పట్టణాల నుంచి పల్లెల వరకు ఒకటే ప్రభంజనం… స్థానిక ఎన్నికల్లో కూటమి విజయ పరంపర కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన కూటమి…జడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికల్లో నూ ప్రభంజనం సృష్టించారు. “చెప్పాం… చేస్తున్నాం” కూటమి నినాదాన్ని ప్రజలు కూడా సమర్థిస్తూ మంచి ప్రభుత్వానికి విజయం చేకూర్చారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో రికార్డు స్థాయిలో విజయాలు నమోదు చేసి సత్తా చాటింది. పలుచోట్ల వైసీపీ కంచు కోటలను బద్దలు కొట్టింది. పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ వైవసం చేసుకుంది. అర్థరాత్రి కడపటి వార్తలందేసరికి కూటమి అభ్యర్థులు 7,254 ఎంపీటీసీ స్థానాలు, 495 జడ్పీటీసీ స్థానాల్లో గెలుపొందారు.
- జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో విజయపరంపర
- రికార్డు స్థాయిలో గెలుపుబాట
- మంచి ప్రభుత్వానికి అండగా ప్రజలు
- టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల సంబరాలు
- అర్థరాత్రి కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ
అత్యధిక మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థులు
పల్నాడు జిల్లా నకరికల్లు మండలం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ నాగోతు వెంకట లక్ష్మీసరోజ 32,919 ఓట్ల మెజార్టీతో సీపీఎం అభ్యర్థిపై రికార్డు స్థాయిలో విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ఇదే అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం.
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు జనసేన జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పమిడిపాటి శ్రీనివాస రావు 30,273 ఓట్ల మెజార్టీతో సత్తాచాటారు. క్రోసూరు మండ లంలో మొత్తం 33 వేల ఓట్లు పోలవ్వగా సమీప ప్రత్యర్థిపై రాష్ట్రం లోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో జనసేన శ్రేణు లు సంబరాలు చేసుకుంటున్నాయి.
పల్నాడు జిల్లా నూజెండ్ల మండలంలో కూటమి బలపరిచిన జనసేన జెడ్పీటీసీ అభ్యర్థి శింగంశెట్టి వెంకట బాలప్రసాద్
28863 మెజారిటీతో గెలుపు
పల్నాడు జిల్లా మాచవరం మండలం కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి కత్తి సరోజిని 22,882 ఓట్లు మెజార్టీతో సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి దొండేటి వెంకాయమ్మపై విజయం సాధించారు.
నంద్యాల జిల్లా డోన్ మండల టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రేగటి లక్ష్మీ వేదవతి.. సమీప ప్రత్యర్థి అభ్యర్థి రాజేశ్వరిపై 23,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి పుత్త బ్రహ్మం 21,407 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ప్రకాశం జిల్లా ముండ్లమూరు జడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన మండలపు సౌమ్య 18,728 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
పల్నాడు జిల్లా గురజాల మండల టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి మద్దినేని లక్ష్మి సమీప ప్రత్యర్థిపై 17 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి చేరెడ్డి శ్రీలక్ష్మి 12,616 ఓట్ల మెజార్టీతో ఘన విజయం అందుకున్నారు.
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం తెలుగుదేశం జడ్పీటీసీ అభ్యర్థి నాగిపోగు పుల్లయ్య 17,295 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల జడ్పీటీసీ కూటమి అభ్యర్థి ఉన్నం దీపిక 20,167 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు.
ప్రకాశం జిల్లా దొనకొండ జడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి మోడీ ఈశ్వరమ్మ 15,785 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
వైఎస్ సోదరి గ్రామంలో టీడీపీ విజయం
ఎన్టీఆర్ జిల్లా గణపవరంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి విజయం సాధించారు. గణపవరం జగన్రెడ్డి మేనత్త, వై.ఎస్. రాజశేఖర్రెడ్డి సోదరి విమలమ్మ గ్రామం.
పులివెందులలో జడ్పీటీసీ టీడీపీ కైవసం
కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి భారతి 1463 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.
జిల్లాలో 39 జడ్పీటీసీ స్థానాలు ఉంటే 23 ఏకగ్రీవమయ్యాయి. 16 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 13 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. రెండు జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. ఒక చోట కౌంటింగ్ జరుగుతోంది.
బొత్స కుమార్తెకు పరాజయం
విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబానికి ఎదురు దెబ్బ తగిలింది. బొండపల్లి స్థానంలో జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగి న బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష ఓటమి పాల య్యారు. అదే స్థానంలో టీడీపీ నుంచి పోటీ చేసిన పాశల నీరజ ఘన విజయం సాధించారు. ఏకంగా 5,136 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.
తెర్లాంలో సిరి సహస్ర విజయం
విజయనగరం జిల్లా తెర్లాం జడ్పీటీసీ స్థానాన్ని మజ్జి శ్రీను కుమార్తె, టీడీపీ అభ్యర్థి సిరి సహస్ర సొంతం చేసుకున్నారు. 6,651 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ గెలుపు వైసీపీ చేసిన ఆరోపణలకు ఓటర్లు ఇచ్చిన చెంపపెట్టుగా భావిస్తున్నారు.
తండ్రి, కుమార్తెల విజయం
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో తండ్రి, కుమార్తెలు విజయం సాధించారు. మాతుమూరు, పాంచాలి ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసిన తండ్రి జి.యుగంధర్, కుమార్తె కావ్య గెలుపొందారు.
కృష్ణగిరి జడ్పీటీసీగా కూటమి మద్దతుతో విజయం
కర్నూలు జిల్లా కృష్ణగిరి టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడంతో ఇక్కడ స్వతంత్ర అభ్యర్థికి టీడీపీ మద్దతు ఇచ్చింది. టీడీపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి మర్రి శ్రీరాములు 15,704 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు.
ఒక్క ఓటుతో టీడీపీ అభ్యర్థుల విజయం
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి అరుణ, పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కొల్లి అరుణకుమారి ఒక్క ఓటుతో గెలుపొందారు.
భార్య,భర్తల విజయం
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు 3, 4 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసిన భార్యాభర్తలు విజయలక్ష్మి, కృష్ణమూర్తి విజయం సాధించారు.




















