- విజేతలకు ‘ఎక్స్’ వేదికగా అభినందనలు
అమరావతి (చైతన్యరథం): ‘మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గెలుపు గా మాత్రమే కాకుండా మాపై ఉంచిన మరింత పెద్ద బాధ్యతగా భావిస్తున్నాం. రెండున్నరేళ్లుగా ప్రజా ప్రభుత్వం సుపరిపాలనకు ప్రజలు అందించిన ఆశీర్వాదంగా ఈ తీర్పును స్వీకరిస్తున్నాం. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగు దేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమష్టిగా చేసిన కృషికి ప్రత్యేక ధన్యవాదాలు. మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఇక అందరి దృష్టి ప్రజా సేవ పైనే ఉండాలి. గెలిచిన ప్రతి
ప్రజాప్రతినిధి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.
రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సేవలందించాలి. ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే మన
ముందున్న అసలైన బాధ్యత. ఈ తీర్పు మరింత వినయంతో, మరింత బాధ్యతతో పని చేయాలనే సంకల్పాన్ని ఇచ్చింది.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత అంకితభావంతో పనిచేస్తాం. ప్రజా సేవ, రాష్ట్ర ప్రగతి ప్రజా ప్రభుత్వం
ప్రథమ ప్రాధాన్యం.’ అని మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయం వేళ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’
వేదికగా స్పందించారు.


















