- రంగంలోకి దిగిన నాయకులు
- స్థల పరిశీలనలో మంత్రి నారాయణ
తెలుగుదేశం పార్టీ పెద్ద పండగ మహానాడుకు తొలిసారి సింహపురి గడ్డ ఆతిథóŠ్యం ఇవ్వనుంది. దీనిపై అధికారిక ప్రకటన అధిష్టానం నుంచి ఇంకా రాకున్నా..మహానాడు వేదిక పరిశీలనలో పురపాలక మంత్రి పొంగూరు నారాయణ బిజీగా ఉండటంతో నెల్లూరు జిల్లానే ఎక్కువగా ఖరారయ్యేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తొలుత మహానాడును శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిం చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే జూన్‌లో ప్రధాని మోదీ శ్రీకాకుళం పర్యటన ఉండటం, భోగాపు రం పోర్ట్ ప్రారంభానికి వస్తారన్న సమాచారంతో వేదికను నెల్లూరుకు మార్చినట్లు తెలుస్తుంది. అందుకే మంత్రి నారాయణ నెల్లూరు నగరంతో పాటు కోవూరులోని పలు ప్రాంతాలను పరిశీ లించారు. కోవూరులో 2, నెల్లూరు రూరల్ ప్రాంతంలో 2 ప్రదేశా లను సందర్శించారు. మరో 2 రోజుల్లో వేదికపై పూర్తి క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.
















