- సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.3 లక్షల సాయం అందజేత
అమరావతి (చైతన్య రథం): క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తున్న వ్యక్తికి విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. గుంటూరు జిల్లా ధర్మకోటకు చెందిన గార్లపాటి బ్రహ్మయ్య క్యాన్సర్ బారినపడి కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్యానికి రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో ఆదుకోవాలని బ్రహ్మయ్య కుటుంబ సభ్యులు ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు. తక్షణమే స్పందించిన మంత్రి నారా లోకేష్.. సీఎం సహాయ నిధినుంచి రూ.3 లక్షల ఎల్వోసీ మంజూరు చేసి అండగా నిలిచారు. సాయం కోరిన వెంటనే స్పందించి ప్రాణాలు నిలిపిన మంత్రి నారా లోకేష్‌కు బ్రహ్మయ్య, కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.