- తొలి దశలో 3967 సర్పంచులు,40,012 వార్డు సభ్యుల స్థానాలు
- నవంబరు 26న పోలింగ్ ప్రక్రియ అదేరోజు కౌంటింగ్, ఫలితాలు
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు ఆదివారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారం భం కానుంది. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 26న 3,967 సర్పంచులు, 40,012 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల తరువాత ఓట్లు లెక్కించి ఫలితా లు ప్రకటిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 13,167 సర్పంచులు, 1,32, 514 వార్డు సభ్యుల స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. రెండు, మూడు దశల ఎన్నికలకు ఈ నెల 16, 19 తేదీల్లో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వనుంది. డిసెంబరు 2 నాటికి మూడు దశల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తారు.
తొలి దశ ఆ రెండు జిల్లాలు దూరం
విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో తొలి దశ పోలింగ్ నిర్వ హించడం లేదు. ఈ నెల 26న పంచాయతీలతో పాటే 23 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్ నిర్వహించనున్నారు. వీటిలో గుంటూ రు జిల్లాలో మంగళగిరి – తాడేపల్లి నగరపాలక సంస్థతో పాటు పొన్నూరు పురపాలక సంఘం ఉన్నాయి. జిల్లా యంత్రాంగం ఆ రెండు చోట్ల పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. రెండు, మూడు దశల్లో జిల్లాలో 208 పంచాయతీలకు పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు లో జిల్లా యంత్రాంగమంతా నిమగ్నమై ఉంది. దీంతో ఆ జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించడం లేదు. ఈ జిల్లాలోని మొత్తం 79 పంచాయతీలకు మూడో దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి దశ పోలింగ్‌లో తిరుపతి జిల్లాలో అత్యధికంగా 404 పంచాయతీలు ఉన్నాయి. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 66 పంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
మొదటి దశ షెడ్యూల్ వివరాలు
నవంబరు 15: నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
నవంబరు 17: నామినేషన్ల స్వీకరణ ముగింపు
నవంబరు 18: నామినేషన్ల పరిశీలన..తిరస్కరణ
నవంబరు 19: తిరస్కరించిన నామినేషన్లపై
సాయంత్రం 5 గంటల్లోపు ఆర్డీవోకు అప్పీల్ అవకాశం
నవంబరు 20: అప్పీల్‌ను ఆర్డీవో పరిష్కరిస్తారు
నవంబరు 21: మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు: ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ
నవంబరు 26: ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్: మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు: ఫలితాల ప్రకటన తర్వాత రోజు ఉప సర్పంచి ఎన్నిక
నవంబరు 27: అవసరమైన చోట రీ పోలింగ్, ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన
నోట్: ఏదైనా పంచాయతీకి, పదవులకు ఎన్నికలు నిర్వహిం చొద్దని న్యాయస్థానం ఆదేశాలిస్తే.. అలాంటి చోట ఎన్నికలకు వెళ్లొద్దని కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా ఆదేశించారు.
డిపాజిట్ వివరాలు…ఎన్నికల వ్యయ పరిమితి
– సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేసే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.1500, ఇతరులైతే రూ.3000 డిపాజిట్ చేయాలి.
– వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు వేసే ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.500, ఇతరులైతే రూ.1,000 డిపాజిట్ చెల్లించాలి.
` 2011 జనాభా లెక్కల ప్రకారం 10 వేలు, అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థుల ఎన్నిక ల వ్యయం రూ.4 లక్షలు, వార్డు సభ్యుల ఖర్చు రూ.లక్ష
` 10 వేల కంటే తక్కువ జనాభా గల పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రూ.2.50 లక్షలు, వార్డు సభ్యులకు పరిమితి రూ.60 వేలు
“““
పంచాయతీల్లో మÖడు దశల్లో ఓటర్లు
“““
మొత్తం ఓటర్లు: 2,61,52,377
మొత్తం మహిళా ఓటర్లు: 1,32,74,208
మొత్తం పురుష ఓటర్లు: 1,28,76,887
ఇతర వర్గం ఓటర్లు: 1282
““
మొత్తం 13,167 సర్పంచుల స్థానాలకు రిజర్వేషన్లు
““
ఎస్టీ మహిళ 475
ఎస్టీ జనరల్ 705
ఎస్సీ మహిళ 1135
ఎస్సీ జనరల్ 1,331
బీసీ మహిళ 1,536
బీసీ జనరల్ 1,569
మహిళ జనరల్ 3,299
అన్ రిజర్వ్ 3,117
“““`
ఎడమ చేతి చిటికెన వేలికి సిరా గుర్తు
ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలికి సిరా గుర్తు వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సృష్టం చేసింది. ఇటీవల నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేతి వేలికి, రీపోలింగ్ సమయంలో మధŠ్య వేలికి సిరా గుర్తులు వేశారు. ఇప్పుడు అదే ఓటర్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. దాంతో ఇప్పటికీ కొందరి చేతి వేళ్లకు గుర్తులు తొలగని నేపథ్యంలో గందరగోళం తలెత్తకుండా ఎడమ చేతి చిటికెన వేలికి సిరా గుర్తు వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.


















