అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం హులికెర గ్రామం వద్ద సుజ్లాన్ 1,325 మెగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం శంకుస్థాపన చేశారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం హులికెర గ్రామం వద్ద సుజ్లాన్ 1,325 మెగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం శంకుస్థాపన చేశారు. రాయదుర్గం, ఉరవకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో రూ.10వేల కోట్ల పెట్టుబడితో సుజ్లాన్ సంస్థ ఏర్పాటుచేయనున్న పవన విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 4వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.