అమరావతి(చైతన్యరథం): ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడనుంది. వాణిజ్య ప్రగతికి సరికొత్త రహదారి పడనుంది. విశాఖపట్నం నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ కేవలం ఆరేడు గంటల్లో చేరుకునేలా చేపట్టిన ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఏపీ మీదుగా వెళ్లే మరో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే పనులు ముగింపు దశకు వచ్చాయి.. ఉత్తరాంధ్రలో కీలకమైన ఈ హైవేకు సంబంధించి విజయనగరం జిల్లా జామి దగ్గర ఇంటర్ ఛేంజ్ కూడా పూర్తి చేశారు. జామి దగ్గర ఈ ఇంటర్ ఛేంజ్ చూడటానికి అందంగా కనిపిస్తోంది. ఈ ఇంటర్ ఛేంజ్ చుట్టూ పచ్చని పొలాలు మధ్యలో నల్లగా చూడటానికి సుందరంగా కనిపి స్తోంది. డ్రోన్ వ్యూలో ఈ ప్రదేశం పర్యాటకులను ఆకర్షిస్తోంది. అలాగే ఈ ఎక్స్‌ప్రెస్ వే పనులు ముగింపు దశగా రాగా త్వరలోనే వాహనాలను అనుమ తించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాయ పూర్ వెళ్లాలంటే విశాఖ పట్నం నుంచి సాలూరు, కోరాపుట్, జైపూర్ మీదుగా వెళ్లాలి. లేదంటే బొబ్బిలి, పార్వతీ పురం, రాయ గడ వైపు నుంచి వెళ్లొచ్చు.
ఈ రెండు దారుల్లోనూ ప్రయాణానికి సుమారు 13 గంటలు పడుతుంది. ఈ కొత్త దారి నిర్మాణంతో కేవలం 6 నుంచి 7 గంటల్లోనే గమ్యస్థానం చేరుకునే అవకాశ ముంది. ఈ ఇంట ర్‌ఛేంజ్ ద్వారా ప్రయాణికులు విజయనగరం, శృంగవరపు కోటకు చేరుకోవచ్చు. ఈ ప్రాంతాల నుంచి ఎక్స్‌ప్రెస్ వేపైకి కూడా ప్రవేశించవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో నేషనల్ హైవేలపై ఫోకస్ పెట్టింది. అలాగే అమరావతికి నేషనల్ హైవేలను కనెక్ట్ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఉత్తరాంధ్రలో కీలకమైన విశాఖపట్నం-రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ పనులు ముగింపు దశకు వస్తు న్నాయి. ఈ నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేపైకి చేరాలన్నా, రెండు వైపులకు వెళ్లాలన్నా ఈ ఇంటర్ ఛేంజే చాలా కీలకం. ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని గంట్యాడ, జామి, ఎస్.కోట మండలాల రాకపోకలకు ఉద్దేశించిన ఈ రింగ్ రోడ్డుతో ప్రస్తుతం ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి. ఛత్తీస్ గఢ్‌లోని రాయపూర్ నుంచి విశాఖపట్నం వరకు 6 వరుసలుగా ఈ హైవేను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ హైవేతో ఉత్త రాంధ్రలోని జిల్లాలకు కొత్త కళ వచ్చింది.
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొర్లాం నుంచి కొత్తవలస మండలం కంట కాపల్లి వరకు చేపట్టిన ఈ హైవే పనులు పూర్తి చేసినట్లు అధికా రులు తెలిపారు. త్వరలోనే మిగిలిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ హైవే పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య త్వరలో రవాణా సులువు కానుంది. విశాఖ – రాయపూర్ మధ్య ఆరు వరుసల రహదారి నిర్మాణం కూడా పూర్తవుతోంది.. ఈ హైవే కోసం కేంద్రం రూ.20 వేల కోట్ల నిధులను ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి తెచ్చింది. ఈ హైవే పూర్తయితే విశాఖపట్నం రాయపూర్ మధ్య దూరం తగ్గుతుందని చెబుతు న్నారు. దీనిని విశాఖ`రాయపూర్ ఎకనామిక్ కారిడార్ ఎక్స్‌ప్రెస్ హైవేగా పిలుస్తారు. ఏపీలో 100 కి.మీ మేర ఈ రహదారిని నాలుగు ప్యాకేజీలుగా విభజించి పనులు చేస్తుండగా 70 శాతం పూర్తయ్యాయి. విశాఖ నుంచి రాయపూర్‌కు మొత్తం 464 కి.మీ ఆరులైన గ్రీన్‌ఫీల్డ్ హైవే ఉంటుంది. దీనివల్ల ఉత్తరాంధ్రకు పలు ప్రయోజనాలు కలగ నున్నాయి. విశాఖ పోర్టుకు కనెక్టివిటీ పెరుగుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు రానున్నాయి.














