- క్రీడాకారులు, నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తాం
- వరల్డ్ క్లాస్ బెస్ట్ మెకానిజం తయారు చేద్దాం
- స్పోర్ట్స్ హబ్‌గా రాయలసీమ హామీకి కట్టుబడి ఉన్నాం
- జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారుల భేటీలో లోకేష్
- అండగా నిలిచిన లోకేష్‌కు కతజ్ఞతలు
- స్కూలు నుంచే క్రీడల్లో శిక్షణ అవసరం
- వేసవిలో శిబిరాలను నిర్వహించండి
- స్థానికంగా చిన్న స్టేడియాలను అభివృద్ధి చేయండి
- క్రీడాకారులకు స్పెషల్ కరిక్యులమ్ పరిశీలించండి
- లోకేష్‌తో ముఖాముఖిలో క్రీడాకారుల మనోగతం
తిరుపతి(చైతన్యరథం): రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై తిరుపతి స్పోర్ట్స్ స్టేడియం లో జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తం గా 3,132 కి.మీల మేర యువగళం పాదయాత్ర చేపట్టినపుడు యువత ఆశలు, ఆకాంక్షలు తెలిశాయి. రాయలసీమను స్పోర్ట్స్ హబ్‌గా చేస్తానని ఇచ్చిన హామీ త్వరలో కార్యరూపం దాల్చనుంది. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఏం చేయాలనే విషయమై గతంలో భారత మహిళా క్రికెట్ జట్టుతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నానని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీ లో స్పోర్ట్స్ కోటా కింద 421 మందికి పైగా ఉద్యోగాలు సాధిం చారని తెలిపారు. స్పోర్ట్స్ కోటా నుంచి వచ్చిన ఉపాధ్యాయుల ప్రతిభను క్రీడారంగ అభివృద్ధికి ఉపయోగించుకుంటామని తెలిపారు.
చంద్రబాబు హయాంలోనే స్పోర్ట్స్ విలేజ్
చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్‌లో స్పోర్ట్స్ విలేజ్ ఏర్పా టైంది. అక్కడ నుంచే జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులు వచ్చారు. 90 రోజుల యాక్షన్ ప్లాన్‌లో రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి వరల్డ్ క్లాస్ బెస్ట్ మెకానిజం తయారుచేద్దామని పిలుపునిచ్చారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకెళుతున్నామని తెలిపారు. తిరుపతిలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో శాప్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన క్రికెట్ మైదానం చాలా బాగుందని ప్రశంసిస్తూ దీని నిర్వహణకు కార్పొరే ట్ కంపెనీల సహకారం తీసుకుంటామని తెలిపారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొని తమ ప్రతిభతో రాణిస్తోన్న జ్యోతి యర్రాజీ, శ్రీచరణి వంటి మహిళా క్రీడాకారిణులకు చేయూత నందిస్తామని తెలిపారు.
ఫిట్‌నెస్ మెరుగుపరిచే చర్యలు చేపడతాం
రాష్ట్రంలోని బాలలకు ఫిట్‌నెస్ లేకపోవడం క్రీడల్లో వెనుకబా టుకు ప్రధాన కారణంగా గుర్తించాం. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వ చర్యలతో పాటు తల్లిదండ్రుల సహకారం అవసరం. వ్యక్తిగతంగా కాకుండా వ్యవస్థీకృతంగా క్రీడాభివృద్ధికి కృషి చేసాం. విశాఖ, విజయవాడ, తిరుపతి గ్రోత్ కారిడార్ల పరిధిలో క్రీడారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు తయారుచేస్తున్నామని వెల్లడించా రు. క్రీడాకారులకు ఉద్యోగాల భర్తీలో న్యాయం జరిగేలా పారదర్శ కత పాటిస్తున్నామని తెలిపారు. క్రీడాకారులు అభిప్రాయాలను డాక్యుమెంటేషన్ చేసి 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ భేటీలో అంతర్జాతీయ మహి ళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, షట్లర్ పివి సింధు, అర్జున అవార్డు గ్రహీత కరణం మల్లీశ్వరి, అథ్లెట్ యర్రాజీ జ్యోతి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ నమ్మాళ్వార్, ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి (బ్లైండ్ క్రికెట్), పంగి కరుణ కుమారి (బ్లైండ్ క్రికెట్), ముసునూరి రోహిత్ లలిత్‌బాబు (చెస్), షేక్ అర్షద్ (పారా సైక్లింగ్), కిల్లాక లలిత (పారా అథ్లెటిక్స్), తమిరి సూర్య చరిష్మ (బ్యాడ్మింటన్), తిరుమూరి గణేష్ మణిరత్నం (ఆర్చరీ), దండు పూజ (బ్యాడ్మింటన్), పి.శివారెడ్డి (ఖోఖో), ఇ.రజని (హాకీ), నవ్య కండేరి (బ్యాడ్మింటన్), కె.ద్వారకనాథ్‌రెడ్డి (బాస్కెట్ బాల్), శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పాల్గొన్నారు.
















