- ప్రమాదం జరిగిన వెంటనే తక్షణమే స్పందించాం
- నేడు రప్పారప్పా బ్యాచ్ వచ్చి డ్రామాలు ఆడుతున్నారు
- స్టీల్ ప్లాంట్ పేరెత్తే అర్హత జగన్‌రెడ్డికి లేదు
- హోంమంత్రి వంగలపూడి అనిత ధ్వజం
విశాఖపట్నం(చైతన్యరథం): విశాఖ జిల్లా తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి రాత్రి 7:15కి చేరుకున్నాం. అప్పటికే అధికారులు సహాయక చర్యలు చేస్తున్నారని వివరించారు. ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ప్రమాదం జరిగిన ఆరు గంటల్లోనే వచ్చారని తెలిపారు. మృతుల కుటుంబాలకు భరోసా కల్పించారని చెప్పారు. ఈరోజు పులివిందుల ఎమ్మెల్యే వచ్చారు. హాస్పిటల్ దగ్గరకు వెళితే రప్పారప్పా బ్యాచ్ అరుపులు వినిపిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ అనే పదం పలకడానికి కూడా అర్హత లేని వ్యక్తి జగన్‌రెడ్డి. జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు రాజధానికి వినియోగిద్దామ న్నారని సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు ధర్నా చేస్తుంటే ఒక్క రోజు ధర్నా దగ్గర జగన్ వెళ్లలేదు. పైగా వారిని ఎయిర్పోర్ట్క పిలిపించి మాట్లాడారు.
ఈ రోజు కూడా కార్మికసంఘాల నాయకులను పిలిపించి మాట్లా డించుకు న్నారు. కార్మికులకు రూ.60 లక్షల నుంచి కోటి ఇన్సూరెన్స్ రూపంలో వస్తున్నాయి. మొదటిసారి మృతుల్లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికుడి కుటుంబంలో ఒక్కరికి రెగ్యులర్ ఉద్యోగం ఇచ్చే నిర్ణయం ఉక్కు మంత్రి కుమారస్వామి తీసుకున్నారు. ప్లాంట్ చతికిలబడ్డ స్థితి నుంచి 99 శాతం ప్రొడ్యూషన్ వచ్చే స్థితికి వచ్చింది. ఎలీ పాలిమర్ ఇన్సూరెన్స్ 150 కోట్లు ఇస్తే కేవలం రూ.12 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గంగవరం పోర్టుకి 10.24 శాతం వాటా రాష్ట్రానికి ఇవ్వాలని ఉంది..ఆ వాటా కూడా వెనక్కి ఇచ్చేశారు. వైసీపీ ఐదేళ్లలో ఒక్కరోజైన ఉక్కు శాఖ మంత్రిని తీసుకుని రాగలిగారా? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్‌ను రక్షిం చింది కూటమి ప్రభుత్వమేనని, మృతిచెందిన కాంట్రాక్ట్ కార్మికులకు కూడా శాశ్వత స్టీల్ ప్లాంట్ ఉద్యోగం కల్పిస్తున్నామని తెలిపారు.















