చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

పేదరికం లేని మంగళగిరి నా కల!

`మంగళగిరి ప్రజలకు నారా లోకేష్‌ బహిరంగలేఖ

by చైతన్యరధం
May 12, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
లోకేష్‌ ఫోన్‌ హ్యాకింగ్‌ కు ప్రయత్నం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి(చైతన్యరథం): పేదరికం లేని మంగళగిరి తన కల అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే అందరం కలిసి మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందామని పిలుపు ఇచ్చారు. ఈ మేరకు శనివారం మంగళగిరి ప్రజలకు లోకేష్‌ బహిరంగ లేఖ రాశారు. లేఖ పూర్తి పాఠం.

నా మంగళగిరి కుటుంబసభ్యులకు నమస్కారాలతో…
శతాబ్దాల చరిత్ర కలిగిన మంగళగిరి రాజకీయ చైతన్యానికి పుట్టినిల్లు. కృష్ణమ్మ పరవళ్లు, ప్రకృతిసోయగాల నడుమ నిత్యనూతనంగా విరాజిల్లే సుందరమైన ప్రాంతం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో నేను పోటీచేసినపుడు ఎన్నికలకు కేవలం 23రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకునే లోపే ఎన్నికల సంగ్రామం ముగిసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిచెందాను. ఓడిపోయిన రోజు బాధపడినా మరుసటి రోజు నుంచే మంగళగిరి ప్రజలతో మమేకమయ్యాను. మరీ ముఖ్యంగా ఇక్కడి ప్రజల ప్రేమ, అభిమానం నన్ను కట్టిపడేశాయి. మంగళగిరి ప్రజల హృదయాలను గెలవాలని నిర్ణయించుకున్నాను. ఐదేళ్లుగా నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నాను. యువగళం పాదయాత్ర ప్రారంభించకముందే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పాదయాత్ర చేసాను, ప్రతి గడప తొక్కాను, నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకున్నాను. యువగళం పాదయాత్ర సందర్భంగా దాదాపు ఏడాదిపాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్నా నా మనసంతా మంగళగిరిలోనే ఉండేది. కుటుంబసభ్యుల్లా ఇక్కడి ప్రజలు తరచూ నన్ను కలుస్తూ నాపై చూపిన ఆప్యాయత మాటల్లో చెప్పలేను. వారందించిన ప్రోత్సాహంతోనే రాష్ట్రవ్యాప్తంగా 3132 కి.మీ.ల పాదయాత్రను దిగ్విజయంగా పూర్తిచేయగలిగాను. జగన్‌ సర్కారు నాన్నపై తప్పుడు కేసులుపెట్టి 53రోజులు రాజమండ్రి జైలులో పెట్టినపుడు మంగళగిరి ప్రజలు ఇచ్చిన నైతికమద్దతు, మనోధైర్యం జీవితంలో మరువలేను. అత్యంత క్లిష్టపరిస్థితుల్లోనూ తట్టుకుని నిలబడ్డానంటే కారణం నా బలం, బలగమైన మంగళగిరి ప్రజలే.

ఏ కష్టమొచ్చినా అండగా ఉన్నాను….!
25 ఏళ్లు నియోజకవర్గాన్ని పాలించిన రెండు కుటుంబాలు చేసింది ఏంటో ప్రజలంతా ఒక్క సారి ఆలోచించాలి. రెండుసార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన వ్యక్తి పత్తాలేకుండా పోతే నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టమొచ్చినా నేను అండగా ఉన్నాను. మంగళగిరి ప్రజలు నా కుటుంబసభ్యులు అనుకొని సేవలందించాను. చిరువ్యాపారులకు తోపుడుబళ్లు మొదలుకొని పెళ్లికానుకల వరకు, వీధుల్లో సిమెంటు బల్లల మొదలు రోడ్లనిర్మాణం, తాగునీటి ట్యాంకర్ల వరకు ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా సొంత నిధులతో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. అరాచకమూకలు అడ్డంకులు సృష్టించినా ఎదురొడ్డి పోరాడి మరీ మంగళగిరి ప్రజల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేశాను. మహిళాసాధికారత విషయంలో తాత ఎన్టీఆర్‌, నాన్న చంద్రబాబు నుంచి స్పూర్తి పొంది స్త్రీశక్తి కేంద్రాలను ఏర్పాటుచేశాను. మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వడమేగాక వేలాదిమందికి కుట్టుమిషన్లు అందజేసి సొంతకాళ్లపై నిలబడేలా చేయగలిగాను. ఒకప్పుడు దేశంలోనే పేరెన్నికగన్న మంగళగిరి చేనేతమగ్గాలు కనుమరుగవుతున్న సమయంలో అధునాతన మగ్గాలతో వీవర్స్‌ శాలను ఏర్పాటుచేశాను. టాటా తనేరియాతో ఒప్పందం చేసుకుని టెక్నాలజీ, మార్కెటింగ్‌ మద్దతునిచ్చాను. చేనేత సోదరుల జీవితాల్లో మార్పుతెచ్చి, వారి ఆదాయం పెంచేందుకు నా శాయశక్తులా కృషిచేశాను. స్వర్ణకారుల కోసం సొసైటీ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు నిర్వహించాను. చివరకు పేదింట్లో కుటుంబసభ్యులు చనిపోతే మట్టిఖర్చులు కూడా ఇచ్చి ఇంటికి పెద్దకొడుకులా నిలబడ్డాను.

చేయాల్సింది చాలా ఉంది….!
ఒక వ్యక్తిగానే ఇంత చేసిన నన్ను శాసనసభకు పంపితే ఏవిధంగా సేవచేస్తానో చైతన్యవంతులైన మంగళగిరి ప్రజలు ఆలోచించాలి. వ్యక్తిగతంగా ఎంతచేసినా…మంగళగిరి రూపురేఖలు మార్చడానికి నేను చేయాల్సింది చాలాఉంది. రచ్చబండ కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించిన నేను క్షేత్రస్థాయి సమస్యలపై పూర్తిగా అధ్యయనం చేశాను. కొండప్రాంతాలు, రైల్వేస్థలాలు, దేవాదాయ, అటవీభూముల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదలు పట్టాల్లేక అవస్థలు పడుతున్నారు. కృష్ణానది చెంతనే ఉన్నా ఇప్పటికీ వేసవికాలంలో గుక్కెడు నీటికోసం ఇబ్బందిపడే పరిస్థితులను కళ్ళారా చూశాను. డ్రైనేజి సౌకర్యంలేక మంగళగిరి, తాడేపల్లి పట్టణాల్లో అపార్ట్‌మెంట్‌ వాసులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. గ్రామాల్లోని రహదారులు నడుములోతు గోతులతో అస్తవ్యస్తంగా తయారయ్యాయి. శ్మశానవాటికల్లో స్థలం లేక చనిపోయిన వారికి గౌరవంగా అంతిమసంస్కారాలు సైతం నిర్వహించలేకపోతున్నామని వివిధ గ్రామాల ప్రజలు చెబుతున్నపుడు ఎంతో ఆవేదన చెందాను. అధికారంలోకి వచ్చాక మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న వారికి పూర్తి హక్కు కల్పిస్తూ ఇళ్ల పట్టాలు, పేదలకు 20 వేల ఇళ్లు, స్వర్ణకార కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని మాట ఇస్తున్నాను. మంగళగిరిని దేశంలోనే నెం.1గా తీర్చిదిద్ది, పేదరికం లేని మంగళగిరిని చూడాలన్నదే నా సంకల్పం. అందరం కలసి ఆదర్శ మంగళగిరిని తయారు చేసుకుందాం. ఈనెల 13వతేదీన జరగబోయే ఎన్నికల్లో మీ ఇంటిబిడ్డలా ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపండి.

మీ
నారా లోకేష్‌,
మంగళగిరి టీడీపీ అభ్యర్థి.

Tags: తెదెపాతోనే ఏపీ అభివృద్ధిబహిరంగ లేఖమంగళగిరి నియోజకవర్గంమన మంగళగిరి మన లోకేష్యువనేత నారా లోకేష్‌
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 11-05-2024

Next Post

జగన్‌ వేధింపులతో పరిశ్రమలు పరార్‌!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

November 2, 2026
ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

November 2, 2026
విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

November 2, 2026
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా
ఆంధ్రప్రదేశ్

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

November 2, 2026
తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

November 2, 2026
బీసీలకు 40% సీట్లు
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ పునరుద్ధరణ పనులకు సిబ్బందిని పంపండి

November 2, 2026
Next Post
ఎన్టీఆర్‌ విగ్రహం ధ్వంసం సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు

జగన్‌ వేధింపులతో పరిశ్రమలు పరార్‌!

ముఖ్య వార్తలు

  • ముఖ్య వార్తలు
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026
0

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026
0

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

by చైతన్యరధం
October 30, 2026
0

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025
0

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026
0

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026
0

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

‘మన మిత్ర’

‘మన మిత్ర’

by చైతన్యరధం
January 31, 2025
0

ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

by కార్యకర్త
November 2, 2026
0

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రజాస్వామ్యం గురించి జగన్‌రెడ్డి నీతులు చెబుతున్నారు పులివెందులలో ఉద్దేశపూర్వకంగానే సమస్య సృష్టించారు నాడు ఏకగ్రీవాలు ఎలా చేశారో అందరూ ప్రశ్నించాలి ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీ ఏ...

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

by చైతన్యరధం
November 2, 2026
0

రాప్తాడు ఘటన నేపథ్యంలో కౌన్సెలింగ్ 20 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా లోకేష్ చర్యలు అమరావతి(చైతన్యరథం):...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.