ముంబయి: ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో డేటా సెంటర్లు నిర్వహిస్తున్న ప్రఖ్యాత హైపర్ స్కేల్ డేటా సంస్థ ఎయిర్ ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబయిలో సమావేశమ య్యారు. ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, జపాన్, మలేషియా, హాం కాంగ్, సింగపూర్లో ఎయిర్ ట్రంక్ భారీ డేటా సెంటర్లు నిర్మించి నిర్వహిస్తోంది. ఈభేటీలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… “ఏఐ, డేటా హైపర్ స్కేల్ హబ్ వైజాగ్ ఆవిర్భవిస్తోంది. గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ ఏఐ డేటా సెంటర్, అదానీ కనెక్స్ ఇతర ప్రధాన ప్రాజెక్టులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. డేటా సెంటర్ల ఏర్పాటుకు అన్ని విధాలా అనుకూలతలు కలిగిన విశాఖపట్నం డేటా సెంటర్ హబ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. విశాఖ నగరంలో 6 గిగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యం. మల్టీ-గిగావాట్ ఏఐ మౌలిక సదు పాయాలు, సంపూర్ణ ఎకో సిస్టమ్ అభి వృద్ధిపై మేం దృష్టిసారించాం.’ అన్నారు.
ఎయిర్ ట్రంక్ ఫ్యూచర్ క్యాంపస్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
భారతదేశంలో మరే ఇతర ప్రాంతాల్లోనూ లేని కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని, డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ కోసం రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు కూడా సిద్ధమవుతున్నాయని, ఏపీలో ఎయిర్ ట్రంక్ పెట్టుబడులు పెట్టాలని మంత్రి లోకేష్ కోరారు. ఎయిర్ ట్రంక్తో సంబంధాల పునరుద్ధరణ, భారతదేశంలో తదుపరి దశ విస్తరణ, AI- హైపర్ స్కేల్ మౌలిక సదుపాయాలు, ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రాధాన్య గమ్యస్థానంగా నిలిపే అంశంపై మంత్రి లోకేష్ చర్చించారు. రాబిన్ ఖుదా స్పందిస్తూ… ఎయిర్ ట్రంక్ ఇండియా ప్రణాళికలు, మినా క్లౌడ్ఆన్ఫ్రాను స్వాధీనం చేసుకున్న తర్వాత దాని ఏకీకరణ, భారతదేశంలో ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులు, విస్తరణ రోడ్మ్యప్, కీలక కస్టమర్ సేవలు, హైపర్ స్కేలర్ అవసరాలపై చర్చించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
భారతదేశంలో అగ్రగామి ఏఐ, హైపర్ స్కేల్ డేటా సెంటర్ హబ్గా అవతరించా లన్న ఆంధ్రప్రదేశ్ దార్శనికతపై గత ఏడాది అక్టోబరులో మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా తొలిసారి రాబిన్ ఖుదాతో అక్కడ సమా వేశమయ్యారు. ఆ తర్వాత భారతదేశంలో విస్తరణ గురించి ఎయిర్ ట్రంక్ బృందం ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులతో పలు మార్లు చర్చలు జరిపింది. భారతదేశంలో ఒక ప్లాట్ఫాం ఏర్పాటుచేశాక విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని ఎయిర్ ట్రంక్ బృందం తెలిపింది. ఏప్రిల్ 2026లో ఎయిర్ ట్రంక్ అధికారికంగా భారతదేశంలోకి ప్రవేశించింది. ముంబయి, చెన్నై, హైదరాబాద్లో ప్రాజెక్టులు కలిగి సుమారు 600 మెగావాట్ల సామర్థ్యంతో ప్రణాళికాబద్ధమైన పైడ్లైన్తో పాటు బ్లాక్ స్టోన్ మద్దతు గల డేటా సెంటర్ ప్లాట్ఫామ్ లుమినా క్లౌడ్ఆన్ఫ్రాను ఎయిర్ ట్రంక్ టేకోవర్ చేసింది. ఈ స్వాధీనం ఎయిర్ ట్రంకు తక్షణ కార్యకలాపాల స్థావరాన్ని అందిస్తుంది. ఆసియా పసిఫిక్ వ్యూహంలో భాగంగా భారతదేశాన్ని ఒక ప్రధాన వృద్ధి మార్కెట్గా ఎయిర్ ట్రంక్ గుర్తించింది.















