- గుమ్మడి గోపాలకృష్ణ ఆలపించిన “తెలుగునేల పుణ్యఫలం” పాట విడుదల
మంగళగిరి (చైతన్యరథం) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న దార్శనికుడు చంద్రబాబు నాయుడు క్షేమంగా, ఆరోగ్యంగా నూరేళ్లు వర్ధిల్లాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షించాయి. వేడుకల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జాతీయ ఉపాధ్యక్షుడు టీడీ జనార్దన్, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్‌బాబు సహా పలువురు కీలక నేతలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరపుకున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ… “చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ స్వర్ణాంధ్రగా మారుతుందని, ఆయన అనుభవం రాష్ట్ర భవిష్యత్తుకు శ్రీరామరక్ష” అని కొనియాడారు. కార్యకర్తల కేరింతలు, నినాదాలతో పార్టీ కార్యాలయం పండుగ వాతావరణాన్ని తలపించింది. అనంతరం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయాలు, ప్రజా సంక్షేమంపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, పొలిట్‌బ్యూరో మాజీ సభ్యుడు టీడీ జనార్దన్ రచించిన ‘మన చంద్రన్న`2’ పుస్తకాన్ని అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. తొలి కాపీని సీఎం చంద్రబాబుకి జనార్దన్ అందజేశారు. అనంతరం ఏపీ నాటకరంగ అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ స్వయంగా రచించి పాడిన “తెలుగునేల పుణ్యఫలం చంద్రబాబునాయుడు” వీడియో పాటను విడుదల చేశారు. ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో చంద్రబాబునాయుడు 76 వసంతాలకు గుర్తుగా 76 కిలోల భారీ కేక్ కట్ చేశారు. సీఎం జన్మదినం సందర్భంగా పార్టీ కార్యాలయంలో మిఠాయిలు పంపిణీ చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్‌బాబు, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ, ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్ పీతల సుజాత, ఏపీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఏపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి బోర్డు చైర్మన్ కృష్ణయ్య, ఏపీ ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కేకే చౌదరి, నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మాల్యాద్రి, శ్రీశైలం ఆలయ కమిటీ మెంబరు ఏవీ రమణ, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి పాతర్ల రమేష్, అన్నవరం దేవస్థానం ట్రస్టు బోర్డు మెంబరు రావిపాటి సత్యనారాయణ, గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వందనదేవి, మీడియా కో`ఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, నేతలు వేమూరి ఆనందసూర్య, బోద్దులూరి వెంకటేశ్వరరావు, చప్పిడి రాజశేఖర్, చెన్నుపాటి గాంధీ, పర్చూరి కృష్ణ, వల్లూరి కిరణ్ తదితరలు పాల్గొన్నారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కేకే చౌదరి, నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మాల్యాద్రి, శ్రీశైలం ఆలయ కమిటీ మెంబరు ఏవీ రమణ, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి పాతర్ల రమేష్, అన్నవరం దేవస్థానం ట్రస్టు బోర్డు మెంబరు రావిపాటి సత్యనారాయణ, గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వందనదేవి, మీడియా కో`ఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, నేతలు వేమూరి ఆనందసూర్య, బోద్దులూరి వెంకటేశ్వరరావు, చప్పిడి రాజశేఖర్, చెన్నుపాటి గాంధీ, పర్చూరి కృష్ణ, వల్లూరి కిరణ్ తదితరలు పాల్గొన్నారు.















