- కూటమి వచ్చాక ట్రూడౌన్ అమలు చేశాం
- సంస్కరణలతో మిగులు విద్యుత్ సాధించాం
- ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం(చైతన్యరథం): మచిలీపట్నం బచ్చుపేటలో రూ.6.30 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 33/11కేవీ ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రానికి మంత్రి కొల్లు రవీంద్ర శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత చంద్రబాబుదే. గత ఐదేళ్ల జగన్ నిర్వాకంతో విద్యుత్ ఛార్జీలు, కష్టాలు పెరిగాయి మచిలీ పట్నంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసి చూపిస్తా మని స్పష్టం చేశారు. అత్యంత అధునాతన సదుపాయాలతో ఇండోర్ అండర్ గ్రౌండ్ సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టడం అభినం దనీయమన్నారు. మచిలీపట్నంలో 70 వేలు, రూరల్‌లో 30 వేలు, 3500 వరకు ఆక్వా కనెక్షన్లు ఉన్నాయి. ఆక్వాకు రూ.1.50, ఎస్సీ, ఎస్టీ, నాయి బ్రాహ్మణ, చేనేతలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రాష్ట్ర విభజనతో విద్యుత్ కొరత నెలకొన్నప్పటికీ 2014-19 మధ్య సంస్కరణలతో మిగులు విద్యుత్ సాధించాం.
సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తితో పాటు సోలార్, విండ్, హైడల్ విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇచ్చాం. నాణ్యమైన విద్యుత్ సరఫరా ఉన్నప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు వస్తాయి. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయడంతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షో భం మొదలైంది. యూనిట్ రూ.4కి చేసుకున్న ఒప్పందాల ను రద్దుచేసి రూ.18కి కొనుగోలు చేసి కమీషన్లు దండుకున్నారు. ట్రూ అప్ చార్జీల పేరుతో రాష్ట్ర ప్రజా నెత్తిన రూ.32 వేల కోట్ల ధరల భారం మోపారు. కూటమి అధికారంలోకి వచ్చాక చరిత్రలో తొలిసారిగా విద్యుత్ చార్జీలను తగ్గించి ట్రూ డౌన్ అమలు చేశాం. అనకాపల్లిలో 5000 కోట్ల పెట్టుబడితో సోలార్ ప్యానెల్ తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేశాం. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభు త్వం ప్రకటించిన సూర్యఘర్ పథకాన్ని ప్రతిఒక్కరూ సద్వినియో గం చేసుకోవాలి. నియోజకవర్గంలో 10 వేల కనెక్షన్లు లక్షల నిర్దేశించుకున్నామని వివరించారు. మచిలీపట్నం పోర్టు త్వరలో పూర్తికాబోతోంది. ఆధారిత పరిశ్రమలు వస్తాయి. అందుకు అవస రమైన స్థాయిలో విద్యుత్ సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
















