

చైతన్యరధం
@ May 6, 2026
కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

చైతన్యరధం
@ May 6, 2026
నాబార్డు క్రెడిట్ ప్లాన్ 

నాబార్డు క్రెడిట్ ప్లాన్ 

చైతన్యరధం
@ May 6, 2026
ప్రజా హృదయాలు గెలవండి.. మళ్లీ మళ్లీ మనల్ని గెలిపిస్తారు!

ప్రజా హృదయాలు గెలవండి.. మళ్లీ మళ్లీ మనల్ని గెలిపిస్తారు!

చైతన్యరధం
@ May 6, 2026
రాష్ట్రంలో పెట్టుబడుల స్వర్ణయుగం

రాష్ట్రంలో పెట్టుబడుల స్వర్ణయుగం

చైతన్యరధం
@ May 6, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist