- మరోసారి జగన్‌రెడ్డికి లోకేష్ సవాల్
- పదేపదే అబద్ధాలు చెప్పి నమ్మించలేరు
- ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీని ఆపలేరని స్పష్టం
మంగళగిరి(చైతన్యరథం): మెగా డీఎస్సీపై బహిరంగ చర్చకు సిద్ధమని జగన్‌రెడ్డికి మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీని ఆపలేరని స్పష్టం చేశారు. మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించాం. హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ ను అధ్యయనం చేసి కచ్చితమైన నోటిఫికేషన్ ఇచ్చాం. 150 రోజుల్లో 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. మళ్లీ టెట్ పరీక్ష నిర్వహిస్తున్నాం..ఆ తర్వాత మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్లీ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. సాక్షి క్యాలెం డర్ కాదు.. 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. మొదటిసారి హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేశాం. దీని గురిం చి తెలుసుకోవాల్సిన బాధ్యత యువతపై ఉంది. హారిజాంటల్ రిజర్వేషన్ పాటించకపోతే సబర్వాల్ జడ్జిమెంట్ అనేది ఉంది. ఆ జడ్జిమెంట్‌ను అడ్డం పెట్టుకుని వైసీపీనే కోర్టులో వేసి స్టే తీసుకు వస్తారు.
వైసీపీ నాయకులే డీఎస్సీపై 240 కేసులు వేశారని గుర్తుచేశారు. ఐదేళ్లలో జగన్‌రెడ్డి ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏమిటో అర్థమై ఉండేది. ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ కులం కార్డు కూడా తీసుకు వచ్చారు. దౌర్భాగ్యం ఏమిటంటే 2014-19 మధ్య కూడా డీఎస్పీ ప్రమోషన్లలో ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇచ్చారని దుష్ప్ర చారం చేశారు. ప్రజలు కూడా నమ్మారు. తర్వాత వాస్తవాలు బహిర్గతమయ్యాయి. ఇప్పుడు కూడా పనికిమాలిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని ముందుపెట్టుకుని స్పోర్ట్స్ కోటాలో ఒకే సామాజికవర్గం వారికి ఉద్యోగాలు ఇచ్చారని దుష్ప్రచారం చేస్తున్నారు. మేం వాస్త వాలు బహిర్గతం చేశాం. సదరు వ్యక్తి కమాపణలు చెప్పాలి కదా. బురదజల్లి పారిపోతున్నారు. జగన్‌రెడ్డి ఇంటికి 200 మీటర్ల దూరంలోనే ఉన్నా ఎప్పుడైనా చర్చకు సిద్ధమే. మా సమాధానా లపై జగన్‌రెడ్డి స్పందించాలని సవాల్ విసిరారు.
















