చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

డోన్ సభలో సీఎం చంద్రబాబు నాయుడు

by చైతన్యరధం
Mar 10, 2026 at 6:55am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • క్యూఆర్ కోడ్..రాజముద్రతో ఇస్తున్నాం
  • రికార్డులు ట్యాంపరింగ్ చేసినా
  • బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో తెలిసిపోతుంది
  • తహసీల్దారు, వీఆర్వోలూ తప్పించుకోలేరు
  • గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దుతున్నాం
  • అన్నదాతలకు ఆదాయం పెంచుతాం
  • సీమలో ప్రతి ఎకరాకు నీరు నా సంకల్పం.
  • 2027 నాటికి భూవివాదాల పరిష్కారానికి చర్యలు
  • అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్..జైలు
  • గత పాలనలో మంత్రులే ముఠాలు కట్టి కబ్జాలు
  • కల్తీ మద్యంతో దోచేసి ప్రాణాలు తీశారు
  • తిరుమల పవిత్రతను దారుణంగా దెబ్బతీశారు
  • ఏది మంచి..ఏది చెడో ప్రజలు గమనించాలి
  • అభివద్ధి వైకుంఠపాళి కాకూడదు
  • డోన్ సభలో సీఎం చంద్రబాబు నాయుడు
  • నంద్యాల జిల్లా కొత్త బురుజులో
  • పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

నంద్యాల(చైతన్యరథం): వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రం లోని భూ సమస్యలన్నీ పరిష్కరించేలా ప్రణాళికాబద్దంగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎలాంటి భూ వివాదాలు లేకుండా చర్యలు తీసుకుని ట్యాంపర్ చేయడానికి ఆస్కారం లేని విధంగా రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని రైతు ల భూములకు భద్రత కల్పించడంతో పాటు వారి ఆదాయాలు పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తబురుజులో మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమం త్రి చంద్రబాబు పాల్గొన్నారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం రెవెన్యూ శాఖను అస్తవ్యస్తం చేసింది. నాడు మంత్రులే భూ కబ్జాలకు పాల్పడ్డారు. డోన్ లో మంత్రిగా ఉన్న వ్యక్తి ఒక సాధారణ రైతు భూమిని తన అనుచరులకు కట్టబెట్టేశారు.

గత ప్రభుత్వంలో 1.95 లక్షల ఎకరాలను 22ఏలో పెట్టారు. ప్రైవేట్ భూముల రికార్డులను తమ ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. అడిగిన భూమి ఇవ్వకపోతే 22ఏలో పెట్టేసేలా గత ప్రభుత్వం వ్యవహరించింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి ప్రైవేట్ భూములపై అజమాయిషీని సొంత వాళ్లకు కట్టబెట్టాలని చూశారు. అప్పీల్ కు వెళ్లడానికి వీలు లేకుండా నిబంధనలు చేశారు. ఇదే జిల్లా పాణ్యం నియోజకవర్గంలో నాటి ప్రభుత్వం తప్పుల తడకగా జారీ చేసిన పట్టాదారు పుస్తకాన్ని కాల్చి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామని హామీ ఇచ్చాను. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం. భూ రికార్డుల్లో తప్పులను సరిదిద్దుతున్నాం. వారసత్వంగా వచ్చిన భూములు, సొంత శ్రమతో కొనుగోలు చేసిన భూములకు చెందిన పుస్తకాలపై నాటి పాలకుల ఫోటోలు వేసుకున్నారు. ఫోటోల పిచ్చితో జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. సర్వే రాళ్లపైనా ఫోటోలు ముద్రించుకున్నారు… రూ.750 కోట్లు ఫోటోలకు ఖర్చు చేశారు. ఎక్కడెళ్లినా భూ సమస్యలపై కట్టకట్టలు అర్జీలు వచ్చాయ ని సీఎం చెప్పారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-06-2026

స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే

హ్యాపీ బర్త్ డే బాలా మావయ్య

రెవెన్యూ వ్యవస్థను గాడిన పెట్టేందుకు 20 నెలలు పట్టింది
“వాళ్లు చేసిన ఒక దుర్మార్గాన్ని సరిదిద్దడానికి 20 నెలలు పట్టింది. రైతుల సమక్షంలోనే భూ కొలతలు తీసుకుని రైతుల ఆమోదంతో భూ వివరాలతో పుస్తకాలు ఇస్తున్నాం. భూ రికార్డులు తారుమారు చేయకుండా పక్కాగా పట్టా ఇస్తున్నాం. క్యూఆర్ కోడ్ విధానం తీసుకొచ్చాం. ఎవరు రికార్డులు తారుమారు చేసినా తెలిసిపోతుంది. తహసీల్దారు, వీఆర్వోలు తప్పు చేసినా బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా తెలిసిపోతుంది. మేం ఇచ్చిన పట్టాదార్ పుస్తకాలను ట్యాంపర్ చేయలేరు. వివాదాల్లేని పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇప్పించే బాధ్యత నాది. రాష్ట్ర వ్యాప్తంగా 16,816 గ్రామాలు ఉన్నాయి. 6,860 గ్రామాల్లో సర్వే గత ప్రభుత్వంలో చేశారు. తప్పుల తడకతో 19.93 లక్షల పుస్తకాలు ఇచ్చారు. రికార్డులు తారుమారు చేసి ఇచ్చారు. అవన్నీ పక్కనపెట్టి మళ్లీ కొత్తగా రైతులకు పుస్తకాలు అందిస్తున్నాం. గత పాలకులు చేసిన తప్పును సరిదిద్దుతూ ప్రభుత్వమే ఉచితంగా పట్టాలు ఇస్తోంది. రిజిస్ట్రేషన్ విధానం కూడా సులభతరం చేస్తున్నామని చెప్పారు.

భగీరథ స్ఫూర్తితో సీమలో ప్రతి ఎకరాకు నీరు
“సీమలో ముఠా నాయకులు ఉండేవారు. ఎన్నికల సమయం లో డబ్బుల కంటే బాంబులు అడిగే పరిస్థితి ఉండేది. ప్రజాస్వా మ్యంలో ఇలాంటి దౌర్బగ్యాలు ఉండకూడదని.. ఈ ప్రాంతంలో ముఠా తగాదాలను తుదముట్టించాం. ముఠాలు వద్దు గ్రామాల్లో ప్రశాంతతే ముద్దు అని చెప్పి వైరం ఉన్న నేతలను కలిపాను. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరివ్వాలన్నది నా సంకల్పం. మొదట హంద్రీ-నీవా ఆలోచన చేసింది ఎన్టీఆర్. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ సహా అనేక ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. వాటిని నేను పూర్తి చేస్తున్నాను. ఈ డోన్ నియోజకవర్గంలో హంద్రీ-నీవా ద్వారా 30 చెరువులకు నీరిచ్చాం. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తాం. ఇక్కడి ఉత్పత్తుల ను ప్రపంచమంతా ఎగుమతి చేసే సౌకర్యాలు కల్పిస్తాం. అగ్రో ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తాం. మామిడికి తెగులు వస్తే పేపర్ కవర్ పెట్టే పద్దతి తెచ్చాం. మామిడి పండ్లకు తొడిగే కవరుకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నాం. దీంతో నాణ్యత పెరిగిం ది..లాభాలు వచ్చాయి. కవరు తొడిగిన పండ్లకు రూ.40 వేల దాకా ఆదాయం వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో మామిడికి ధర పెరిగి ఒక టన్నుకు రూ.1.70 లక్షల వరకూ ఆదాయం వస్తోంది. మామిడికి రేటు తగ్గితే కిలోకు రూ.4 సబ్సిడీ ఇచ్చాం. సీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తాం. కేంద్రం రూ.30 వేల కోట్లు పూర్వోదయ పథకం కింద ఇస్తుందని తెలిపారు.

విద్యుత్ ఛార్జీలు పెంచబోం
“సూపర్‌సిక్స్ సూపర్‌హిట్ చేశాం. పేదలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుంది. నేను కష్టపడేది ప్రజల కోసమే. ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇస్తున్నాం. జనాభా పెరుగుదలపై దృష్టి పెట్టాం. పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ తెచ్చాం. పెద్ద కుటుంబమే మనకు రక్ష. పెద్ద కుటుంబా లకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అధికంగా ఇస్తాం. అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తు న్నాం. వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. రైతును రాజు చేస్తాం. టెక్నాలజీ సాయంతో అగ్రిటెక్ ద్వారా ముందు గానే తెగులు పసిగట్టి నివారణ సూచిస్తాం. ఆడబిడ్డలకు దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. స్త్రీ శక్తి ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. మెగా డీఎస్సీ నిర్వహించాం. రాష్ట్రానికి రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 23 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఈ 20 నెలల్లో 6.88 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదే. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు చేశాం. పంచాయతీరాజ్ శాఖ రోడ్ల విషయంలో ఉన్న సమస్యలనూ పరిష్కరిస్తాం. రూ.4 వేల కోట్లు పంచాయతీ రోడ్లకు కేటాయిస్తున్నామని వివరించా రు.

సీమకూ పరిశ్రమలు వస్తున్నాయి
గత పాలనకు, కూటమి ప్రభుత్వ పాలనకు తేడా ఏంటో ప్రజలు గ్రహించాలి. రాయలసీమలో స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్, ఆటో మొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తు న్నాయి. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులు పెడుతు న్నాం. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెడుతున్నాం. గత ప్రభుత్వంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.32 వేల కోట్ల మేర విద్యుత్ భారాన్ని మోపారు. కూటమి ప్రభుత్వం భవిష్యత్ లో కరెంటు చార్జీలు పెంచబోదని హామీ ఇస్తున్నాను.. జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీరు అందిస్తాం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరుల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం. ఒక ఏడాదిలో లక్ష మంది మహిళలను పారిశ్రా మికవేత్తలుగా తయారు చేశాం. ఈ ఏడాదికి ఇంకో 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తయా రు చేస్తాం. స్వయం ఏపీ పేరుతో స్వయం సహాయక బృందాల ఉత్పత్తులకు బ్రాండ్ తీసు కొచ్చాం. సమాజంలో ఆర్థికంగా ఇబ్బందులో వారికి చేయూత కోసం పీ4 అమలు చేస్తున్నాం. డోన్ నియోజకవర్గంలో అన్ని సమస్యలను పరిష్కరించి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేస్తాం. కొత్త బురుజులో సీసీ రోడ్లు వేసేందుకు నిధులు కేటాయించడంతో పాటు అర్హులకు ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు.

పాపాలు చేశారు.. ప్రాణాలు తీశారు
“గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది. మూడు పార్టీ లు కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశాం. రాష్ట్రానికి పూర్వవైభవాన్ని తీసుకొస్తామన్న మా మాటను నమ్మి అధికారం ఇచ్చారు. నంద్యాల జిల్లాలో పార్లమెంట్ సహా 8 మందిని గెలి పించారు. సీమలో 7 సీట్లు తప్ప అన్నింటా కూటమి అభ్యర్థుల ను గెలిపించారు. ప్రజాహితం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. గత ప్రభుత్వంలో అన్నీ కుంభకోణాలు, వివాదాలే. 30 వేల మంది కల్తీ మద్యం తాగి ప్రభుత్వంలో చనిపోయారు. ఎక్సైజ్ శాఖలో నెలకు రూ.100 కోట్లు అవినీతి చేశారు. పేదల ఆరోగ్యానికంటే వారికి డబ్బులే ముఖ్యం. ప్రజల జీవితాలు, ఆరోగ్యంతో ఆడుకున్నారని మండిపడ్డారు.

తిరుమల లడ్డూపైనా రాజకీయం చేస్తున్నారు
తిరుమల లడ్డూలో వాడే నెయ్యిని కూడా కల్తీ చేశారు. తిరు మల లడ్డూ కల్తీ, మద్యం అవినీతి, భూ దోపిడీ వంటి వాటిని ప్రక్షాళన చేస్తున్నాం… వాటిపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లడ్డూ విషయంలో సీబీఐ ఇచ్చిన రిపోర్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేస్తే ఉపేక్షించ ను..ఎవరు చేసినా ఒప్పుకోను. తిరుమల లడ్డుపైనా రాజకీయం చేసి తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఎదురుదాడి చేస్తున్నారు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. 23 క్లైమోర్ మైన్లతో దాడి చేస్తే ఆ వెంకటేశ్వర స్వామే నన్ను రక్షించాడు. వివేకానందరెడ్డిని హత్య చేసి నా చేతిలోనే కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాశారు. నేరాలు ఘోరాలు చేశారు. జగన్ చేసిన అన్యాయాన్ని ఆయన సోదరి సునీత తెలుసుకున్నారు. వివేకా కుమార్తె న్యాయం కోసం నేటికీ కోర్టులు చుట్టూ తిరుగుతోంది. ప్రజలు ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించాలి. 2019లో వారిని గెలిపించడంతో రాష్ట్రంలో ఏం జరిగిందో మీరే చూశారు. అభివృద్ధి వైకుంఠపాళి కాకూడదని అభిప్రాయపడ్డారు. ప్రజా వేదికకు చేరుకునే ముందు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యా వుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, జిల్లా ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Previous Post

వైసీపీ నేతల అక్రమాలపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

Next Post

మహిళా ద్రోహి జగన్

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-06-2026

కార్యకర్త
@ June 11, 2026
స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే
ఆంధ్రప్రదేశ్

స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే

చైతన్యరధం
@ June 11, 2026
ఆంధ్రప్రదేశ్

హ్యాపీ బర్త్ డే బాలా మావయ్య

చైతన్యరధం
@ June 11, 2026
పద్మభూషణుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్

పద్మభూషణుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు

చైతన్యరధం
@ June 11, 2026
దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ
ఆంధ్రప్రదేశ్

దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

చైతన్యరధం
@ June 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 10-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-06-2026

కార్యకర్త
@ June 10, 2026
అండగా నిలబడతాం
ఆంధ్రప్రదేశ్

అండగా నిలబడతాం

చైతన్యరధం
@ June 10, 2026
స్టీల్ ప్లాంట్ ప్రమాదం..
ఆంధ్రప్రదేశ్

స్టీల్ ప్లాంట్ ప్రమాదం..

చైతన్యరధం
@ June 10, 2026
Load More

ముఖ్య వార్తలు

దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

చైతన్యరధం
@ June 11, 2026
రీ సర్వేలో సమస్యల పరిష్కారం

రీ సర్వేలో సమస్యల పరిష్కారం

చైతన్యరధం
@ June 9, 2026
అభిమానికి ఆత్మీయ పలకరింపు

అభిమానికి ఆత్మీయ పలకరింపు

చైతన్యరధం
@ June 9, 2026
2027 నాటికి భూ రికార్డులు క్లీన్

2027 నాటికి భూ రికార్డులు క్లీన్

చైతన్యరధం
@ June 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే

స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే

చైతన్యరధం
@ June 11, 2026

హ్యాపీ బర్త్ డే బాలా మావయ్య

చైతన్యరధం
@ June 11, 2026
పద్మభూషణుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు

పద్మభూషణుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు

చైతన్యరధం
@ June 11, 2026
దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

చైతన్యరధం
@ June 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist