చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రపంచ విపణికి ఎంఎస్ఎంఈ ఉత్పత్తులు

ఎంస్ఎంఈ గ్రోత్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు

by చైతన్యరధం
May 26, 2026 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ప్రపంచ విపణికి ఎంఎస్ఎంఈ ఉత్పత్తులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి
  • సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
  • సైనింగ్-గ్రౌండింగ్-ఓపెనింగ్ విధానం అమలు
  • ప్రతీ రంగంలోనూ వాటికి పెట్టుబడి అవకాశాలు
  • జెన్-జీ కలల సాకారానికి కార్యాచరణ ప్రణాళిక
  • ఏపీ నుంచి 100 యూనికార్న్ కంపెనీలు లక్ష్యం
  • ఆధునిక టెక్నాలజీ ఎకోసిస్టమ్‌తో
  • గ్లోబల్ స్థాయిలో యువతకు అవకాశాలు
  • ఎంస్ఎంఈ గ్రోత్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు
  • 38 పారిశ్రామిక పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన
  • రూ.200 కోట్లతో ఏపీ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్
  • మెటా, అమెజాన్ సహా వివిధ సంస్థలతో ఒప్పందాలు
  • డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదిక ప్రారంభం

అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటైన ఎంఎసఎంఈల ద్వారా తయారైన ఉత్పత్తులు ప్రపంచ విపణికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడు స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిగా ఎంఎసఎంఈ రంగం ఉంది. భారీ పరిశ్రమలు దేశానికి ప్రతిష్ఠ తీసుకువస్తే.. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు లక్షల మంది కి జీవనోపాధిని కలిగిస్తాయని తెలిపారు. విజయవాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన ఎంఎసఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026కు ముఖ్యమంత్రి హాజరయ్యారు. అంతకుముందు 4.4 ఎకరాల్లో 1.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించి న అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఒకేసారి 1500 మంది హాజరై కార్యక్రమాలు నిర్వహించుకునేలా కన్వెన్షన్ సెంటర్ నిర్మించటం సంతోషమన్నారు. అమరావతిలోనూ ఈ తరహా కన్వెన్షన్ సెంటర్లను నిర్మించనున్నట్టు వెల్లడించారు. అంత ర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలో మరో ఐదు కన్వెన్షన్ సెంటర్లు నిర్మించనున్నట్టు తెలిపారు. ఎంఎసఎంఈ గ్రోత్ సమ్మిట్ సందర్భంగా రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభు త్వం ఇస్తున్న వెసులుబాట్లను, చేయూతను ముఖ్యమంత్రి వివరించారు.

కొత్త పరిశ్రమలకు శ్రీకారం చుట్టాలి
ఓ చిన్న ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే అవకాశం ఎంఎసఎంఈలకు మాత్రమే ఉంది. యువత కలలకు, మహిళ ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ఉన్న ఈ రంగం వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తోంది. ఏపీలో వనరులకు, అవకాశాలకు కొదవలేదు. వీటిని వినియోగించుకునేలా ఎంఎసఎంఈలకు అవ కాశాలు కల్పిస్తున్నాం. పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవేలు, రైల్వే లాంటి లాజిస్టిక్స్ కూడా ఏపీలో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ఎంఎసఎంఈ, ఎంట్రప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ, ప్రైవేటు పారిశ్రామిక పార్కుల పాలసీలు తెచ్చి ఈ రంగాన్ని ప్రోత్స హిస్తున్నాం. ఎంఎసఎంఈ సమ్మిట్ కొత్త ఆవిష్కరణలకు వేదిక కావాలి. కొత్త పరిశ్రమలకు శ్రీకారం చుట్టాలి. పారిశ్రామిక యానిట్లను పెద్దఎత్తున ఏర్పాటు చేసే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలోనూ 175 ఎంఎసఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే 100 పార్కులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఇవాళ మరో 38 ఎంఎసఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశాం. త్వరలో ఈ 138 పారిశ్రామిక పార్కులు సిద్ధం అవుతాయి. మిగిలిన వాటిని జూలై నాటికి శంకు స్థాపనలు చేసి అన్ని మౌలికవసతులూ కల్పిస్తాం. ఈ పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 10-07-2026

మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం

ఏపీసీఎంఈపీకు రూ.300 కోట్లు
ఈ సమ్మిట్ ద్వారా స్టార్టప్ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలు, నిపుణులు, బ్యాంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారులు ఒకే వేదికపైకి వచ్చారు. వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కింద పెద్దఎత్తున పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలి. రాష్ట్రంలో 20.77 లక్షల ఎంఎసఎంఈ యూనిట్లు ఉన్నాయి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.558 కోట్ల ప్రోత్సా హకాలు ఇచ్చాం. పీఎంఈజీపీ, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, పీఎం విశ్వకర్మ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేస్తూ ఎంఎసఎంఈలను ప్రోత్సహిస్తున్నాం. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్రోగ్రామ్ కింద రూ.300 కోట్లను కేటాయిస్తున్నాం. రూ.200 కోట్లతో ఏపీ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నాం. ఏపీఐఐసీలో ఎంఎసఎంఈ యూనిట్లు స్థాపించే ఎస్సీ,ఎస్టీలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నాం. 2024 జూన్ నుంచి ఇప్పటివరకూ 2953 ఎంఎసఎంఈ యూనిట్లు ఏర్పాటు అయ్యాయి. వీటి ద్వారా రూ.4.68 లక్షల కోట్ల పెట్టుబ డులు సమకూరాయి. ప్రైవేటు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తాం. ప్రైవేటు రంగంలో శ్రీసిటీ ఓ విజయవంతమైన పారిశ్రామిక పార్కు అని పేర్కొన్నారు.

ఏపీ నుంచి 100 యూనికార్న్ కంపెనీలు లక్ష్యం
రాష్ట్రంలో మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రభు త్వం కృషి చేస్తోంది. త్వరలో 5 లక్షల మంది డ్వాక్రా మహిళలను ఎంట్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దుతాం. మహిళా సంఘాల వద్ద ప్రసు తం రూ.28 వేల కోట్ల కార్పస్ ఉంది. ఏపీ నుంచి 100 యూని కార్న్ కంపెనీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్ కంపెనీలను ప్రోత్స హిస్తున్నామని తెలిపారు. ఏపీని ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నాం. విలేజ్ టు గ్లోబల్ మార్కెట్ అనేది ప్రభుత్వ నినాదం. గ్రామీణ ప్రాంతాలకు టెక్నాలజీ తీసుకు వెళ్లాలనే లక్ష్యంతో స్మార్ట్ విలేజ్ సెంటర్లను ప్రారంభిస్తున్నాం. ఓ పరిశ్రమ వ్యర్ధాలు మరో పరిశ్రమకు ముడి సరుకుగా మారుతుం ది. సర్క్యులర్ ఎకానమీపై ఎంఎసఎంఈలు దృష్టి పెట్టాలి. ఎంఎస్ ఎంఈలు ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాలన్న లక్ష్యంతో మెటా, అమెజాన్, జోహో లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చు కున్నా మని ముఖ్యమంత్రి తెలిపారు.

జెన్ జీ వర్గం యువత కలలు సాకారం చేస్తాం
మెటా, అమెజాన్ లాంటి సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందా లు యువత భవిష్యత్తుకు ఉపాధికి, నైపుణ్యాలకు కొత్త దారులు సృష్టిస్తాయి. మారుతున్న టెక్నాలజీ… ఉద్యోగాల స్వరూపాన్ని మారుస్తోంది. అందుకే టెక్నాలజీ స్కిల్ బిజినెస్ ఇంటిగ్రేషన్ మోడల్‌ను అనుసరిస్తున్నాం. పరిశ్రమలకు అనువైన స్కిల్ డెవలప్‌మెంట్‌పై దృష్టి పెట్టాం. ఆధునిక టెక్నాలజీ ఎకోసిస్టమ్ ద్వారా రాష్ట్ర యువతకు గ్లోబల్ స్థాయిలో అవకాశాలు అందుబా టులోకి వస్తాయి. ఏఐ, మెటలర్జీ, లాజిస్టిక్స్, క్లీన్ ఎనర్జీ ఏవియే షన్ లాంటి ఫంక్షనల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నాం… పరిశ్రమలకు నైపుణ్యాలు అందించే కేంద్రాలుగా ఇవి మారబో తున్నాయి. జెన్- జీ, జెన్- ఆల్ఫా, టీనేజర్లకు మేలు కలిగేలా వారి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. టెక్నాలజీతో పాటు ఆధ్యాత్మికత కూడా కీలకమైన అంశం. యువశక్తి, టెక్నాలజీ, పరిశ్రమల భాగస్వా మ్యంతో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధిస్తామని పేర్కొన్నారు.

వివిధ సంస్థలతో ఏపీఎంఎసఎంఈడీసీ ఒప్పందాలు
విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లతో ఏపీ అభివృద్ధి చేస్తున్నాం. ప్రతీ రంగంలోనూ ఎంఎసఎంఈలు పెట్టుబడులు పెట్టేందుకు ఆస్కారం ఉంది. ప్రధాని మోదీ ఇచ్చిన చిప్ టు షిప్ అన్న నినాదాన్ని నిజం చేసేలా తయారీ రంగంపై దృష్టి పెట్టాం. సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ అన్నది ప్రభుత్వ విధానమని వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా సీఎం సమక్షంలో మెటా, అమెజాన్, జోహో సహా వివిధ సంస్థలతో ఏపీ ఎంఎసఎంఈడీసీ ఒప్పందం కుదుర్చుకుంది. డీప్ టెక్ స్టార్టప్ కంపెనీలకు రూ.20 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసేందుకు సిడ్బీ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ఎంఎసఎంఈ గ్రోత్ సమ్మిట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం సందర్శించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నేతృత్వంలోని స్టార్టప్ కంపెనీలు తయారు చేసిన టెక్నాల జీ ఎనేబుల్డ్ హ్యాండ్ ఇతర ఐటీ, టెక్ ఉత్పత్తులు, డిఫెన్స్ ఉత్పత్తులు, బీహెచఈఎల్ తయారు చేసిన ఎలక్ట్రికల్ ఉత్పత్తు లు, ప్రైవేట్ సంస్థలు రూపొందించిన డ్రోన్ బోట్లు, వివిధ రకాల గిరిజన ఉత్పత్తులను సీఎం తిలకించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, డోలా బాలవీరాం జనేయ స్వామి, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తదితర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికా రులు హాజరయ్యారు.

Previous Post

కూటమి పాలనలో సాగునీటి రంగానికి పూర్వ వైభవం

Next Post

సముద్ర తీరం అభివృద్ధికి విజన్ ప్లాన్

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-07-2026

కార్యకర్త
@ July 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 10-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-07-2026

కార్యకర్త
@ July 10, 2026
మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం
ఆంధ్రప్రదేశ్

మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం

చైతన్యరధం
@ July 10, 2026
ఆంధ్రప్రదేశ్

22ఏ సంకెళ్లు తెంచిన ప్రభుత్వం

చైతన్యరధం
@ July 10, 2026
ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం
ఆంధ్రప్రదేశ్

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
ఏపీలో పాదరక్షల యూనిట్ ఏర్పాటు చేయండి 
ఆంధ్రప్రదేశ్

ఏపీలో పాదరక్షల యూనిట్ ఏర్పాటు చేయండి 

చైతన్యరధం
@ July 9, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు
ఆంధ్రప్రదేశ్

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
మారిటైమ్ వ్యాపారానికి ఏపీ అనుకూలం
ఆంధ్రప్రదేశ్

మారిటైమ్ వ్యాపారానికి ఏపీ అనుకూలం

చైతన్యరధం
@ July 9, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ July 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం

మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం

చైతన్యరధం
@ July 10, 2026

22ఏ సంకెళ్లు తెంచిన ప్రభుత్వం

చైతన్యరధం
@ July 10, 2026
ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
ఏపీలో పాదరక్షల యూనిట్ ఏర్పాటు చేయండి 

ఏపీలో పాదరక్షల యూనిట్ ఏర్పాటు చేయండి 

చైతన్యరధం
@ July 9, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist