- ఇబ్బందులను సమర్ధవంతంగా అధిగమించారని ప్రశంస
అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం ఫోను చేశారు. వారం రోజుల వ్యవధిలో రాష్ట్రానికి రెండు తుఫాన్ల తాకిడి నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబు ప్రధానికి వివరించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా రైతులకు భారీ నష్టం వాటిల్లిందని సీఎం చెప్పారు. రహదారులు, విద్యుత్ సరఫరా సహా వివిధ రంగాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని… ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగిన సాయం అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తుఫాను సహయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం బాగా పని చేసిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. నిరంతర అప్రమత్తతతో తుఫాను వల్ల వచ్చిన ఇబ్బందులను సమర్ధవంతంగా అధిగమించారంటూ సీఎం చంద్రబాబును ప్రధాని ప్రశంసించారు.



















