- టీచర్లపై సాక్షి మీడియా దౌర్జన్యం దారుణం
- బాధ్యులపై కేసులు నమోదు చేయాలి
- అత్యంత పారదర్శకంగా మెగా డీఎస్సీ
- ఎమ్మెల్యే కూన రవికుమార్
అమరావతి (చైతన్యరథం): యువనేత నారా లోకేష్‌ను చూస్తే జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుందని అందుకే అత్యంత పారదర్శకంగా జరిగిన మెగా డీఎస్సీపై సాక్షి మీడియాలో పదే పదే అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ ధ్వజమెత్తారు. తరగతి గదుల్లో విద్యార్థుల ముందే టీచర్లను బెదిరించి కించపరిచేలా వ్యవహరిస్తున్న సాక్షి మీడియాపై తక్షణమే కేసులు నమోదు చేయాలని రాష్ట్ర డీజీపీని కోరారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వని జగన్.. నేడు డీఎస్సీలో ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన వారిని అవమానించడం దారుణమని విరుచుకుపడ్డారు.
ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా నేడు విష ప్రచారం
జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తే.. నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 16000కు పైగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాం. మెగా డీఎస్సీపై వైసీపీ నాయకులు 345 కేసులు వేసినప్పటికీ సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే రికార్డు సమయంలో 148 రోజుల్లోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేశాం. జగన్మోహన్ రెడ్డి భయంకరమైన ఫోబియాతో బాధపడుతున్నారు. యువ నాయకుడు నారా లోకేష్ నీడ చూసి కూడా భయపడే పరిస్థితి ఉంది. ఒక అబద్ధాన్ని వెయ్యి సార్లు చెప్పి నిజం అని భ్రమింపజేసేందుకు సాక్షి మీడియా ప్రయత్నిస్తోంది. నిరుద్యోగులు అహర్నిశలు కష్టపడి వాళ్ల ప్రతిభతో ఉద్యోగాలు సాధిస్తే వారిని అవమానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వస్తే రాష్ట్ర ప్రజలకు ఫన్నీ టైమ్. ఏపీపీఎస్సీకి, డీఎస్సీ కి తేడా తెలియని ఏకైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారు. ఆఖరి సంవత్సరంలో 6,100 డీఎస్సీ ఉద్యోగాలు ఇస్తానని భ్రమలు కల్పించారు. ఆ నోటిఫికేషన్ లోనే రెండు సంవత్సరాల పాటు అప్రెంటీస్ గా పరిగణిస్తామని చెప్పి దగా చేశారు.
జగన్ ఇచ్చిన నోటిఫికేషన్ ఎంత దగా అంటే 2009 తర్వాత ఆర్టీఈ చట్టం ప్రకారం. ఉపాధ్యాయ నియామకాల్లో అప్రెంటీస్ విధానం అనేది తీసేశారు. అయనప్పటికీ కుట్రప ప్రకారం జగన్ రెడ్డి కావాలనే తప్పుల తడకగా నోటిఫికేషన్ ఇచ్చారని ఎమ్మెలే రవికుమార్ విమర్శించారు. 2023 సంవత్సరంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా హారిజంటల్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఆ జీవోని ప్రస్తుతం మేము అమలు చేసి మెగా డీఎస్సీని నిర్వహించాం. ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వని వ్యక్తి ఇవాళ సీబీఐ పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ ఫైల్‌పై మొదటి సంతకాన్ని పెట్టారు. ఆ డీఎస్సీని నిజం చేయడానికి అహర్నిశలు కష్టపడిన వ్యక్తి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.
ఈ రోజు కష్టపడి యువత ఉద్యోగాలు సాధిస్తే సాక్షి ఫేక్ ఛానల్ తో అసత్య ప్రచారాలు చేస్తున్నారు.
స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన ఉద్యోగాలన్నీ 2024 సంవత్సరానికి ముందు ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ గేమ్స్‌లో ఆడిన వారే. నేషనల్ గేమ్స్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నడుస్తాయి. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ మినిస్ట్రీ నుంచి కూడా అధికారులు హాజరవుతారు. వాళ్ల ఆధ్వర్యంలో నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతాయి. అలాగే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ నేషనల్ స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ నుంచి అధికారులు కూడా ఇంటర్నేషనల్ గేమ్స్ కి పర్యవేక్షకులుగా వెళతారు.
డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన వారు ఎక్కువ మంది 2024 ముందు పతకాలు సాధించిన వారే. ఆ నియామకాలు ఫేక్ అయితే నాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఫేక్ అవుతాడు. అసత్యాలు ప్రచారం చేసే అధికారం సాక్షి మీడియాకు లేదు. ప్రతిభతో వాళ్ళు ఉద్యోగాలు సాధిస్తే… వాళ్ళు బోధిస్తున్న స్కూళ్లకు వెళ్లి, క్లాస్ రూమ్‌లకు వెళ్లి వాళ్లను బెదిరించి, చిన్న పిల్లల ముందు వాళ్లని చిన్నబుచ్చే విధంగా ఇంటర్వ్యూలు చేస్తున్నారు. సాక్షి పేపరు పైనా, సాక్షి ఛానల్ పైనా, ఉపాధ్యాయులను చిన్నబుచ్చే విధంగా ఇంటర్వ్యూలు చేసి రౌడీయిజాన్ని ప్రదర్శించిన వాళ్లపై కేసులు పెట్టాలని డీజీపీని రవికుమార్ కోరారు.
జగన్మోహన్ రెడ్డిలా నేను ఫేక్ కాదు. 10వ తరగతి పేపర్లు అమ్ముకున్న వాణ్ణి కాదు. జగన్ కుటుంబ సభ్యులలాగా 2006లో డీఎస్సీ జరిపి, కడప జిల్లాలో ఆ రోజు పేపర్లు మార్చి, లక్షలాది రూపాయలు దండుకునే బ్యాచ్ మాది కాదు. అధికారులను బలి పశువులు చేసే వ్యక్తులం మేము కాదు. గ్రూప్-1ని అపహాస్యం చేసి, రిక్షా వాళ్లు, ఆటో డ్రైవర్లతో, స్వీపర్లతో పరీక్ష పేపర్లు దిద్దించిన ఫేక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రవికుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.













