- మావిగన్ అంటూ జగన్ కొత్త డ్రామా
- రాజధానిపై మాటలు బాధ్యతారాహిత్యం
- రాష్ట్ర భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు
- ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): జగన్‌రెడ్డి తన ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలు చూస్తే రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ గందర గోళమే ఎక్కువగా కనిపిస్తుందని, ఆయన ఏం మాట్లాడారో ఆయ నకే తెలియని పరిస్థితి అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యాఖ్యా నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ కొత్తగా రేపటి ఎన్నిక ల్లో అమరావతి- మావిగన్ మధ్య పోటీ” అనే నినాదాన్ని తీసుకొచ్చారు. ఇది అమరావతికి, మావిగన్‌కు మధ్య పోటీ కాదు. భవిష్యత్‌ను నిర్మించే విజనరీ నాయకత్వానికి, రాష్ట్రాన్ని అయోమ యంలోకి నెట్టే విధ్వంస రాజకీయాలకు మధ్య పోటీ. అభివృద్ధికి- అరాచకానికి మధ్య పోటీ. సంక్షేమానికి- విధ్వంసానికి మధ్య పోటీ అని స్పష్టం చేశారు.
అమరావతిపై జగన్ అసలు వైఖరి ఏమిటి?
ఒకప్పుడు అమరావతి రాజధానిపై తనకు ఎలాంటి అభ్యంత రం లేదని జగన్ ప్రకటించారు. ఆ తర్వాత మూడు రాజధానుల సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ “మావిగన” పేరుతో మరో కొత్త నినాదం తీసుకొచ్చారు. అసలు ఆయన వైఖరి ఏమిటి? రాష్ట్ర ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారో ఆయనకే స్పష్టత లేదు. ఈరోజు భారతదేశంలో జాతీయ రహదా రిపై రాజధాని నిర్మించిన రాష్ట్రం ఒక్కటీ లేదు. కానీ జగన్ మాత్రం హైవేపై రాజధాని నిర్మిస్తానని చెబుతున్నారు. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో 50 వేల ఎకరాలకు పైగా భూమిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు వేల కోట్ల రూపా యల పెట్టుబడులు పెట్టాయి. 15 జాతీయ బ్యాంకులు, అందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అమరావతిలో కార్యకలాపా లకు సిద్ధమవుతోంది. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు, జాతీయ స్థాయి సంస్థలు, బ్యాంకులు, మౌలిక వసతులు ఏర్పడుతున్న ఈ సమయంలో వాటిని బుల్డోజర్‌తో తొక్కేస్తానన్నట్లుగా జగన్ మాట్లాడటం అత్యంత బాధ్యతారాహిత్య మని ధ్వజమెత్తారు.
రాజధానికి దేశవ్యాప్తంగా మద్దతు
అమరావతి కేవలం ఒక నగరం కాదు. అది ఐదు కోట్ల ఆం< óŠప్రరదేశ్ ప్రజల ఆకాంక్ష. భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర రాజధాని అంశంపై లోక్‌సభలో ఇంత విస్తృతంగా మద్దతు లభించడం అరుదైన విషయం. బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, జనసేన, టీఎంసీ, ఆప్, బీఆరఎస్, సమాజ్‌వాదీ పార్టీ, బీజేడీ, ఆర్జేడీ, జేడీయూ, శివసేనతో పాటు 20కి పైగా రాజకీయ పార్టీలు అమరావతికి ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాయి. దేశం మొత్తం అమరావతి వెనుక నిలిస్తే, వైసీపీ మాత్రం ఆ చర్చను బహిష్కరిం చి బయటకు వెళ్లిపో యింది. రైతుల త్యాగాలతో నిర్మితమవుతున్న రాజధానికి దేశమంతా అండగా నిలబడితే, జగన్ మాత్రం దాన్ని వ్యతిరేకించి రాష్ట్ర ప్రజల మనోభావాలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమరావతి రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు, మహిళలు చేసిన ఉద్యమాలు, ఆత్మహత్యలు, కుటుంబాలు అనుభవించిన వేదన రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. అలాంటి రైతుల భూముల విలువ పడిపోవాలని, వారి ప్లాట్లను ఎవరూ కొనకూడదని కుట్ర రాజకీయాలు చేస్తున్న సైకో పార్టీని ప్రజలు క్షమించరని హితవుపలికారు.
అమరావతికి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ ప్లానిం గ్ అండ్ ఆర్కిటెక్చర్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, ఇగ్నో రీజినల్ సెంటర్, జాతీయ, అంతర్జాతీయ స్థాయి డీమ్డ్ యూనివర్సిటీలు, ఇంటర్నేషనల్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థలు, ఎన్విడియా భాగస్వామ్యంతో ఏఐ యూనివర్సిటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు అమరావతికి వస్తున్నాయి. ఇవన్నీ రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంటే దానిని జీర్ణించుకోలేక కొత్త కొత్త నినాదాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయ డం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
ప్రజావేదికను కూల్చినట్టే అమరావతిని కూలుస్తారా?
ప్రస్తుతం అమరావతిలో రూ.57,821 కోట్ల విలువైన 97 రకా ల అభివృద్ధి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. క్వాంటమ్ వ్యాలీ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే దిశగా ముందుకు సాగుతున్నాయి. ప్రజావేదికను కూల్చిన ట్టే అవకాశం వస్తే అమరావతి అభివృద్ధిని కూడా అడ్డుకుంటామని సంకేతాలు ఇవ్వడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధం. జగన్‌రెడ్డి ఆలోచన చూస్తుంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్మితమవుతున్న అమరావతిని ఎలా అడ్డుకోవాలనే దానిపైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. వేల కోట్ల రూపాయలతో ప్రైవేట్ సంస్థలు, జాతీయ విద్యాసంస్థలు, బ్యాంకులు, పరిశ్రమలు అమరావతిలో పెట్టుబడు లు పెడుతున్నాయి. ఎకరాకు రూ.10 కోట్లు విలువ అనుకున్నా భూమి విలువ, ప్రభుత్వ భవనాలు, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, న్యాయమూర్తుల క్వార్టర్స్, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యాసంస్థలు, ప్రైవేట్ నిర్మాణాలు అన్నీ కలిపితే లక్షల కోట్ల రూపాయల ప్రజల ఆస్తి అక్కడ ఏర్పడుతోంది. అటువంటి ప్రజల ఆస్తిని ధ్వంసం చేయాలని మాట్లాడటానికి జగన్‌కు ఎలా మనసు వస్తోంది? అని ప్రశ్నించారు.
జంగిల్ రాజ్ పాలన ఎవరిది?
జగన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను జంగిల్ రాజ్ అంటున్నారు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? జగన్ పర్యటనల కోసం చెట్లు నరికించారు. కిలోమీటర్ల కొద్దీ పరదాలు కట్టించారు. 50 నుండి 100 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ను నిలిపివేశారు. 2,000 మంది పోలీసులతో భద్రత కల్పించుకు ని ప్రజల్లోకి వెళ్లేవారు. బీహార్, ఉత్తరప్రదేశ్‌లను జంగిల్ రాజ్ అని విమర్శించిన జగన్.. తన పాలనలో మాత్రం ప్రజలకు కనిపించ కుండా పరదాల వెనుక తిరిగారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఎలాంటి పరదాలు లేవు.. చెట్లు నరికించడం లేదు.. ట్రాఫిక్‌ను గంటల తరబడి ఆపడం లేదు. అదే చంద్రబాబు పరిపాలనకు, జగన్ పాలనకు ఉన్న తేడా అని తెలిపారు.
చంద్రబాబు అభివృద్ధికి ప్రతీక
రాష్ట్ర భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకు 16 నుంచి 17 గంటలు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పంచాయతీరాజ్ వ్యవస్థకు కొత్త ఊపునిస్తున్నారు. లోకేష్ ప్రపం చంలోని వివిధ దేశాల్లో పర్యటిస్తూ లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకు వస్తున్నారు. యువతకు ఉపాధి, పరిశ్రమలు, పెట్టుబడులు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. దీనికి భిన్నంగా వైసీపీ మాత్రం అభివృద్ధిని అడ్డుకోవడం, పెట్టుబడులను భయపెట్టడం, రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీయడంపైనే దృష్టి పెట్టిందని మండిపడ్డారు.
















