- పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులతో ముఖాముఖి
- వ్యర్థాలు సేకరించే విధానంపై స్కూబా డైవర్లతో ఇంటరాక్షన్
- అదనపు ఆదాయం వస్తోందని వివరించిన మత్స్యకారులు
- ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ పైలట్ సైట్ ప్రారంభం
విశాఖపట్నం(చైతన్యరథం): స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్ర మంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ను సంద ర్శించారు. అక్కడ నిర్వహిస్తోన్న సాగర తీర స్వచ్ఛత కార్యక్రమాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసు కున్నారు. కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్న మత్స్యకారులు, పారిశుద్ధ్య కార్మికులు, స్కూబా డైవర్ల తో మాట్లాడారు. బీచ్ శుభ్రత, సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, సముద్రగర్భంలోని వ్యర్థాల తొలగింపు తదితర కార్యక్రమాలను పరిశీలించి వాటిలో భాగ స్వాములైన వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి బీచ్ శుభ్రతలో పాల్గొని తీర ప్రాంతాన్ని పరిశు భ్రంగా ఉంచేందుకు వారు చేపడుతున్న విధానాలను పరిశీలించారు. అనంతరం మత్స్యకారులతో మాట్లాడి చేపల వేటతోపాటు సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్న విధానాన్ని తెలుసుకున్నారు. ప్రత్యేక వలల తో చేపల వేట సమయంలోనే ప్లాస్టిక్ వ్యర్ధాలను సేక రించి ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్కు తరలిస్తున్నా మని మత్స్యకారులు సీఎంకు వివరించారు. సేకరించి న వ్యర్థాలను డిజిటల్ తూకంపై బరువు కొలుస్తున్నా మని… దాని ఆధారంగా ప్రోత్సాహకం అందుతోం దని.. ఇది తమకు అదనపు ఆదాయమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 1,200 సముద్ర ప్లాస్టిక్ను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. అనంతరం సముద్రంలో ప్లాస్టిక్ సేకరించి డిజిటల్ తూకం వేసే విధానాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించి వ్యర్ధాలసేకరణ ద్వారా వచ్చే ప్రొత్సాహాన్ని మత్స్యకారులకు అందజేశారు.
సాగర తీరం.. సముద్ర గర్భంలోనూ స్వచ్ఛత కార్యక్రమాలు
మత్స్యకారులతో మాట్లాడిన అనంతరం సీఎం అక్కడే ఉన్న స్కూబా డైవర్లతో సముద్ర వ్యర్థాలను తొలగించే విధానంపై అడిగి తెలుసుకున్నారు. సముద్ర గర్భంలో రాళ్ల మధ్య, తీరానికి సమీప ప్రాంతాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్, పాడైన చేపల వలలు, సీసాలు, ప్యాకేజింగ్ వ్యర్థాలను తొలగిస్తున్న విధానాన్ని స్కూబా డైవర్లు సీఎంకు వివరించారు. మత్స్యకారుల పడవలతో కలిసి ఉపరితలంతోపాటు
సముద్రగర్భంలోనూ వ్యర్థాలను సేకరిస్తున్నామని తెలి పారు. నీటి లోపల నిర్వహిస్తున్న శుభ్రత కార్యక్రమా నికి సంబంధించిన దృశ్యాలను సీఎంకు చూపించారు. అనంతరం జీవీఎంసీ ఏర్పాటుచేసిన ప్రదర్శన శాలను సీఎం సందర్శించారు. మురుగు కాల్వలు, మ్యాన్ హోళ్ల శుభ్రతకు వినియోగించే సీవరేజ్ రోబోలను పరిశీలించారు. మెషిన్ల సాయంతో పారిశుద్ధ్య కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈ పరికరాలను వినియోగిస్తున్నట్లు అధికారులు వివరించారు. విశాఖ లో సముద్ర, తీర ప్రాంతాల శుభ్రతకు జీవీఎంసీ చేపడుతున్న ఇతర కార్యక్రమాలకు సంబంధించిన వీడియో ప్రజెంటేషన్ను సీఎం తిలకించారు. ఈ సందర్భంగా బ్లూమ్బెర్గ్ ఫిలాంత్రపీస్ ప్రతినిధులు
సీఎంను కలిసి సాగర స్వచ్ఛత ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. జీవీఎంసీ ప్రాజెక్టుకు లభించిన గ్లోబల్ గుర్తింపు, ప్రాజెక్టు లక్ష్యాలను వివరించారు. పెద జాలరిపేటలో సుమారు 185చదరపు మీటర్ల విస్తీర్ణం లో ఏర్పాటుచేయనున్న ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్
పైలట్ సైట్ను సీఎం వర్చువల్గా ప్రారంభించారు.
ఒంటరి మహిళకు పెన్షన్ ఇవ్వాలని ఆదేశం
ఇదే సందర్భంలో ఆర్కే బీచ్ లో మురిమిక్చర్ విక్రయిస్తున్న ఓ మహిళను సీఎం పలకరించారు. ఆమె వ్యాపారం, జీవనోపాధి గురించి అడిగి తెలుసు కున్నారు. మురిమిక్చర్ను రుచి చూసి చూశారు. ఆమె ఒంటరి మహిళ అని తెలుసుకుని పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.











