చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

కొండపి నియోజకవర్గం కె. అగ్రహారం బహిరంగ సభలో నారా లోకేష్.

by చైతన్యరధం
July 19, 2023
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
Nara Lokesh

nara lokesh public meeting at k agraharam in Kondepi Constituency

Share on FacebookShare on TwitterShare on Whatsapp

కొండపి దద్దరిల్లింది. టిడిపి కంచుకోట కొండపి. వరాహ లక్ష్మినరసింహ స్వామి ఆలయం, వల్లూరమ్మ ఆలయం ఉన్న పుణ్య భూమి కొండపి. కొండపి రూపురేఖలు మార్చిన గొప్ప నేత దామచర్ల ఆంజనేయులు గారు. పొగాకు రైతుల కష్టాలు చూసి కొండపి లో పొగాకు బోర్డు ఏర్పాటు చేసింది స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారు. పవిత్రమైన కొండపి నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. యువగళం..మనగళం..ప్రజాబలం. చంద్రయాన్ 3 సక్సస్ అయ్యింది. జగన్ కి కోపం వచ్చింది. మొన్న జగన్ టీవీ చూస్తుంటే ఇస్రో చంద్రయాన్ 3 సక్సస్ అయ్యింది అనే వార్త వస్తుంది. ఆ వార్త చూసి జగన్ కి విపరీతమైన కోపం వచ్చింది. టివి పగలగొట్టాడు. వెంటనే ప్యాలస్ బ్రోకర్ సజ్జలని పిలిచి చితకబాదాడు. సజ్జలకి అర్ధం కాలేదు అసలు నన్ను ఎందుకు తిడుతున్నాడు అనుకున్నాడు. భయపడుతూనే ఏం జరిగింది సార్ అన్నాడు సజ్జల. చంద్రయాన్ అని పేరు పెడితే ఏం పీకావ్? అధికారంలో ఉన్నది మనమా? చంద్రబాబా? అని అడిగాడు.

జగన్యాన్ అని పేరు పెట్టకపోతే ఇస్రో దగ్గరకి జేసీబీ పంపుతాం అని వార్నింగ్ ఇవ్వాలి కదా అన్నాడు. అక్కడికి జేసీబీ పంపితే మనం జీవితాంతం చిప్పకూడు తినాల్సిందే సార్ అన్నాడట సజ్జల. సైకో జగన్ పాలనలో బడిలో పాఠాలు చెప్పే మాస్టారుకి భద్రత లేదు. ఆఖరికి పోలీస్ స్టేషన్ లో పోలీసులకు కూడా భద్రత లేదు. అంగన్వాడీ టీచర్లకు కూడా రక్షణ లేదు. పెద్ద సైకో ని చూసుకొని చిన్న సైకోలు రెచ్చిపోతున్నారు. బాబాయ్ గొడ్డలి పోటుని ఆదర్శంగా తీసుకోని విజయనగరం జిల్లా రాజాంలో ఎంతో మంచి పేరు ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు కృష్ణని వైసిపి నేతలు బొలెరోతో గుద్దారు. కొన ఊపిరితో ఉన్న మాస్టారుని రాడ్లతో కొట్టి, కళ్లు పొడిచి చంపేసారు. ఆ దుర్మార్గులను టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శిక్షిస్తాం. ఇంకో పిల్ల సైకో ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే ఎస్ఐ పై దాడి చేసాడు. సూళ్లూరుపేటలో దళిత ఎస్ఐ రవిబాబు అతని డ్యూటీ చేసారు. రౌడీషీట్ లో ఉన్న వైసిపి నేత సునీల్ రెడ్డి ని కౌన్సిలింగ్ కి పిలిచారు. ఏకంగా ఆ సునీల్ రెడ్డి దళిత ఎస్ఐ రవిబాబు పై దాడి చేసాడు. పైగా ఎస్ఐ పై రివర్స్ కేసు పెట్టాడు. పోలీసులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? జగన్ ముందు టిడిపి నాయకులు, కార్యకర్తలపై దాడి చేసాడు. అంతా మనకెందుకులే అనుకున్నారు.

ఆ తరువాత జగన్ బీసీలు, దళితులు, మైనార్టీల పై దాడి చేసాడు. అంతా మనకెందుకు లే అనుకున్నారు. జగన్ ఇప్పుడు ప్రజల పైనా, పోలీసుల పైనా దాడి చేస్తున్నాడు. ఇంకా చూస్తూ ఉరుకుందామా? పోరాడదామా? జగన్ కులం క్యాష్, జగన్ మతం క్యాష్. లక్ష కోట్లు ఆస్తి ఉన్నా, లక్ష రూపాయల చెప్పులు వేసుకొని తిరుగుతున్నా, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగుతున్నా పేదవాడ్ని అంటూ అబద్దం చెబుతాడు. బెంగుళూరు లో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లి లో ప్యాలస్, ఇడుపులపాయలో ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో మరో ప్యాలస్ కడుతున్నాడు. ఇన్ని ప్యాలస్ లు ఉన్న వాడు పేదవాడా? సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, సొంత టివి, ఛానల్ ఉన్నవాడు పేదవాడా? ఇప్పుడు మీకో క్విజ్ పెడతాను. జగన్ స్పెషల్ ఫ్లైట్ లో మళ్లీ ఢిల్లీ ఎందుకు వెళ్లాడు? మొదటి ఆప్షన్ బాబాయ్ మర్డర్ కేసులో ఏ8 అవినాష్ కి కాపాడటానికి. రెండో ఆప్షన్ ఏ9 గా జగన్ పేరు పెట్టకుండా ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికి. మూడో ఆప్షన్. భార్య భారతీ రెడ్డి గారిని కేసు నుండి తప్పించాడనికి. నాలుగో ఆప్షన్. ఆల్ ది ఎబోవ్. ఇప్పుడు చెప్పండి పిన్ని పసుపు, కుంకుమ చెరిపేసింది ఎవరు? జగన్. పిన్ని తాళి తెంచింది ఎవరు? జగన్. చెల్లిని చిత్ర హింసలు పెట్టింది ఎవరు? జగన్.

బాబాయ్ మర్డర్ ఎవరి రక్త చరిత్ర? జగనాసుర రక్త చరిత్ర. జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా. జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. కిలో టమాటో రూ.100, కిలో పచ్చిమిర్చి రూ.100. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి. జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్.

100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్. జగన్ మహిళల్ని నమ్మించి మోసం చేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసాడు. 2వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. జగన్ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్ కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు.

యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. డిఎస్సీ కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తాం. జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది. బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. సైకోపాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. 15 ఏళ్ల పిల్లాడిని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తే సీఎం స్పందించలేదు. అమర్నాధ్ గౌడ్ చేసిన తప్పేంటి? తన అక్కని వేధిస్తున్న వైసిపి కార్యకర్త వెంకటేశ్వర రెడ్డిని అడ్డుకున్నాడు. బీసీలు అంటే జగన్ కి చిన్నచూపు. అమర్నాధ్ గౌడ్ బీసీ కాబట్టే జగన్ కుటుంబాన్ని పరామర్శించాడనికి కూడా వెళ్లలేదు. టిడిపి అమర్నాథ్ కుటుంబాన్ని ఆదుకుంది. మేం వచ్చాక అమర్నాధ్ గౌడ్ ని చంపిన వారిని కఠినంగా శిక్షిస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. తాడిపత్రి లో వైసిపి నేతల ఒత్తిడి తట్టుకోలేక దళిత సిఐ ఆనందరావు గారు ఆత్మహత్య చేసుకున్నారు.

టిడిపి నేత జేసి ప్రభాకర్ రెడ్డి, కార్యకర్తల పై కేసులు పెట్టాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒత్తిడి చెయ్యడంతోనే ఆనందరావు గారు ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయారు. తాడిపత్రి వచ్చినప్పటి నుండి నాన్న కి టెన్షన్స్ పెరిగి ట్రాన్స్ ఫర్ కోసం ప్రయత్నం చేసారని పెద్ద కుమార్తె భవ్యశ్రీ చెప్పింది. ఒక పోలీసు ఆత్మహత్య చేసుకుంటే మిగిలిన వాళ్లు, సంఘాలు స్పందించలేదు. జగన్ ఆ కుటుంబానికి అన్యాయం చేసాడు. ఆనందరావు కుటుంబాన్ని టిడిపి ఆదుకుంటుంది. ఆనందరావు ఆత్మహత్యకు కారణం అయిన వారిని టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శిక్షిస్తాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు జిల్లా ప్రజలు 2019లో టిడిపి గౌరవాన్ని నిలబెట్టారు. 4 సీట్లు గెలిపించారు. 2024 లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రకాశం జిల్లా ని గుండెల్లో పెట్టుకొని అభివృద్ధి చేస్తాం. 2019 లో వైసిపి 8 సీట్లు గెలిచింది. టిడిపి ఎమ్మెల్యేని కూడా పార్టీలో చేర్చుకున్నారు.

మొత్తం 9 ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే జిల్లా ఎలా అభివృద్ధి చెందాలి? అభివృద్ధిలో దూసుకెళ్ళాలి. కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కి జగన్ పీకింది ఏంటి? ప్రకాశం జిల్లా అభివృద్ది పై నేను చర్చకి సిద్దం. వైసిపి నాయకులు సిద్దమా? వెలిగొండ ప్రాజెక్ట్ పనులు ఏడాదిలో పూర్తి చేస్తా అన్నాడు. పూర్తి చేసాడా ? 6 సార్లు తేదీలు మార్చాడు. నడికుడి – కాళహస్తి పనులు రైల్వే పనులు పూర్తి అయ్యాయా? నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు కోసం టిడిపి హయాంలో భూసేకరణ చేసాం. ఆ ప్రాజెక్ట్ జగన్ పాలనలో ఎత్తిపోయింది. రాయల్టీ, కరెంట్ ఛార్జీలు, పన్నులు పెంచి గ్రానైట్ పరిశ్రమను దెబ్బతీసాడు. దొనకొండ వద్ద ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చెయ్యాలని టిడిపి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ ప్రాజెక్టు ని అటక ఎక్కించింది జగన్ ప్రభుత్వం. గుండ్లకమ్మ ప్రాజెక్టును నాశనం చేసాడు. గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు లోని నీరు మొత్తం ఖాళీ చేసారు. జగన్ అసమర్ధత కారణంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. 12 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఏషియన్‌ పల్ప్‌ అండ్‌ పేపర్‌ పరిశ్రమను తీసుకొస్తే జగన్ తన్ని తరిమేసాడు. అది వచ్చి ఉంటే ఇక్కడ సుబాబుల్, జామాయిల్ రైతులకు ఎంతో మేలు జరిగేది. ప్రకాశం జిల్లా కొండపి ని అభివృద్ధి చేసింది టిడిపి.

సామ్సంగ్ ఎస్3 లా కొండపి లో ఎస్3 ఉన్నారు. సింహం స్వామి గారు, సత్య జోడి… ఈ ఇద్దరూ నాతో పోరాడి నిధులు సాధించారు. 2014-19 వరకూ రూ.1500 కోట్లతో కొండపి ని అభివృద్ధి చేసింది టిడిపి. నియోజకవర్గంలో డబుల్ రోడ్లు, గ్రామాల్లో సిసి రోడ్లు, అసలు రోడ్లు లేని గ్రామాలకు తారు రోడ్లు, పేదలకు ఇళ్లు, వంతెనలు, రూ.60 కోట్లతో తాగునీటి పధకం ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు పడుతుంది. కానీ తన్నే దున్నపోతు ప్రభుత్వం వచ్చిన తరువాత కొండపి కి ఎం చేసింది? గుండు సున్నా. కొండపిని వైసిపి నేతలు పీక్కొని తింటున్నాయి. ప్రశాంతంగా ఉండే కొండపి ని అరాచకాలకు అడ్డాగా మార్చేసారు. కొండపి లో వైసిపి ఒక్క దిక్కులేని పార్టీ. మొదటి ఇంఛార్జ్ దోపిడీకి జనం జడుసుకున్నారు. రెండో ఇంఛార్జ్ వచ్చాడు. ఆయన దెబ్బకి ప్రజలు, సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇతర ప్రాంతాలకు పారిపోయే పరిస్థితి వచ్చింది. త్వరలో మూడో ఇంఛార్జ్ రాబోతున్నాడు. అక్కడితో ఆగదు ఎన్నికల లోపు నాలుగో ఇంఛార్జ్ కూడా రావడం ఖాయం. నియోజకవర్గంలో ఇసుక, మట్టిని దోపిడీ చేస్తున్నారు. అంగన్వాడీ పోస్టుల దగ్గర నుండి ఉద్యోగస్తుల బదిలీల వరకూ ప్రతి దానిలో కమిషన్లు. మహిళల పై దాడులు చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్న హనుమాయమ్మని వైసిపి నేత ట్రాక్టర్ తో గుద్ది చంపేసాడు. నీ భర్త టిడిపిలో ఉన్నాడు. నిన్ను చంపేవరకూ నిద్రపోను అని ముందే వార్నింగ్ ఇచ్చి మరీ చంపేసాడు. ఆ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అందుకోలేదు.

టిడిపి ఆ కుటుంబాన్ని ఆదుకుంది. మన సింహం స్వామి గారు చేసిన తప్పేంటి? తన నియోజకవర్గం అభివృద్ధి గురించి పోరాడటం తప్పా? అభివృద్ధి చెయ్యమని అడగటం తప్పా? ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి అని నిలదీయడం తప్పా? ఒక దళిత ఎమ్మెల్యే పై అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఆఖరికి ఆయన చొక్కా చింపి అవమానించారు. అయినా మన సింహం స్వామి గారు డైలాగ్ ఒక్కటే, ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు. అన్ని గుర్తుపెట్టుకుంటాం వడ్డీతో సహా వైసిపి నేతలకు చెల్లిస్తాం. కొండపి కి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. సంగమేశ్వర ప్రాజెక్ట్ నిర్మించి సాగు, తాగు నీరు అందిస్తాం అని చెప్పి మోసం చేసాడు. పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తాం అన్నాడు. కొండపికి పరిశ్రమలు వచ్చాయా? గురుకుల పాఠశాలల్లో టిడిపి ప్రభుత్వం సీట్లు పెంచితే జగన్ ప్రభుత్వం సీట్లు తగ్గించి దళిత విద్యార్థులకు అన్యాయం చేసింది. 2024లో స్వామి గారిని భారీ మెజారిటీ తో గెలిపించండి, కొండపిని అభివృద్ధిలో నంబర్1 చేస్తాం. ఫ్లోరైడ్ సమస్య గురించి నాకు అవగాహన ఉంది.వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తాం. సంగమేశ్వర ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం. సాగునీరు అందిస్తాం. పాలేరు, మూసి నదులకు వెలిగొండ తూర్పు కాలువను అనుసంధానం చేస్తాం.

మూసి, మునేరు, పాలేరు నదుల్లో చెక్ డ్యామ్స్ నిర్మాణం చేస్తాం. జామాయిల్, శనగ, పొగాకు రైతుల కష్టాలు నాకు తెలుసు. మీ పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం. ఆక్వా రైతులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. జగన్ అసమర్థ పాలన వలన ఆక్వా రంగం సంక్షోభంలో పడింది.కరెంట్ ఛార్జీలు, ఫీడ్, మందులు, యంత్రాల ధరలు జగన్ ప్రభుత్వం విపరీతంగా పెంచేసింది. పాడి రైతుల్ని ఆదుకుంటాం. మూసేసిన ఒంగోలు డైరీని ప్రారంభిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తక్కువ ధరకే విద్యుత్ అందజేస్తాం. ఫీడ్, మందులు, యంత్రాల ధరలు తగ్గించి ఆక్వా రైతుల్ని ఆదుకుంటాం. టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను. అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తా. కొండపి లో ఉన్నా కంబోడియా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా. నాలుగేళ్లుగా పోరాడుతున్న కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాను. భయం మా బయోడేటా లో లేదు.

సైకో పోవాలి… సైకిల్ రావాలి.

Tags: andhra pradeshK Agraharam Public MeetingKondepi ConstituencyNara lokeshTelugu Desam Partyyuvagalamyuvagalam in Kondepi
Previous Post

నేను 25వేల కి.మీ.ల సిసి రోడ్లు వేశాను… నువ్వు రోడ్లపై తట్టమట్టి అయినా పోశావా జగన్?!

Next Post

LIVE : Day-159: కనిగిరి నియోజకవర్గంలో వలస కార్మికులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్.

మరిన్ని వార్తలు

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

November 2, 2026
విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

November 2, 2026
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా
ఆంధ్రప్రదేశ్

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

November 2, 2026
తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

November 2, 2026
బీసీలకు 40% సీట్లు
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ పునరుద్ధరణ పనులకు సిబ్బందిని పంపండి

November 2, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి
ఆంధ్రప్రదేశ్

కూటమి శ్రేణులు సంయమనం పాటించాలి

November 2, 2026
Next Post
nara lokesh

LIVE : Day-159: కనిగిరి నియోజకవర్గంలో వలస కార్మికులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్.

ముఖ్య వార్తలు

  • ముఖ్య వార్తలు
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026
0

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026
0

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

by చైతన్యరధం
October 30, 2026
0

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025
0

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026
0

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026
0

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

by చైతన్యరధం
October 15, 2026
0

సీఎం చంద్రబాబుతో కీలక సమావేశం రెండురోజుల్లో కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన నాయకుల ప్రకటన అమరావతి(చైతన్యరథం): స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూటమి నేతలు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

by కార్యకర్త
November 2, 2026
0

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రజాస్వామ్యం గురించి జగన్‌రెడ్డి నీతులు చెబుతున్నారు పులివెందులలో ఉద్దేశపూర్వకంగానే సమస్య సృష్టించారు నాడు ఏకగ్రీవాలు ఎలా చేశారో అందరూ ప్రశ్నించాలి ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీ ఏ...

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

by చైతన్యరధం
November 2, 2026
0

రాప్తాడు ఘటన నేపథ్యంలో కౌన్సెలింగ్ 20 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా లోకేష్ చర్యలు అమరావతి(చైతన్యరథం):...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.