- ప్రశాంతంగా తొలివిడత పంచాయతీ ఎన్నికలు
- మధ్యాహ్నమే ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి
- కూటమి బలపరిచిన అభ్యర్థుల ప్రభంజనం
- అత్యధిక సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు కైవసం
- 23 పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన పోలింగ్
- 30న కౌంటింగ్, ఫలితాల వెల్లడి
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో తొలి విడత పంచాయ తీ, మలి విడత మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతం గా ముగిసింది. ఉదయం 7 గంటల ప్రారంభమైన పోలింగ్ పంచాయతీల్లో మధ్యాహ్నం ఒంటిగంటకు
ముగిసింది. ఏకగ్రీ వాలు మినహా 3,240 సర్పంచి, 25,101 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఆ వెంటనే 2 గంటలకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. కూటమి బలపరిచిన అభ్యర్థులే అత్యధిక చోట్ల విజయం
సాధించారు. మొత్తం 34,312 పోలింగ్ కేంద్రాల్లో 99,43,895 ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పంచాయతీల్లో 77.65 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా 23 పట్టణ స్థానిక సంస్థల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా జరి గింది. సాయంత్రం 5 గంటల వరకు 62.5 శాతం ఓటింగ్ నమోదయిందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. బ్యాలెట్ బాక్సులను రాత్రి స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. ఈ నెల 30న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నారు.
బ్యాలెట్ బాక్సు ధ్వంసం చేసిన వైసీపీ శ్రేణులు
పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. 10వ వార్డు పోలింగ్ కేంద్రంలోని బ్యాలెట్ బాక్సు పగుల గొట్టేం దుకు యత్నించిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరులో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలోకి చొరబడిన వైసీపీ శ్రేణులు బ్యాలెట్ బాక్సు పగులగొట్టి పత్రాలను చించివేశారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడకి చేరుకుని ఆందోళన చేస్తున్న ఇరువర్గాలను చెదర గొట్టారు.
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాహనంపై దాడి
పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నంద్యాల జిల్లా అహోబిలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాహనంపై వైసీపీ మద్దతుదారులు దాడి చేశారు. దీంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య రాళ్లదాడి జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొ చ్చేందుకు అదనపు బలగాలను రప్పించారు. జిల్లా ఎస్పీ, పోలీసు అధికారులు అహోబిలం చేరుకున్నారు. మరోవైపు ఆళ్లగడ్డ మండ లం జమ్మదిన్నెలోనూ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ మద్దతుదారులు రిగ్గింగ్ చేస్తున్నారంటూ టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద కారంపొడి చల్లుకుని ఇరువర్గాలు పరస్పరం దాడికి పాల్పడ్డాయి. దీంతో అక్కడ పోలింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది.
రాజాంలో వైసీపీ మాజీ ఎంపీ అరాచకం
శ్రీకాకుళం జిల్లా రాజాంలో వైసీపీ మాజీ ఎంపీ బెల్లాన అరాచకం సృష్టించాడు. రాజాం 7వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద హల్చల్ చేసాడు. అడ్డుకున్న టీడీపీ అభ్యర్థి రమాదేవి భర్తతో పాటు, టీడీపీ నేతలను బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డాడు.



















