- రూ.3.3 కోట్ల వ్యయంతో నిర్మాణం
- ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
మంగళగిరి(చైతన్యరథం): కాజ గ్రామంలోని ఉప్పలపాడు-నంబూరు-కాజ రోడ్డు మార్గంలో ఆధునిక హంగులతో నిర్మించిన కాజ ఈస్ట్ లేక్ పార్క్‌ను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందుగా కాజ లేక్ పార్క్‌కు చేరుకున్న వారికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఈస్ట్ లేక్ పార్క్ ను ప్రారంభించి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. పార్క్ ప్రారంభో త్సవాన్ని పురస్కరించుకుని మొక్క నాటారు. అనంతరం పార్క్ మొత్తం కలియతిరిగి వసతులను పరిశీలించారు. సెల్ఫీ తీసుకు న్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన పర్యావరణం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించాలనే లక్ష్యం తో మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా ఈస్ట్ లేక్ పార్క్‌ను నిర్మించారు. సెల్‌కాన్ సంస్థ రూ.3.3 కోట్ల సీఎసఆర్ నిధులతో ఈ పార్క్‌ను అభివృద్ధి చేశారు.
17.18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు చుట్టూ ఆధునిక హంగులతో పార్క్‌ను తీర్చిదిద్దారు. ఇప్పటికే ఉన్న చెరువు కట్టను 1.7 కిలోమీటర్ల మేర బలోపేతం చేశారు. పార్క్‌లో 42 రకాల జాతులకు చెందిన మొత్తం 12,800 మొక్కలను నాటారు. 1.7 కిలోమీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఓపెన్ జిమ్, చిన్నారుల కోసం ప్రత్యేక ప్లే ఏరియా, భద్రత కోసం ట్రాక్‌కు ఇరువైపులా జీఐ చైన్- లింక్ మెష్ ఫెన్సిం గ్, ఆధునిక సుందరీకరణ పనులు చేపట్టి పార్క్‌ను ఆకర్షణీయం గా తీర్చిదిద్దారు. వాకింక్ ట్రాక్ వెంట విద్యుత్ దీపాల సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్, మండల పార్టీ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, మంగళగిరి ఏఎంసీ చైర్మన్ జవ్వాది కిరణ్ చందు, ఏపీ సివిల్ సప్లైస్ కార్పోరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్యతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నా రు. అనంతరం అందరితో కలిసి ఫొటోలు దిగారు.
















