నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా కోవూరు బైపాస్ సాయిబాబా గుడి వద్ద ఏర్పాటుచేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు.
నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా కోవూరు బైపాస్ సాయిబాబా గుడి వద్ద ఏర్పాటుచేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు కోవూరు పట్టణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం కోవూరు పట్టణం నుంచి బైపాస్ వరకు మంత్రి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు, మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్, జోనల్ కోఆర్డినేటర్ మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు.